ప్రజాసేవ కోసం.. కాలువలోనే కాదు.. లెట్రిన్‌లోనైనా చెయ్యి పెడతా
- SATYAM DAILY
- May 16
- 1 min read
అభివృద్ధి నుంచి నా దృష్టిని మరల్చలేరు
నేను వలసనాయకుడ్ని కాదు
నగరపార్టీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
“ప్రజాసేవ కోసం నా చెయ్యిని కాలువలోనే కాదు.. లెట్రిన్‌లోనైనా పెడతాను. అదే సమయంలో ప్రతిపక్షం నెత్తిమీద కూడా పెడతాను. మీకు ఆ దమ్ముందా?” అని ఎమ్మెల్యే గొండు శంకర్ పరోక్షంగా మాజీమంత్రి ధర్మానను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన నగరపార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను వలసనాయకుడ్ని కాదని, అభివృద్ధి చేతకాని వలస నాయకులు తనను డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తే తాను స్పందించనని, ఈ నియోజకవర్గంలో పుట్టిపెరిగానని, అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది కాబట్టి చేసి చూపిస్తాను తప్ప ఆస్తులు దోచుకోడానికి రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి చెత్తనుంచి సంపద సృష్టించగల నాయకుడని, ఆ దమ్ముంటే వారూ ఆ పని చేయొచ్చన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడ్ని విమర్శించే స్థాయి ప్రతిపక్ష నాయకులకు లేదని, తన తండ్రి ఎర్రన్నాయుడి ఆశయాలు సాధించడానికి వచ్చి సైకిల్ యాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని స్వచ్ఛందంగా ఎదిగిన నాయకుడన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన రామ్మోహన్ నాయుడి కోసం మాట్లాడితే జిల్లా ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, మాదారపు వెంకటేష్, పైడిశెట్టి జయంతి, ప్రధాన విజయరామ్, పీఎంజే బాబు, సింతు సుధాకర్, కోరాడ హరిగోపాల్, దండాసి జ్యోతిభాస్కర్, ఉంగటి వెంకటరమణ, పిరియా మాధవి, ఎస్‌వి రమణమాదిగ, కలగ జగదీష్, పుప్పాల చినమహాలక్ష్మి, మైలపిల్లి నర్సింహమÖర్తి, తదితరులు పాల్గొన్నారు.






Comments