top of page

ప్రతీకారంలో ఇదో వెరైటీ

Writer: ADMINADMIN

‘సింబా’ రివ్యూ:

రివైంజ్‌ డ్రామాలు తెలుగు ఆడియన్స్‌ కు కొట్టిన పిండి. ఓ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సినిమా తీసుకొన్నా, అందులో ‘ప్రతీకారం’ అనే పాయింట్‌ కచ్చితంగా కనిపిస్తుంది. అయితే హీరో ఆ ప్రతీకారాన్ని ఎవరిపై, ఎందుకు, ఎలా తీర్చుకొన్నాడన్నదే ఆసక్తికరం. ఈరోజు విడుదలైన ‘సింబా’లోనూ వివైంజ్‌ డ్రామా ఉంది. కానీ అదో వెరైటీ కాన్సెప్ట్‌. మరి ఆ వివైంజ్‌ ఎలా సాగింది? ఆ వెరైటీ ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుంది..?

అక్ష (అనసూయ) ఓ స్కూల్‌ టీచర్‌. వరుసగా మూడు సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకొంటుంది. చీమకు కూడా హాని తలపెట్టడదు. ఆ కాలనీలో తనంటే అందరికీ చాలా గౌరవం. మరోవైపు ఫాజిల్‌ (శ్రీనాధ్‌ మాగంటి) కథ. తనో ఇన్వెస్టిగేటీవ్‌ జర్నలిస్ట్‌. అభ్యుదయ భావాలు కల కుర్రాడు. ఇంకోవైపు.. అన్సారీ (అనీష్‌ కురువిల్లా) ఓ పేరు మోసిన డాక్టర్‌. ఎందరినో తన హస్తవాసితో కాపాడతాడు. ఇలాంటి ఈ ముగ్గుర్లో ఒకరితో మరొకరికి సంబంధమే ఉండదు. కానీ నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేస్తారు. కానీ ‘ఈ హత్య తో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటారు. పైగా చాలా మర్యాదగా కనిపించే ఈ ముగ్గురూ.. ఇలా ఎందుకు ఫ్లిప్‌ అయ్యారు? వీళ్ల వెనుక ఎవరు ఉన్నారు? వీరిలో ఈ ఊహించని మార్పుకి కారణమేంటి? అనేది మిగిలిన కథ.

ముందు చెప్పుకొన్నట్టు ఇది కూడా ప్రతీకార కథే. కానీ ఇందులో ఓ వెరైటీ ఉంది. బయోలాజికల్‌ మెమొరీ అనే పాయింట్‌ యాడ్‌ చేశారిందులో. అది కొత్త తరహా కాన్సెప్ట్‌. ఆ కాన్సెప్ట్‌ ని ఎక్కడ, ఎందుకు, ఏ రూపంలో వాడారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా సక్సెస్‌ కావాలంటే పాయింట్‌ ఉంటే సరిపోదు. దానికి సరిడా ఎక్సుక్యూషన్‌ ఉండాలి. నిజానికి ఇదే పాయింట్‌ తో ఓ మల్టీస్టారర్‌ సినిమాని కొత్త కోణంలో, పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ గా, పక్కా కమర్షియల్‌ మీటర్‌లో తీసి ఉండొచ్చు. బహుశా బడ్జెట్‌ పరిమితుల వల్ల అది సాధ్యం కాలేదేమో. అయితే ఉన్నంతలో గ్రిప్పింగ్‌ గా, ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టే కంటెంట్‌ ఈ పాయింట్‌ లో ఉంది. అక్షగా అనసూయ పాత్రని పరిచయం చేస్తూ ఈ కథని మొదలెట్టారు. ఫ్లిప్‌ పాయింట్‌ కూడా త్వరగా వచ్చేసింది. బొద్దింకను చంపడానికి భయపడే ఓ సాధారణ టీచర్‌, క్రూరంగా హత్య చేయడం, ఆ తరవాత తనకేం తెలీనట్టు ప్రవర్తించడం ఆసక్తి కలిగిస్తుంది. ఆ తరవాత ఇలాంటి పరిస్థితులే మరో ఇద్దరికి ఎదురవ్వడం, వరుస హత్యలు ఇవన్నీ ప్రేక్షకుడ్ని కథలోకి తీసుకెళ్తాయి.

అయితే ఇన్వెస్టిగేషన్‌ చేసిన పద్ధతి మాత్రం చాలా సిల్లీగా, మరీ రొటీన్‌ గా అనిపిస్తుంది. ఎంతసేపూ, సీసీ ఫుటేజీలు చూసుకోవడం, కాల్‌ రికార్డింగులు అంటూ హడావుడి చేయడం తప్ప ఇన్వెస్టిగేషన్‌ లో కొత్త కోణం, ఆసక్తి కలిగించే విషయాలూ ఏం కనిపించవు. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ మాత్రం బాగుంది. సెకండాఫ్‌ పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కాకపోతే ఈ సినిమాలో సింబగా జగపతిబాబు కనిపిస్తాడన్న విషయం ప్రచారం చిత్రాల్లో ముందే చెప్పేశారు. ఈ హత్యల వెనుక సింబ హస్తం ఉందన్న సంగతి అర్థమైపోతుంది. దాన్ని ట్విస్ట్‌ గా దాచారు. అయితే ఆ సింబ తీర్చుకొనే రివైంజ్‌లో%ౌ% బయలాజికల్‌ మెమొరీ అనే పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. ఇలాక్కూడా రివైంజ్‌ తీర్చుకోవొచ్చా అనిపించింది. దానికి తగ్గ సెంటిఫిక్‌ ఆధారాలు చివర్లో చూపించారు కూడా. పాయింట్‌ పరంగా బలంగా అనిపించిన ఈ కథ.. తెరపైకొచ్చేటప్పటికి తేలిపోయింది. బలమైన సన్నివేశాలు, ఎమోషన్‌, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లే లేకపోవడంతో పాయింట్‌ క్రమక్రమంగా చేజారిపోయింది. ప్రకృతి, పర్యావరణం అంటూ ఓ బలమైన సామాజిక అంశాన్ని ఈ కథలో ముడిపెట్టడానికి చూశారు. అదీ కృత్రిమంగానే అనిపించింది. కాకపోతే.. దమ్ము కొట్టడం వల్ల కంటే, దుమ్ము వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్న కఠోరమైన సత్యాన్ని ఈ సినిమాతో చెప్పి, ఓ హెచ్చరిక జారీ చేసింది చిత్రబృందం.

