top of page

పారిశ్రామిక ప్రమాదాలు ప్రభుత్వాల పాపమే!

Writer: DV RAMANADV RAMANA

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. అదీ ఉమ్మడి విశాఖ జిల్లా పారిశ్రామికవాడలోనే కావ డంతో పరిశ్రమల ఖిల్లా తల్లడిల్లుతోంది. పరిశ్రమలు అంటేనే యంత్రాలు, రసాయనాలతో పని. మానవ జీవ నానికి ఈ పరిశ్రమలు ఎంత మేలు చేస్తాయో.. ఏమరుపాటుగా ఉంటే అంతకు మరింత చేటు చేస్తాయి. అందువల్ల పరిశ్రమల నిర్వాహకులు, వాటిలో పనిచేసే వారు, వాటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు నిరం తరం అప్రమత్తంగా ఉండాలి. అలా లేకపోవడం వల్లే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడలోని ఎసెన్షియా ఫ్యాక్టరీలో పెను ప్రమాదం సంభవించి 17 మంది ఉద్యోగులను బలి తీసుకుంది. మరెంతోమందిని క్షతగాత్రులను చేసి ఆస్పత్రుల పాల్జేసింది. ఇటువంటి దారుణ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకో వాల్సిన ప్రభుత్వాలు అవి జరిగినప్పుడే హడావుడి చేసి.. తర్వాత ఆ ఊసే పట్టించుకోకుండా మౌనం వహిస్తా యన్న విమర్శలు కొత్తవేం కావు. పైగా ఇందులో రాజకీయ మైలేజీ కోసం అధికార ప్రతిపక్షాలు కక్కుర్తిపడటం శవాల ముందు పేలాలు ఏరుకున్నట్లే ఉంటుంది. ఇప్పుడు ఎసెన్షియా ప్రమాద ఘటనలోనూ అదే జరుగు తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం ప్రమాదస్థలాన్ని సందర్శించారు. అదేవిధంగా వైకాపాకు చెందిన మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు రెండు పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా ఘోర ప్రమాదానికి కారణం మీరంటే మీరేనంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. పారిశ్రామిక ప్రమాదాలకు కారణం గత వైకాపా ప్రభుత్వ నిర్వాకాలే నని టీడీపీ సోషల్‌ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. భద్రతా ప్రమాణాలు (సేఫ్టీ మెజర్స్‌) పాటించని పరిశ్రమల నుంచి డబ్బులు దండుకుని గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి దారు ణాలు సంభవిస్తున్నాయని, పైగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయినందున దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు టీడీపీ తప్పించుకునే రీతిలో పోస్టులు పెట్టింది. సహజంగానే వైకాపా సోషల్‌ మీడియా దీన్ని కౌంటర్‌ చేస్తూ తనకు అనుకూలంగా పోస్టులు వదిలింది. అచ్యుతాపురం ఘటన జరి గిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టలేక తెల్లమొహం వేసిన చంద్రబాబు సర్కారు.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపైకి తప్పును నెట్టి చేతులు దులిపేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సుమారు మూడేళ్ల క్రితం ఇదే ఉమ్మడి విశాఖ జిల్లా కొత్తపాలెం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన ప్పుడు మృతుల కుటుంబాలకు ఎన్నడూ లేనివిధంగా రూ.కోటి చొప్పన నష్టపరిహారం చెల్లించిందంటున్నారు. ఏడాదిలో రెండుసార్లు పరిశ్రమలు కాంప్లియన్స్‌ రిపోర్టులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుందంటున్నారు. కొత్త ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయాన్ని వైకాపా నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన నేతలు దీనికి కౌంటర్‌ ఇస్తున్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వ హించకపోవడం వల్లే ప్రైవేట్‌ పరిశ్రమలదారులు భద్రతా ప్రమాణాల పాటింపు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నా రని, ఇవే ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులే చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను గత వైకాపా సర్కారు థర్డ్‌పార్టీ ఏజెన్సీలకు అప్పగించడం ద్వారా ఘోరాలకు ద్వారాలు తెరిచిందన్న విమర్శలను టీడీపీ సంధించింది. ఈ రాజకీయ దుమారంలో అసలు ప్రమాదం తీవ్రత, నష్టాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడల్లా ప్రతిపక్షం అధికార పార్టీని తప్పుపట్టడం.. అధికార పక్షం తమకు ముం దున్న ప్రభుత్వంపైకి బాధ్యతను నెట్టివేయడానికి ప్రయత్నించడమే తప్ప ఏ ఒక్క ప్రభుత్వమూ పరిశ్రమల్లో భద్రత విషయంలో ఉపేక్షిస్తున్న పారిశ్రామికవేత్తలను నిలబెట్టి నిలదీసేందుకు, అవసరమైతే శిక్షించేందుకు చొరవ తీసుకోవడంలేదు. దీనికి కారణం.. వారి నుంచి ఆయా పార్టీలకు ఠంచునుగా విరాళాలు అందడమే. దాన్ని బయటకు చెప్పకుండా పారిశ్రామికవేత్తలపై చర్యలకు దిగితే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్న సాకు పాలక పార్టీల వద్ద సదా సిద్ధంగా ఉంటుంది. కార్పొరేట్‌ శక్తులకు తలొగ్గి, పరిశ్రమలు రావన్న బూచిని చూపించి ప్రజలను బలి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మా, ఇతర రసాయన కంపెనీలు అత్యంత ప్రమాద కరమైన రెడ్‌జోన్‌ పరిశ్రమల జాబితాలోకి వస్తాయి. అపరిమితమైన కాలుష్యం వెదజల్లడంతో పాటు విష వాయువులు, రసాయన నిల్వల వల్ల ఈ పరిశ్రమల్లో పని చేసే వేలాది ఉద్యోగులతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు నిత్యం ప్రమాదాలతో సావాసం చేయాల్సి ఉంటుంది. పరిసర ప్రాంతాల్లోని గాలి, నీరు రసాయనాల ప్రభావంతో విషతుల్యంగా మారుతుంటాయి. అందువల్ల ఈ తరహా పరిశ్రమల్లో ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసర ప్రాంతాలవాసులకు ఎటువంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు, కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని ఈ పరిశ్రమలకు లైసెన్సు ఇచ్చే సమయంలోనే షరతులు పెడుతుంటారు. అవి అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్దేశిత సమయాల్లో తనిఖీలు చేసి నిర్ధారించాల్సి ఉం టుంది. ఏమాత్రం రూల్స్‌ అతిక్రమించి నిర్లక్ష్యం వహించినట్లు తేలినా వెంటనే సంబంధిత పరిశ్రమ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయాలి. కానీ రాజకీయ, కార్పొరేట్‌ ఒత్తిళ్లు ఈ పని చేయనివ్వడం లేదు. అంతా సాఫీగా జరుగు తున్నన్నాళ్లు చేతులు ముడుచుకుని కూర్చోవడం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, నష్టపరి హారం పేరుతో బాధితులను చల్లబర్చడంతో సరిపెట్టేస్తుంటారు.

 
 
 

ความคิดเห็น


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page