
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎంతసేపు కార్యకర్తలను వాడుకున్నాం.. జమీలి ఎన్నికలు వస్తున్నాయి.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తాం..’ అంటూ కొత్తగా డైలాగులు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుని నుంచి ఇన్‌ఛార్జిల వరకు ఇదే పాట పాడుతూ ఉన్నారు. కార్యకర్తల కోసం ప్రమాద బీమా, కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టండి అంటే ఎక్కడ లేని బాధలు వస్తాయి. పార్టీ నుంచి డబ్బు పెట్టాలి అంటే బాధ.. పార్టీ డబ్బు పెట్టలేనప్పుడు పార్టీకి ఎందుకు పనిచేయాలి? గుర్తింపు లేనప్పుడు ఎవరైనా ఎందుకు పని చేస్తారు? జగన్‌మోహన్‌రెడ్డి నేను పలావ్ పెట్టా... చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నారు.. ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు.. అనే మాటలు మానుకొని కార్యకర్తల గురించి ఆలోచించకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని చరిత్రలో చదువుకోవాలి. నేను ఫోన్ వాడను అంటారు. ఫోన్ వాడితే జనాలు మీ గురించి వైకాపా కార్యకర్తలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకుంటే బాగుండేది జగన్ మోహన్ రెడ్డి. కనీసం టీడీపీ, జనసేన పార్టీలను చూసి సిగ్గు తెచ్చుకోండయ్యా. మీకన్న వెనుక పార్టీ స్థాపించిన జనసేన కార్యకర్తలకు ప్రమాద బీమా ఉంది. వైకాపా లిమిటెడ్ కంపెనీ కొత్త సంవత్సరంలో అయినా పాఠాలు నేర్చుకోరా? టీడీపీ నుంచి కొత్త పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటారో? వైకాపా కార్యకర్తలకు కనీస ప్రమాద బీమా కల్పించలేని దుస్థితిలో వైకాపా అధిష్టానం ఉంది అంటే దానికి సిగ్గుపడాలి. ఎంతసేపు సెంటిమెంట్, కార్యకర్తలను రెచ్చగొట్ట డం, జమిలి ఎన్నికలు వస్తున్నాయి, క్యాడర్ ఆక్టివ్ కావాలని పదేపదే రెచ్చగొడుతూ ఉన్నారు. పార్టీ అధ్యక్షుని నుంచి వైకాపా ఇన్‌ఛార్జీల వరకు కార్యకర్తల రెక్కల కష్టం దోచుకొని అందలం ఎక్కారు. వైకాపా అధిష్టానం చెవులు, కళ్లు పనిచేయవు అని వైకాపా నాయకులే చెబుతున్నారు. టీడీపీ నుంచి తక్షణం నేర్చుకోవలసిన అంశం కార్యకర్తలకు ప్రమాద బీమా. తెలుగుదేశం పార్టీ తన పార్టీ కార్య కర్తల కోసం బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. త్వరలోనే కోటి సభ్యత్వాల వరకూ నమోదవుతాయని భావించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు బీమా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చు కున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు బీమా సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో 42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. నారా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఇప్పటి వరకూ కార్యకర్తల సంక్షేమం కోసం 138 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేసాం.. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసాం.. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెసిడె న్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నాం’ అని టీడీపీ నేత లోకేష్ అంటున్నారు. టీడీపీ సభ్యత్వాల కోసం 100 రూపాయలు ఇవ్వండి అని కాకుండా చంద్రన్న బీమా అంటూ ప్రజల నుంచి సభ్యత్వ రశీదులు కట్ చేశారని వైకాపా ఆరోపిస్తోంది. అందులో తప్పేముంది? 100 రూపా యలు పార్టీ సభ్యత్వం కింద చెల్లిస్తే రూ.5 లక్షలకు ఇన్సూరెన్స్ వస్తుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోతే అండగా ఆ సొమ్మే నిలుస్తుంది. అటువంటప్పుడు దానికి ఏ పేరు పెట్టినా తప్పులేదు. ప్రతీ ఏడాది ప్రీమియం చెల్లించడం కోసం శాశ్వత సభ్యత్వం కింద రూ. లక్ష టీడీపీ నాయకులు కట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సొమ్ముతోనే పేద టీడీపీ కార్యకర్తలకు సంక్షేమం వర్తింపజేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లూ పప్పు అని ఉడికించిన లోకేష్ పార్టీ కోసం ఇంత ఆలోచిస్తున్నారంటే రాజశేఖరరెడ్డి కొడుకుగా జగన్మోహన్‌రెడ్డి కార్యకర్తలను ఈసరికే ఆదుకుని ఉండాల్సింది. ఇప్పుడు పప్పు ఉడకాలంటే కిందన నిప్పు ఉండాలని, ఆ నిప్పు కూడా లోకేషేనని వైకాపా గుర్తిస్తే మంచిది.
Comentarios