30 ఏళ్ల లోపే అపర కుబేరులు
ఫోర్బ్స్ సర్వేలో ఎక్కువ మంది భారతీయులే
- దుప్పల రవికుమార్
ప్రతి ఏటా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక తయారుచేస్తుందని మనకు తెలుసు కదా! ఈసారి పత్రిక ఒక నూతన పంథాను ఎంచుకుంది. 30 ఏళ్లలోపు కోటీశ్వరుల జాబితాను తయారుచేయాలని ప్రయత్నించింది. ఇంకా మూడు పదులు నిండని నవయవ్వన కిశోరాలలో సంపాదించే సామర్ధ్యం ఎంతుందో తెలుసుకోవాలని ప్రయత్నించింది. అలా సమాచారం సేకరిస్తున్న కొద్దీ ఫోర్బ్స్ పత్రిక సంపాదకులు నిబిడాశ్చర్యంలో మునిగిపోయారట. నూనూగు మీసాల నూతన యవ్వనం నుంచి మొదలుపెట్టి మూడు పదులు నిండకుండానే ఈ యువగడుగ్గాయిలు చేస్తున్న వ్యాపారాలు తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో తేలిపోయారట. ఇదే రేటులో వీరు సంపాదిస్తూపోతే అనతి కాలంలోనే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రికార్డులను బద్దలుగొట్టి, ఇంతవరకూ భూమి మీద ఎవరూ చూడని సంపదను సృష్టించబోతున్నారని విస్తుపోతున్నారు. ఫోర్బ్స్ పత్రిక సంపాదకులు మాటల్లోనే చెప్పాలంటే, ‘‘వీరంతా డబ్బు సంపాదనకు వస్తువులను అమ్మడం లేదు. భౌతిక వస్తువులను ఒక చోటనుంచి మరో చోటుకు చేర్చడం లేదు. వినియోగదారుడిని సంతృప్తి పరచడానికి మార్కెట్లో తాము అమ్ముతున్న వస్తువుకు సరసమైన ధర ప్రకటించడం లేదు. వీరంతా వినూత్న పంథాలో వెళ్లడమే దానికి కారణం’’. సీనియర్ సంపాదకులు క్రిస్టిన్ స్టోలర్, స్టీవెన్ బెర్టోని, ఒలీవియా పెలూసోలు ఈసారి సంపాదకులుగా వ్యవహరించారు.
ఇలా 30 ఏళ్లలోపు సంపన్న యువతీయువకుల జాబితా తయారుచేయడం ఇది పదమూడోసారి. ఈ పదమూడవ సంచికలో విశేష ప్రభావితం చేస్తూ చోటు సంపాదించుకున్న యువతలో ఎక్కువ మంది భారతీయులు ఉండడం మనల్ని సంతోషపరిచే విషయం. ఈసారి ధనం సంపాదించడంలో యువతకు కృత్తిమ మేధ ఎక్కువగా ఉపయోగపడిరదని సంపాదకులు చెప్పారు. మాన్యుఫాక్చరింగ్ (తయారీ)లో మాత్రమే కాక కృత్తిమ మేధను ఇప్పటి యువ వ్యాపారవేత్తలు చాలా పెద్దఎత్తున మార్కెటింగ్‌లో కూడా వాడుతున్నట్టు వారు తెలిపారు. మొత్తంగా 20 రకాల పరిశ్రమలను పరిగణనలోకి తీసుకుని యువ వాణిజ్యవేత్తలను ఈ సంచిక తయారీ కోసం పరిశీలించినట్లు వారు తెలిపారు. ఫోర్బ్స్ బృందంతో పాటు ఈ ఏడాది స్వతంత్ర న్యాయనిర్ణేతలుగా అలెక్స్ కూపర్, నటుడు అయో ఎడెబిరి, క్రీడాకారుడు డెవిన్ బ్రూకర్, గిట్‌హబ్ సంస్థ సిఇఓ థామస్ డోంకేలు వ్యవహరించినట్లు తెలిపారు. వీరంతా దాదాపుగా 11 వేలమంది అభ్యర్థులను పరిశీలించారు. బృందంలోని సభ్యులు వార్షిక టర్నోవర్‌పై దృష్టి పెడుతూనే మరికొన్ని ముఖ్యమైన అంశాలపైన ప్రత్యేకంగా కన్ను వేశారట. అవి ఫండిరగ్ (నిధులు సేకరించే విధానం), రెవిన్యూ (వివిధ రూపాలలో వస్తున్న వార్షికాదాయం), సామాజికంగా ఎంత మేరకు ప్రభావితం చేస్తున్నారన్న ప్రాతిపదిక, పరిశోధనాత్మకత, వినూత్నత్వం, ముఖ్యంగా ఎంతమేర భవిష్యత్తులో శక్తిమంతంగా ఉండబోతున్నాయి అన్న అంశాలు.
