పెద్దోళ్లు.. చిన్నోళ్లు.. ఆక్రమణలో అదే తీరు
- SATYAM DAILY
- May 23
- 2 min read
కాలువలు కప్పేస్తున్నా పట్టించుకోని కార్పొరేషన్
చిన్నపాటి వర్షానికే వీధులు నిండుతున్నాయ్?
డెబ్రిస్ తీయలేని పరిస్థితి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో కార్పొరేషన్ కాలువల పక్కనుంచి వెళ్తున్నారా? అయితే ముక్కు మÖసుకోవాల్సిన అగత్యం మీకు తప్పింది. కాకపోతే కళ్లు మÖసుకొని నడవాలి. ఎందుకంటే.. మున్సిపల్ యంత్రాంగం అదే పని చేస్తుంది కాబట్టి. ప్రధాన రోడ్ల మీద ఉన్న లోతైన కాలువల కోసం కాస్త పక్కన పెడితే, జనాలుండే వీధుల్లో చిన్న చిన్న డ్రెయిన్లను సైతం కప్పేసి కమర్షియల్‌గా వాడుకుంటూ కనీసం మురుగునీరు ప్రవాహానికి కూడా అవకాశం ఇవ్వని ప్రబుద్ధులు ఎందరో. నిన్నటి వరకు అక్కడ పారిశుధ్య కార్మికులకు కనిపించిన కాలువ నేడు సడన్‌గా మాయమవడంపై ఎవరూ మున్సిపల్ హెల్త్ విభాగానికి ఫిర్యాదు చేయరు. స్థానికులెవరైనా ఇళ్ల నుంచి మురుగునీటి ప్రవాహం ఆగిపోయిందని అధికారులకు చెప్పాలంటే దీనికోసం గ్రీవెన్స్‌కు వెళ్లాలి. ఎండలో నిలబడాలి. ఫొటోలు సాక్ష్యాలుగా పెట్టాలి. ఇంతా చేసిన తర్వాత ఆ కాలువ ఆక్రమణల చెర నుంచి విడుతుందన్న గ్యారెంటీ లేదు. సందుగొందుల్లో డొమస్టిక్ ప్లాన్ తెచ్చుకొని, దానికి కమర్షియల్ యÖసేజ్ కింద షట్టర్ బిగించి కాలువ వరకు చప్టాను తయారుచేసి, అద్దులకు ఇచ్చేసి సొమ్ములు గడించేద్దామన్న ఆలోచనే తప్ప.. ఒక వీధిలో ఒక చిన్న కాలువ మురుగునీరు ప్రవాహానికి సరిపోవడంలేదని, ఇప్ప్పుడు ఆ సన్నని కాలువను కూడా కప్పేస్తే వీధిలో మిగిలినవారి పరిస్థితి ఏమిటనే ఆలోచన లేకపోవడం విడ్డూరం. పైగా తమకు రాజకీయ పలుకుబడి ఉందని, అందుకే ఇలా నిర్మిస్తున్నా ఎవరూ అడగడంలేదన్న తలబిరుసొకటి. ఇది ఏ వీధికో, ఏ ప్రాంతానికో సంబంధించినది కాదు. ప్రతీ సందులో ఇప్ప్పుడీ ఫొటోలో కనిపిస్తున్న లాంటి దృశ్యాలు పదుల సంఖ్యలో ఉంటాయి. నిత్యం వార్డుల్లో పర్యటించాల్సిన ఎమినిటీ సెక్రటరీలు, ఆ ఇళ్లకు ప్లానిచ్చిన ప్లానింగ్ సెక్రటరీలు ఆ రోడ్ల వెంబడి కళ్లు మÖసుకొని వెళ్తుంటారు కాబట్టి మనమÖ మÖసుకోవాలని వారి ఉద్దేశం. ఇప్ప్పుడు ఇందుకు ఒక్క ఉదాహరణ చూద్దాం.
తుమ్మావీధిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన కడుతున్న ఇంటితో కాలువ పూర్తిగా మÖసుకుపోయింది. అంతేకాకుండా నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కాలువ ఆక్రమణే లక్ష్యంగా చేసుకున్నారు. మొదటగా మున్సిపల్ కాలువను రోడ్డు వైపు తిప్పే యత్నంలో భాగంగా సిమెంట్ బీమ్‌ను కాలువ పైనుంచి నడిపేశారు. దీన్ని స్థానికులు అడ్డుకోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత పక్క నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మనిషినంటూ ఇక్కడివారిని భయపెట్టి, అటువైపు వారిని రానీయకుండా అడ్డుకున్నారు. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్ప్పుడు ఇంటికి తూర్పువైపున ఉన్న కాలువను చిన్నగా మలుపు తిప్పి, దానిపై గోడను నిర్మించేస్తున్నారు. ఇంటికి ఉత్తరం వైపు దాదాపు 30 అడుగుల పైబడి రోడ్డును ఆక్రమించేయడంతో పాటు కాలువ కనిపించకుండా నాలుగు అడుగుల ఎత్తున గోడ కట్టేశారు. ఈ పనులు మొదలుపెట్టిన దగ్గర్నుంచి కాలువ కప్పేసినా అడిగే నాధుడు లేడు.
ఇన్ని రోజులుగా ఈ ఆక్రమణలు జరుగుతున్నా రోజూ కాలువలు శుభ్రపరిచే కార్మికులు గాని, వారిని పర్యవేక్షించే మేస్త్రి గాని, వీరికి పైఅధికారిగా వ్యవహరించే శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గాని దీనిపై పట్టించుకున్న దాఖలాలు లేవు. మున్సిపాలిటీ అంటేనే మునిగిపోయే ప్రాంతాలని చెప్పవచ్చు. ఇప్ప్పుడు ఈ ఆక్రమణతో మరి చెప్పనక్కర్లేదు. దీనిపై కమిషనరైనా పట్టించుకోపోతే పరిస్థితిలో మార్పు రాదు.
ఈ ప్రాంతం వరద నీటితో నిండిపోవడానికి ప్రధాన కారణం కేవలం ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కాదు.. తుమ్మావీధి మెయిన్ రోడ్డుపై ఉన్న అపార్ట్‌మెంట్లతో పాటు బిల్డింగ్ యజమానులు సైతం పూర్తిగా కాలువలు కప్పేశారు. ఇక గొంటివీధిలో అయితే కాలువలో చెత్తను తొలగించే అవకాశం లేకుండా మÖడు అడుగులు ముందుకు వచ్చేశారు. ఇవన్నీ కార్పొరేషన్ అధికారులకు తెలియంది కాదు. ఇవన్నీ వేసినప్ప్పుడు వేపచెట్టు, తీయాలంటే అమ్మోరు మాదిరిగా తయారైంది. కొందరు పెద్దింటోళ్లు, ఇంకొందరు రాజకీయ పార్టీల పేర్లు వాడతారు, మరికొందరిది సామాజికవర్గం బలం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న చందంగా కట్టినప్ప్పుడు కళ్లు మÖసుకున్న కార్పొరేషన్ యంత్రాంగం ఇప్ప్పుడు ఎవ్వరినీ ఏమీ పీకలేరని స్వయంగా వారే చెబుతున్నారు.






Comments