top of page

పాపం అన్‌స్టాపబుల్‌

Writer: DV RAMANADV RAMANA

అది కుంభమేళా కావచ్చు.. హజ్‌ కావొచ్చు.. జెరూసలేం యాత్ర కావచ్చు.. అవి మొదలయ్యే నాటికి ప్రపంచ జనాభానే లక్షల్లోనో లేక కొద్దిపాటి కోట్లలోనో ఉండివుంటుంది. పైగా జిల్లాలోనే ఒక మూల నుంచి ఇంకో మూలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో (అప్పుడు జిల్లాలు కూడా లేవు) వాటికి ఏ కొద్దిమందో హాజరవుతూ ఉండివుండవచ్చు. కాలంతో పాటు మనిషి మారాలి. ఒకేచోట అంతమంది గుమిగూడడం వల్ల వచ్చే కష్టనష్టాలను బేరీజు వేసుకుని హాజరవ్వాలి. ఒకవేళ ఆ సందర్శనల వలన, స్నానాల వలన పుణ్యం వస్తుందని నిజంగా నమ్మితే పాపాలు చేయకుండా ఉండి పుణ్యాన్ని అలా కష్టపడి సాధించుకునే అవసరం నుంచి తప్పించుకోవచ్చు కూడా. ఇక మన దేశం విషయం వస్తే ఎవరికి దగ్గర్లో ఉన్న నదిలో వాడు మునిగితే చాలు. ప్రతి నదిలోనూ మునగ క్కరలేదు. దొంగఓట్లు వేసేవాడు ఓటు వేసిన ప్రతిసారీ వేలు మీద వేసే సిరాను చెరిపేసుకున్నట్టుగా ‘పాపం అన్‌స్టాపబుల్‌’ అంటూ పాపాలు చేసుకుంటూ పోతూ నదులన్నిటిలోనూ మునుగుతూ వాటిని కడుక్కుంటూపోతే ఆ స్నానాలు నిజమైన పుణ్యాత్ములకి పాపం గేదెలను కడిగే కాలువల్లో స్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఒకటి మాత్రం నిజం, వెర్రి వెయ్యింతలు పెరిగినా ప్రభుత్వాలు ఏర్పాట్లు అద్భుతంగా చేయగలగడం, తెలిసో తెలియకో దానిని నమ్మి స్వచ్ఛందంగా ఎంతోమంది సేవలు అందించడం నిజంగా అభినందనీయం. మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి కదా అని సేవిం చకూడదు కదా. మతం కూడా అంతే. అది ఒక మాదక ద్రవ్యం. పైగా అది ఎంతోమందికి మారక ద్రవ్యం. దానిని మరీ సీరియస్‌గా తీసుకుంటే మనకే నష్టం. మహా కుంభమేళాలో బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాలు చేసేందుకు సంగంనోస్‌ ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోతే, 60 మంది గాయపడ్డారు. కోట్లాది మంది కుంభ మేళాకు తరలిరావడం టూరిజం వ్యాపారానికి మేలు చేస్తుందేమో గానీ, ఇంతమందికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడమంటే కుదిరే పని కాదు. ఎవరి జాగ్రత్తల్లో వారుండాలి. అందరికీ పుణ్యం కావాలని, పాపాలను కడిగేసుకోవాలని తెలిసి తెలిసి పాపం చేశారు. తొక్కిసలాటలో 30 మందిని చంపేసింది సాటి మనుషులే. ఒకడి పీకను తొక్కేసి పక్కనే ఉన్న గంగలో మునకేస్తే పాపం పోతుందనుకోవడమే పెద్ద పాపం. ఒక్కసారి మనమూ ఆలోచించాలి. ఐఐటీ ఇంజినీరింగ్‌ చదివిన యువత అఘోరాలుగా, బాబాలుగా మారుతున్నారని గొప్పలు చెప్పుకునే రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి. అమెరికన్‌ ఇంజినీర్లు 50 లక్షల కోట్లతో కృత్రిమ మేథస్సు జ్ఞానాన్ని సృష్టిస్తే, చైనా యువత అదే పరిజ్ఞానాన్ని 60 లక్షలతో అమెరికా కంటే మెరుగైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని సృష్టించ గలిగినప్పుడు మన ఐఐటీ ఇంజినీర్లు అఘారాలో, బాబాలో ఎందుకు కావాలి? ఇలా మత ఉన్మాద ఉచ్చులో, కులం కుళ్లులో, మూఢనమ్మకాల్లో ఎంతకాలం బతుకుతాం? మనుషులే మారాలి. ఎగబడ టం ఎందుకు? సామాజిక నియమాలు పాటించాలి కదా. కొంచెం ముందు వెనుకా... తోసుకోవడ మెందుకో? అమృత్‌ స్నాన్‌ జరిగే రోజుల్లో వెళ్లకపోవడమే మేలని సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మంది మొత్తుకున్నారు. స్వయంగా ఈ రద్దీలో స్నానంచేయలేమని సాధువులే వాయిదా వేసుకున్నారు. కొన్ని నెలలుగా యోగీ సర్కార్‌ చాలా పెద్ద ఏర్పాట్లు చేసింది.. చేస్తుంది. ఇన్ని రోజుల్లో ఏ చిన్న అసౌ కర్యం కూడా జరగలేదు. కానీ 30 మంది ఒకేరోజు చనిపోకుండా ఉండాల్సింది. ఫేక్‌ దేవుళ్ల మీదే భారతీయ పిచ్చి, ఉన్మాదం. ఆమధ్య పుష్పరాజ్‌ను చూసేందుకు సంధ్యా థియేటర్‌కు వచ్చి జనాల కాలికింద నలిగిపోయింది రేవతి. తాజాగా ఢల్లీిలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట జరి గింది. కారణమేంటంటే.. రంజీ మ్యాచ్‌లో కోహ్లీ ఆటను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారట. దీంతో గేట్‌ నెంబరు 16 వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిలాటకు దారితీసింది. పలువురు అభిమానులు గాయపడ్డారు. మొన్నటికి మొన్న తిరుపతి వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే వైకుంఠానికి చేరుకుంటామని నమ్మి ఆ టిక్కెట్లిచ్చే క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. ఇవన్నీ దేవుడు చేసిన హత్యలుగానే భావించాలి. ఎందుకంటే.. ఇంతమంది జనాలు వస్తే ఏ ప్రభుత్వమూ కంట్రోల్‌ చేయలేదు. మీరు హిందువులైతే పుణ్యస్నానాలకు తరలిరండి అంటూ పిలుపునిచ్చారు యోగి ఆదిత్యనాథ్‌. అబ్బే వస్తే వచ్చారుగానీ, కాస్త నిదానించి ఉన్నచోటే స్నానాలు చేయాలంటున్నారిప్పుడు. ఏదైనా జరిగేవరకు మతస్మరణ, జరి గిన తర్వాత సంతాప ప్రకటన తప్ప చేసేదేమీ ఉండదు. దీన్ని గమనించాల్సింది భక్తులే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page