మొక్కలు నాటిన జనసైనికులు
(సత్యంన్యూస్, ఆమదాలవలస)

పరిసరాల్లో పచ్చదనం పెంచినప్పుడే ఆరోగ్యంగా జీవించగలమని జనసేన పార్టీ ఆమదాలవలస ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ తరఫున మండల ప్రధాన కార్యదర్శి బగ్గు అప్పలరాజు నేతృత్వంలో తెలికిపెంట సచివాలయంలో ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు బహుకరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి జనసేన మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఉపాధ్యక్షులు తులగాపు ధనంజయ, సంగంశెట్టి తేజస్విరావు, మండల నాయకులు కనపాక జగదీశ్వరరావు, ఎం.నాగరాజు, పి.అశోక్, గ్రామ పెద్దలు నందివాడ కృష్ణ, అరసవల్లి సన్యాసిరావు, టంకాల హరికృష్ణ, జనసైనికులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments