
నీకు ఏమైతే మాకేంటి? నీవు ఎలా పోయినా మాకు ఫర్వాలేదు. నీ బెయిల్ రద్దయి మళ్లీ సంవత్సరాల తరబడి జైళ్లో మగ్గినా మాకు ఎలాంటి పట్టింపు ఉండదు. అరె మాకోసం జైలుకు కూడా వెళ్లలేవా? నీవేం కొడుకువి? నీవేం అన్నవి? ఒకసారి వెళ్లావుకదా. మళ్లీ వెళ్లు. అంతమాత్రానికే భయ పడతావా! నీ చుట్టూ నీ శత్రువులు మూగి కరాళ నృత్యం చేస్తూ నిన్ను నాశనం చేస్తే చేయనీ. వాళ్లతో కలిసి నాలుగు నృత్యాలు చేస్తాం. నీకు ఏమైనా ఫర్వాలేదు. నీ ఆస్తుల్లో సగం మాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలి. అది నాన్న అభిమతం. నీ ఆస్తుల్ని సగం నాకు ఇవ్వాలన్న నాన్న అభిమతం నెరవేరడం కోసం ఆయన ఇతర అభిమతాలను కట్టకట్టి కాల్చేసి బాబు అండో కో కాళ్ల చుట్టూ తిరుగుతున్నాం. అది కూడా నీకు అర్థం కాలేదా? ఏమైనా చేస్తాం. మేం కావాలనుకున్నవన్నీ మాకు కావాలి. నీవు ఏమైపో యినా ఫర్వాలేదు. గెలిచిన రోజునుంచీ ప్రజలకే తప్ప మాకంటూ పథకాలు లేకుండా చేశావ్. మా కంటూ పథకాలు లేకపోతే మేము ఏం కావాలి? అందుకే మొన్నటి ఎన్నికల్లో నీ ప్రత్యర్థుల చేతిలో ఒక పావుగా మారి మా చేతనైనంత సహకరించి నీవు మట్టి కరిచేలా చేశాం. నీ వ్యక్తిత్వాన్ని పలుచన చేశాం. ఎగతాళి చేశాం. కష్టాలు పడతావో, నష్టాలు భరిస్తావో నీ చావు నీవు చావు. కష్టాలు నీకేం కొత్తనా? నీ గురించి, నీపార్టీ గురించి, నిన్ను నమ్ముకున్న లక్షలాది కుటుంబాల గురించి, నీ ప్రజాదరణ పొందిన పథకాల గురించి, నీ వెంటున్న నేతల గురించి, కార్యకర్తల గురించి, నీ సంస్థల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల గురించి మాకు ఎలాంటి పట్టింపు లేదు. నీవు మేం చెప్పినట్టు నడుచు కోవాలి. దట్సాల్. లేకపోతే నీపై కేసులు పెట్టి జైలుకు పంపినోళ్లతో కలిసి మేం కూడా బురద చల్లడం కొనసాగిస్తూనే ఉంటాం. తుడుచుకో.. పొద్దున చల్లుతాం.. సాయంత్రం చల్లుతాం.. నిత్యం చల్లుతాం.. తుడుచుకో.. నీకు ఇంకో పని లేదు. నిన్ను ఇలాగే హింసిస్తాం. మాకు బాబు అండ్ కో అండ ఉంది. ఖబడ్దార్ జగన్. రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆస్తిలోను, అధికారంలోను షర్మిలకు కూడా ఎంతోకొంత వాటా దక్కడం న్యాయం. అయితే ఇక్కడ షర్మిలకు న్యాయం జరగలేదంటారు వేమూరి రాధాకృష్ణ. వైఎస్ రాజ శేఖరరెడ్డి బిడ్డగా ఆమెకు రావాల్సిన ఆస్తి ఎంతోకొంత ఎందుకు.. ఎవరెన్ని తిరకాసులు పెట్టినా ఆమెకు హక్కుగా రావాల్సింది ఎలా అయినా ఎంత రావాలో అంతా వస్తుంది. కానీ జగన్ వ్యాపారంలో సంపా దించిన దానిలో ఎంత సొంత చెల్లెలైనా కానీ చట్టపరంగా అయితే ఆమెకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు పేరు మీద చెన్నై బజుల్లా రోడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో 8వేల చదరపు అడుగుల బంగ్లా ఉంది. ఆ బంగ్లాను ఎవరూ పట్టించుకోకుండా అలా వదిలేయడంతో పాడుబడిపోయిందని, నందమూరి వారసులు ఆ ఇల్లు అమ్మకానికి పెడదామనే ఆలోచనలో ఉన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. అమ్మేసుంటే ఎంతకమ్మారు? