top of page

నమ్మితే ‘బురదగుంట’లో దిగినట్టే!

Writer: ADMINADMIN
  • నమ్మితే ‘బురదగుంట’లో దిగినట్టే!

  • ఐప్యాకప్‌ కావడంతో సోషల్‌ జపం

  • బాగా పని చేస్తే ప్రమోషన్లు ఇస్తారట!

  • మరోవైపు సోషల్‌ యోధుల్ని ఏరేస్తున్న ప్రభుత్వం

‘‘పసుపు బిల్ల పెట్టుకొని గవర్నమెంట్‌ ఆఫీసులకు వెళ్లండి.. కుర్చీవేసి టీ ఇచ్చి మరీ మీ పని చేసిపెడతారు.’’ ఇది రాష్ట్రమంత్రిగా అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్‌. దీన్ని గట్టిగానే ట్రోల్‌ చేశారు. కామెడీ చేశారు. కార్టూన్లు వేశారు. కానీ అచ్చెన్నాయుడు అన్న మాటను ఒక్క సోషల్‌మీడియా యాక్టవిస్టులే అర్థం చేసుకున్నారు. అది కూడా వైకాపా సోషల్‌ మీడియా ప్రతినిధులకు అర్థం కావడం కొసమెరుపు. జగన్‌ అధికారంలోకి రావడం కోసం గొడ్డుల్లా కష్టపడిన సోషల్‌ మీడియా యాక్టవిస్టులు ఆ తర్వాత కూరలో కరివేపాకైపోయారు. ఇప్పుడు మళ్లీ వారి అవసరమే వచ్చింది. సజ్జల దగ్గర నుంచి భూమన కరుణాకరరెడ్డి వరకు ఇప్పుడు వీరి పాటే పాడుతున్నారు. అసలు ఐదేళ్లలో ఏం జరిగింది? సగటు వైకాపా సోషల్‌మీడియా యోధుడి ఆత్మఘోష ఇది.



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సోషల్‌ మీడియా ఒక బురదగుంట

మన సోషల్‌మీడియాను కాపాడుకోవాలి: సజ్జల

ఇందులో మొదటి స్టేట్మెంట్‌ అధికార మదం నెత్తికి ఎక్కి కార్యకర్తలు అనేవాళ్లు పురుగుల్లా కనపడుతున్న రోజుల్లో అన్న మాట. అయితే రెండవది అరెస్టుకు భయ పడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకుని రక్షణ పొందిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్‌. సోషల్‌ మీడియా కార్యకర్తలు పోరాడండి, పార్టీ అండగా ఉంటుందని ఎంత సిల్లీ స్టేట్మెంట్‌ ఇచ్చారు సార్‌. ఈ ముక్క మీ పుత్ర రత్నం సజ్జల భార్గవ్‌ రెడ్డికి చెప్పి అతనితో రోజూ రాయించండి. అలాగే మేనల్లుడు అర్జున్‌రెడ్డితో రాయించండి. అధికారంలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా లేని వాళ్లిద్దరే కదా సోషల్‌ మీడియా సారధులు అధికారం పోగానే వాళ్లు వ్యాపారాల వైపు వెళ్లిపోతే అమాయకులు పోరాడి జైళ్లకు వెళ్లాలా?

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఐప్యాక్‌ ముద్దు.. సోషల్‌ మీడియా కార్యకర్తలు వద్దు.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పోరా డండి... ఉచితంగా జైలుకు వెళ్లి రండి.. ఐదేళ్ల తర్వాత మీ సేవలు గుర్తించి ప్రమో షన్‌ ఇస్తాం.. ప్రమోషన్‌ ఇవ్వడానికి ఇది లిమిటెడ్‌ కంపెనీనా? కంపెనీలు, వ్యాపారా లు నడిపి నడిపి రాజకీయ పార్టీలోకి ప్రమో షన్లు తెచ్చారు. వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లు లిమిటెడ్‌ కంపెనీ అని అందుకే అన్నారు.

మొన్న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేత లు, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సోషల్‌ మీడియా టీమ్‌ హెడ్స్‌, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రధానంగా సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఇది ఒక డ్రైవ్‌లాగా జరుగుతోందని చెప్పుకొచ్చా రు. ఇప్పటికే దాదాపు 50-60 శాతం మంది సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసు లు పెట్టారు. ప్రజలకు సరైన సమాచారం అందాలంటే సోషల్‌ మీడియా ఉండాలి. ప్రజల కోసం వాస్తవాలు వెల్లడిరచే సోషల్‌ మీడియా కార్యకర్తలను మనం కాపాడుకుంటే వారే మన గొంతుకగా నిలుస్తారన్నారు. ఇందుకోసం సీనియర్‌ అడ్వకేట్‌లు 24 గంటలు అందుబాటులో ఉండేలా సెంట్రల్‌ ఆఫీస్‌ టీం పని చేస్తుంది, సెంట్రల్‌ ఆఫీస్‌లో సీనియర్‌ లీడర్స్‌తో కూడిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కూడా మీకు అందుబాటు లో ఉంటుంది, ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సినా వెంటనే వారితో సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారని సెలవిచ్చారు.

సోషల్‌ మీడియా అంటే ఫోటోలు తీసే వారు అని అప్పటి ఎమ్మెల్యేలు పేరు పెట్టా రు. ఇలాంటి వాటిని నమ్మితే మళ్లీ మునిగి పోవడం ఖాయం. అధికారంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా యాక్టివిస్టుల మీద ఉన్న కేసులు ఐదేళ్లలో ఎత్తేయించలేకపోయిన విష యం జగన్‌ సలహాదారులు మర్చిపోయారు.

జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎవరు అయిన ఎంత కాలం మోస్తారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని మనం మోయాలి. జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవరినీ మోయడనే అంశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలలో కూడా ఏర్పడిరది.

ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ సోషల్‌ మీడియా ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు సొంత డబ్బు వెచ్చించి నారా లోకేష్‌ పని చేయించి వారికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు అనేది నిజం. ఈరోజు వైకాపా సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 47మంది కేసుల్లో ఇరుక్కున్నారు. వీరికి వైకాపా నుంచి ఎలాంటి సహాయం అందుతుందో తెలి యదు. సోషల్‌ మీడియాలో ఐయామ్‌ విత్‌ యు అని పెట్టుకోవడం లేదా ఐ సపోర్ట్‌ యు అని పెట్టుకోవటానికి తప్ప దేనికి పనికి రాదు. గతంలో జగన్‌ కోసం పోరాడినవారె వరినీ అక్కడ మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇన్‌ ఛార్జిలు గాని పట్టించుకున్న పాపానపోలేదు. అధికార పార్టీ మీద బూతులు తిట్టడం, చంద్రబాబు, లోకేష్‌ను ట్రోల్‌ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. జగన్‌మోహన్‌ రెడ్డికి అవసరం తీరాక ఆయన ఇంటి గేట్‌ కూడా వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్తలు తాకలేరు. వైకాపా సోషల్‌ మీడియాకు పని చేసిన అజయ్‌ అమృత్‌ మీద గంజాయి కేసు పెట్టారు అనే సంగతి దృష్టిలో పెట్టుకోవాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page