లాంగ్ కోవిడ్ కండిషన్ అంటే?
దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇద్దరు కవల సోదరులు వేగా సాంజ్, మైఖెల్ ఇద్దరూ ఇన్సూరెన్స్ రంగంలో కృషి చేశారు. వీరికి 27 సంవత్సరాలు. వీరు లులా అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇందులో కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడానికి ఏం చేశారంటే, కృత్తిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి, ఏరోజు వాడితే ఆ రోజు చొప్పున సుమారు 5000 కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించే పని విజయవంతంగా చేశారు. లాజిస్టిక్స్, కార్ రెంటల్ కంపెనీలకు ఎంతో సేవ చేసినట్లు వారు భావించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదాయం పెంచినట్లయింది. అదేమాదిరిగా ఒక షిప్పింగ్ కంపెనీ కూడా కృత్తిమ మేధను ఉపయోగించి ఫ్లెక్స్‌పోర్ట్ అనే సంస్థను స్థాపించి 45 మిలియన్ డాలర్లను ఫండిరగ్ కోసం సేకరించారు. లాజిస్టిక్స్‌లో ఇది ఒక రికార్డుగా చెప్తారు. ఆర్ట్, స్టైల్ రంగంలో 28 ఏళ్ల కెండాల్ జెన్నర్ 818 అనే రకపు టెకీలాను కిందటేడాది ఒక లక్ష 23 వేల కేసులను అమ్మి రికార్డు సృష్టించాడు. సంగీతకారిణి 25 ఏళ్ల ‘లాట్టో’ స్టీఫెన్స్ కిందటేడాది తన ట్రాక్‌ల అమ్మకాలతో 12 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇలా వివిధ రంగాలలో యువతరంగాలు విజృంభించి సంపద సృష్టిలో తలమునకలుగా ఉన్నారని తేలింది.
భారతీయ బిలియనీర్స్
అర్పన్ చందేల్ (రాజు) - వినోదం
పవిత్ర చారి -వినోదం
యష్ అగర్వాల్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
ఆలేష్ అవ్లానీ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
శ్రీనివాస్ సర్కార్ & కుషాగ్రా మాంగ్లిక్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
అంకిత్ దామ్లే - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
యశ్వర్ధన్ కనోయ్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
మనీష్ మర్యాద - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
అనూజ్ శ్రీవాస్తవ & ప్రియేష్ శ్రీవాస్తవ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
ఉదిత పాల్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
సీతాలక్ష్మి నారాయణన్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
సాగర్ సేఠ్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
పూజా షిరాలీ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
జై సుమేర్ సింగ్ - ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్
ఆశిష్ వనిగోటా - ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్
ఆర్యమాన్ వీర్ - ఆర్యమాన్ వీర్
కునాల్ అగర్వాల్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
ముకుల్ ఆనంద్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
గౌరవ్ పీయూష్, మయాంక్ వర్షిణి & యష్ శర్మ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
అర్చిత్ చౌహాన్, షైఫాలీ జైన్ & సన్నీ గార్గ్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
ఆదిత్య దాడియా - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
ఆర్యన్ శర్మ & ఆయుష్ పాఠక్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
అదితి సిన్హా & రిషబ్ జైన్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
హర్షిత్ మిట్టల్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
ఈషా మణిదీప్ దిన్నె & వరుణ్ వుమ్మడి - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
అంకిత్ బన్సల్, ఇషాన్ రక్షిత్ & ప్రియ రంజన్ - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
స్మార్ట్‌వీర్ సిదానా - ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ
కవన్ అంటాని - మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్
సంకేత్ జైన్ - మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్
సిమ్రాన్ జైన్ - మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్
Comments