అనసూయకు ఇది కాస్త కొత్త తరహా పాత్రే. హోమ్లీగా కనిపించింది. తనతో యాక్షన్‌ కూడా చేయించారు. జగపతిబాబు క్యారెక్టర్‌ సెకండాఫ్‌లో వస్తుంది. భారతీయుడు టైపులో.. రెండు వేళ్లతో ప్రాణాలు తీసే టెక్నిక్‌ ఈ పాత్రకు అన్వయించారు. అది కాస్త అతిగా అనిపిస్తుంది. చాలా కాలం తరవాత జగపతి బాబు యాక్షన్‌ సీన్లలో కనిపించడం విశేషం. గౌతమి పాత్ర పరిధి చిన్నదే. కానీ.. తన ఇంపాక్ట్‌ కూడా తెరపై సరిగా కనిపించలేదు. తను డాక్టర్‌ అనే విషయం మర్చిపోయి సీఐడీ ఆఫీసర్‌ అన్నట్టు ప్రవర్తిస్తుంటుంది ఆ పాత్ర. కబీర్‌ సింగ్‌ సైతం భయపెట్టలేకపోయాడు.

సంపత్‌ నంది ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ ప్లే అందించారు. ఐడియా వరకూ బాగుంది. ఇంకాస్త బాగా తీయాల్సింది. దర్శకుడు మురళీ మనోహర్‌ రెడ్డికి ఇది తొలి చిత్రం. మరొకరి కథని ఓన్‌ చేసుకొని.. తెరకెక్కించడం కొంచెం కష్టమైన ప్రక్రియే. సంపత్‌ నంది జిస్ట్‌ ని ఆయన బాగానే అర్థం చేసుకొన్నారు. ఓ లెంగ్తీ సన్నివేశాన్ని సింగిల్‌ షాట్‌ లో చూపించే ప్రయత్నం చేశారు. అది బాగుంది. దర్శకుడిగా తన కష్టం ఇలాంటి సన్నివేశాల్లో కనిపించింది. పాటలు లేకపోవడం ప్లస్‌ పాయింట్‌. నేపథ్య సంగీతానికి స్కోప్‌ ఉంది. యాక్షన్‌ సన్నివేశాల్లో వినిపించిన బీజియమ్స్‌ బాగున్నాయి. నిడివి కూడా ఇబ్బంది పెట్టదు. రెండు గంటల్లో సినిమా ముగిసింది.




డాడీ మీద కోపంతోనే దానిని లేపేసా!

మలయాళం బ్యూటీ సంయుక్తా మీనన్‌ గురించి పరిచయం అవసరం లేదు. ‘భీమ్లా నాయక్‌’ తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడ కెరీర్‌ టాలీవుడ్‌ లో తిరుగు లేకుండా సాగిపోతుంది. ‘బింబిసార’, ‘సార్‌’, ‘విరూపాక్ష’ లాంటి హిట్‌సినిమాలతో అమ్మడి క్రేజ్‌ మరింత పెరిగింది. అన్నింటిని మించి ఆరంభంలోనే స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ప్రశంసలందుకునే ఎంట్రీ ఇచ్చింది. ఆయన ఆశీర్వాదం కూడా కలిసొచ్చింది.

గతేడాది నాలుగైదు సినిమాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమ్మడు 2024 లో మాత్రం రిలాక్స్‌ అవుతుంది. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సినిమాలకు సైన్‌ చేయలేదు. అయితే నిఖిల్‌ తో మాత్రం పాన్‌ ఇండియా సినిమా ‘స్వయంభూ’లో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్‌ కి కూడా ప్రమోట్‌ అయింది. ఇలా కెరీర్‌ పరంగా సంయుక్తా మీనన్‌ ఎలాంటి ఢోకాలేదు.

అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం మనసు గాయపడిన సందర్భం గుర్తు చేసుకుంది. సంయుక్తా మీనన్‌ నుంచి ‘మీనన్‌’ పేరును తొలగించింది. అయితే ఇలా మీనన్‌ ని తొలగించడంపై నేరుగా ఆమెనే ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘అమ్మ నాన్న విడిపోయారు. అమ్మ అంటే ఎంతో ఇష్టం. అంతే గౌరవం. తన ఫీలింగ్స్‌ అన్నింటిని గౌరవించి పేరులో నుంచి సర్‌ నేమ్‌ తీసేసాను. నేను ఆడ, మగ సమానం అనే నమ్ముతానం. ఎవరూ ఎక్కువ కాదు..తక్కువ కాదు. నా జీవితంలో అలాంటి సందర్భం ఎదురైందని పురుషలందరి విషయంలో ఒకేలా ఉండటం అన్నది పెద్ద తప్పు. నా కుటుం బంలో జరిగిన సంఘటన అంత వరకే పరిమితం. అంతకు మించి తప్పుగా భావించాల్సిన పనిలేదు’ అని తెలిపింది.

Komentar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page