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చారా? లేదా ఆ ఇంటిని ఎన్టీఆర్ స్మారక మ్యూజియంలా తయారుచేయాలని అభిమానులు ఆశించిన ట్లుగా వారసులేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? వీటికోసం కూడా మన మీడియాలో వార్తలొస్తే బాగున్ను. ప్రపంచంలోకెల్లా అత్యంత నికృష్టమైన రాజకీయాలకు అడ్డా ఏపీనే. అన్నమీద కోపంతో అయ్య పేరు చెప్పుకొని తెలంగాణలో షర్మిల తిరిగారు. గతంలో ఆమె సమైక్యవాది. జనం ఛీకొట్టేసరికి తత్వం బోధపడిరది. అప్పటికే కోట్లు ఖర్చయిపోయాయి. ఏ కుటుంబమైతే తమకు ద్రోహం చేసిందో ఆ కాంగ్రెస్ పంచనే చేరింది. కాంగ్రెస్ అంటేనే ఓ దగుల్బాజీ పార్టీ. ఇప్పుడు కాగల కార్యం షర్మిల తీరుస్తోందన్నట్టుగా ఇప్పుడు టీడీపీ, దాని మీడియా ఖుషీగా ఉంది. ఏ చంద్రబాబు తన కుటుంబాన్ని తొక్కాడో, అదే చంద్రబాబు మళ్లీ కుర్చీ ఎక్కారు. అంటే అదే చెల్లి అన్నను భ్రష్టుపట్టించింది. ఆమె ఇప్పుడు అమాయకంగా నీకు ప్రేమలకన్నా ఆస్తులు ఎక్కువా? అని అడుగుతుంది. మరి ఆస్తుల కోసమే కదా షర్మిల వైఎస్ కుటుంబ ద్రోహులతో చేతులు కలిపింది. లేడీ విభీషణ అవతారమెత్తింది. అంటే ఇక్కడ జగన్ రావణాసురుడని కాదు. ఒకవేళ అలా అనుకున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. కాకపోతే చంద్ర బాబును రాముడనుకుంటున్న ఆమె అజ్ఞానమే ఆశ్చర్యం. ఇప్పుడు సరస్వతి షేర్ల బదిలీ మీద వివాదం. నన్ను వ్యతిరేకించి, నా ప్రత్యర్ధులతో చేతులు కలిపి నన్ను బద్నాం చేస్తావా అనేదే జగన్ అభ్యంతరం. అందుకే తల్లీ లేదు, చెల్లీ లేదు అనే అభిప్రాయానికి వచ్చారు. సహజంగానే భారతి ప్రభావం ఉం టుంది. ఈ షేర్ల బదిలీ వెనుక టీడీపీ కుట్ర, బెయిల్ రద్దు దుర్మార్గం ఉందని జగన్ అంటున్నారు. ఇక్కడ ఎవరైనా రాజకీయమే ఆలోచిస్తారు. ఐదేళ్లూ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ఇటు వంటి స్కెచ్‌లో ఉండరని భావించక్కర్లేదు. ఎందుకంటే.. జగన్మోహన్‌రెడ్డి సరైనోడు ఒక్కడ్ని ఎంపిక చేసుకోలేదు. ఇప్పుడు జగన్ కోసం మాట్లాడే తటస్థుడు కరువైపోయాడు. సాయిరెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వారు మాట్లాడితే జగన్ మోచేతినీళ్లు తాగినవారే కదాని షర్మిల తీసిపారేస్తోంది.
תגובות