top of page

నువ్వు బాలెన్షా అయితే.. మేం బాద్‌షా

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 6 days ago
  • 3 min read
  • భారత్ మీద సుంకాలపై వెనక్కు తగ్గిన నేపాల్

  • పొరుగు దేశం నట్టు`బోల్టు బిగించిన ఇండియా

  • సీత పుట్టిన దేశంలో తిరగబడ్డ జనం


భారతదేశం నేపాల్ మధ్యలో రాముడికి, సీతకు మధ్య ఉన్న బంధం ఉందనుకున్నాం. ఎందుకంటే.. సీతాదేవి పుట్టిన ఊరు నేపాల్ అని, అక్కడ ఒక గుడి కూడా ఉందని మనం చెప్ప్పుకుంటాం. కానీ కొత్తగా నేపాల్‌కు ప్రధానమంత్రి అయిన బాలెన్షా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా కావడానికి ట్రై చేశాడు. భారత్ వస్తువులను నేపాల్ ప్రజలు కొంటే 80 శాతం టాక్స్ కట్టాలనే కొత్త రూల్ పెట్టాడు. ఈ రూల్ ముందు నుంచి ఉంది. దాన్నే ఇంప్లిమెంట్ చేశాడు. భారత్ నుంచి కొన్న వస్తువులపై ఎమ్మార్పీ స్టిక్కర్స్ వేయాలని చెప్పి ఇంకొక రూల్ పెట్టాడు. భారత్‌లోని యూపీ, వెస్ట్ బెంగాల్‌ను నేపాల్‌లో కలిపి గ్రేటర్ నేపాల్ మ్యాప్ ఒకటి తయారుచేశాడు. 2025లో జెన్ జి రివల్యూషన్ ద్వారా కేపీ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన వ్యక్తి బాలెన్షా జియో పాలిటిక్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్ అనుకున్నాడు. జాగ్రఫీ అంటే ఫేస్‌బుక్‌లో లైవ్ రావడం అంత ఈజీ అనుకున్నాడు. ఇండియాతో గేమ్స్ ఆడాలని చూశాడు. ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా బాలెన్షా పెట్టిన అన్ని రూల్స్‌ను రద్దు చేసుకునేలా చేశారు. కొన్నిసార్లు గన్ చేయలేని పని పెన్ చేస్తుంది. భారత్ తెచ్చిన ఒక్క రూల్ ఏంటి? ఆ ఒక్క సిగ్నేచర్‌తో ఎందుకని నేపాల్ టారీఫ్ రూల్స్‌ను, ఎమ్మార్పీ రూల్స్‌ను తుడిచిపెట్టేసింది.

ఇండియా నేపాల్ మధ్య 1800 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. 1950 నాటి ఒప్పందంలో భాగంగా ఇండియా నేపాల్‌కు నేపాలీస్ ఇండియాకు వితౌట్ వీసా, పాస్‌పోర్ట్ ఫ్రీగా వెళ్లి రావచ్చు. నేపాల్ ఇండియాకు సంబంధించి వెస్ట్‌బెంగాల్, బీహార్, సిక్కిం, జార్ఖండ్, యూపీ వంటి రాష్ట్రాలతో బార్డర్‌ను షేర్ చేసుకుంటుంది. నేపాల్ అమ్మాయిలను ఇండియన్ అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. వాళ్లు కూడా అంతే. అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా నేపాలీస్‌తో చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఎంతోమంది నేపాలీస్ ఇండియన్ ఆర్మీలో పని చేశారు. నేపాలీ గూర్ఖాల కోసం మనందరికీ తెలుసు. భారత స్వాతంత్య్రం కోసం ఎన్నో యుద్ధాల్లో నేపాలీస్ పోరాడారు. అందుకు మనం సెల్యూట్ చేయాలి. ఇండియన్ సిటీస్‌లో వేలు లక్షల మంది నేపాలీస్ ఎన్నో ఏళ్ల నుంచి వీసా పాస్‌పోర్ట్ లేకుండా ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నారు. నేపాల్ ఒక మెడిసిన్‌ను ఇంపోర్ట్ చేయాలన్నా ఇండియా నుంచే కొనుక్కోవాలి. నేపాల్ చాలావరకు వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవాలంటే.. వైజాగ్, కోల్‌కతా పోర్ట్‌లో ఫస్ట్ ఆ వస్తువులు ల్యాండ్ అవ్వాలి. ఆ తర్వాత బై రోడ్ యూపీ, వెస్ట్‌బెంగాల్ వయా నేపాల్‌కు చేరుకుంటాయి. నేపాల్ ఒక్క చుక్క పెట్రోల్ లేదా జెట్ ఫ్యూయల్ తయారుచేసుకోదు. అన్నిటిని ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలియని బాలెన్షా మార్చ్ 2026లో పిఎం అయ్యాడు. ఏప్రిల్ 13న బాలెన్షా 100 టారీఫ్‌ను విధించాడు. ఇండియాపైనే విధించాడు. ఇక్కడ ఇండియా నష్టపోయేది ఏమీ లేదు. నష్టపోయేది నేపాల్‌లో ఉన్నవారే. డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ ఎందుకు వేసాడు? కంపెనీస్ అన్నీ అమెరికాలో రావాలని. ఇండియన్ కంపెనీస్ అన్ని నేపాల్‌కి వస్తాయా? నేపాల్ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా లేవు. నేపాల్ జాగ్రఫీ కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎన్నో లాజిక్స్ బాలెన్షా మిస్ అయ్యాడు.

100 శాతం తర్వాత నేపాల్ బార్డర్‌లో ఉన్న బెర్గూన్స్, బిరాత్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ఇలా సడన్‌గా టాక్స్ వేస్తే ఎలా? మా దగ్గర డబ్బులు లేవంటూ తిరగబడ్డారు. బాలెన్స్ షా హీట్‌ను ఫేస్ చేశాడు. ఇండియా సైలెంట్‌గా ఒక కొత్త రూల్‌పై సైన్ చేసింది. ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి.. మేము నేపాల్‌కు అమ్మే పెట్రోల్‌పై రూ.30 జెట్ ఫ్యూల్‌పై రూ.31 ధర పెంచుతున్నామని ఒక బాంబ్ ఇండియా పేల్చింది. ఏప్రిల్ 14న టాక్స్ రూల్‌ను బాలెన్ష ఇంప్లిమెంట్ చేశాడు. ఏప్రిల్ 18 కాట్మాండోలో ఈ రూల్‌కు అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ జరిగింది. ఏప్రిల్ 29న నేపాల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈ 100 శాతం టాక్స్ రూల్‌ను రద్దు చేసింది. ఇండియా నుంచి బల్క్‌గా కొనే ప్రతి ఒక్క వస్తువుపై ఎమ్మార్పీ స్టిక్కర్‌ను నేపాల్ బార్డర్ దగ్గరే వేయాలని కొత్త రూల్ పెట్టాడు బాలన్షా. ఈ రూల్ ఎందుకు పెట్టాడు? ఇది మంచిదే. దాని వల్ల మనకొచ్చిన నష్టం లేదు. అయితే నేపాల్ ప్రజలు నేపాల్ వ్యాపారస్తులు ఈ రూల్‌కు అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేశారు.

ఫస్ట్ ఇండియాలో ఉన్న ప్రజలకు 100 శాతం ఎల్‌పీజీ సప్లై చేసి మిగిలితే నేపాల్‌కు ఇస్తామని చెప్పి సాఫ్ట్‌గా ఒక రూల్‌ను ఇండియా తీసుకొచ్చింది. నేపాల్ ఇండియాకు అమ్మే టీ ఎక్స్‌పోర్ట్ రూల్స్‌పై చిన్న చేంజ్ చేసింది. ఈ చేంజ్ వల్ల బాలెన్షి ప్రభుత్వం షేక్ అయింది. నేపాల్ ఉత్పత్తి చేసే 100 శాతం టీలో 90 శాతం ఇండియాకే ఎగుమతి చేస్తున్నారు. దీనివల్లే నేపాల్ 4 బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. టీ వ్యాపారాలు, టీ వ్యవసాయంలో 50వేల మంది నేపాలీలు పని చేస్తున్నారు. టీ వ్యాపారం అనేది డొమెస్టిక్ ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా కల్పిస్తోంది. ఇంతకుముందు 10 టీ ట్రక్స్ ఇండియాలో ఎంట్రీ ఇస్తే ఒక్క ట్రక్‌లో ఉన్న టీకు మాత్రమే ఒక శాంపుల్ టీకు మాత్రమే ల్యాబ్ టెస్ట్ చేసి క్వాలిటీ చెక్ చేసి మిగతా తొమ్మిది ట్రక్స్‌ను వదిలేసేవారు. ఇప్ప్పుడు ప్రతి ఒక్క ట్రక్‌లో ఒక్కొక్క శాంపుల్ తీసుకోవాలి. క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి ఈ రూల్ తీసుకొచ్చారు. ఒక్క ల్యాబ్ టెస్ట్‌కు రూ.12వేలు అంటే.. ఇక్కడ లక్షలకు లక్షలు టెస్ట్‌లకే వేస్టవుతోంది. నేపాలీ వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ఇన్ని ల్యాబ్ టెస్టులు చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. టైం వేస్ట్ అయింది అంటే.. వ్యాపారం లాస్ అన్నమాట. ల్యాబ్ టెస్ట్ ఫెయిల్ అయితే రీటెస్ట్‌కు ఇంకొక రూ.15వేలు మళ్లీ మదుపు పెట్టుకోవాలి.

టీ వ్యాపారస్తులు బాలెన్షాకు దండం పెట్టి నీ కొత్త రూల్స్‌కి ఒక దండం.. నువ్వు ఆపవయ్యా స్వామి అంటున్నారు. నీ టారీఫ్ రూల్స్ ఏంటో గానీ ఇండియా మా తాట తీస్తోంది అంటున్నారు. ఈ చెత్త రూల్స్‌ను తీసి వేస్తావా లేదా ప్రొటెస్ట్ చేయాలా అని చెప్పి టీ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ వ్యాపారస్తులందరూ బెదిరించేసరికి బాలెన్షా దారికొచ్చాడు.

ఇండియాను సైడ్‌లైన్ చేయడానికి ట్రై చేశాడు. ఇండియా, చైనాపై నిఘాను ఉంచడానికి నేపాల్‌ని ఒక వాచ్ టవర్‌లా అమెరికా వాడుకోవాలని ట్రై చేస్తుంది. బంగ్లాదేశ్‌లో కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇలాగే దించేసింది. చైనాను తమ పోర్టులో చేర్చినందుకు శ్రీలంక దివాలా తీసింది. ఆఫ్రికా దేశాలు ఇలాగే అమెరికా ట్రాప్‌లో పడ్డాయి. అప్పులు తీర్చలేక చచ్చిపోయాయి. నేపాల్ చైనాతో ఎంగేజ్ అయ్యి డెడ్ ట్రాప్‌లో ఇరుక్కుంటాడా అమెరికాతో ఎంగేజ్ అయ్యి గెంటేయబడతాడా? లేదా ఇండియాతో ఎంగేజ్ అయి స్మార్ట్‌గా ఆడతాడా అనేది చూడాలి. ఆల్ ద బెస్ట్ టు నేపాల్.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page