top of page

పిల్లలు ' సెల్ ' లోనే ఉంటున్నారు.

Writer: ADMINADMIN

.. మా పిల్లాడికి మూడేళ్లె కానీ నేను పెట్టిన ఫోస్ లాక్ ఎంచక్కా ఓపెన్ చేసేస్తాడు ..ఇలా గొప్పలకి పోయే ఓ తల్లి...కాసేపు చూసి ఇచ్చేయాలి మరి అని పిల్లాడి చేతిలో ఫోన్ పెడుతుంది మరో అమ్మ...వాడికి ఫోన్ ఇచ్చేస్తే చూసుకు ఊరుకుంటాడు వెధవ అని సినిమా హాల్లో భార్యతో ఓ తండ్రి .గతంలో సినిమా చూస్తుండగా పిల్లాడు ఏడిస్తే భర్త వాడిని ఎత్తుకుని బయటకి తీసుకెళ్ళి తిప్పేవాడు..ఇప్పుడు అంత సినిమా లేదు.మొబైల్ చేతిలో పెట్టేస్తే సరి ..వీళ్ళు సినిమా చూసిన రెండున్నర గంటలు వాడు మొబైల్ చూస్తూ కూర్చుంటాడు.మా అమ్మాయి సెకండ్ స్టాండర్డ్ నిమిషం ఖాలీ ఉండందండి నిరంతరం ఆన్లైన్ క్లాసులు ఉంటూనే ఉంటాయి ఇది ఇంకో ఆధునిక స్త్రీ బడాయి.... ఇలా పిల్లలు అతిగా ఫోన్ వాడడం వలన వారి మానసిక, శారీరకంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కుంటారో తల్లిదండ్రులు గ్రహించడం లేదు. స్మార్ట్‌ఫోన్‌ అడిక్షన్‌ బాధితుల్లో అరవై శాతం ఎనిమిది నుండి పద్దెనిమిది వయసువారు కాగా మరో ముప్పై శాతం పాతికేళ్ల నుంచి ఏభై ఏళ్ల వయసు వారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. దీని ఫలితంగా పిల్లలు నిద్రకి దూరం కావడం , డిప్రెషన్, ఆకలి మందగించటం, మతి మరుపు, అసహనం, కోపం, విసుగు, కళ్ళలో తరచూ నీరు కారటం, స్పాండిలైటిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో కొంతమంది పిల్లల మొబైల్ వ్యసనం గురించి మాట్లాడుతూ స్క్రీన్ టైం పై నియంత్రణ ఉండాలి చెబుతున్నారు .స్క్రీన్ టైం పై నియంత్రణ ఉండాలంటే కుదురుతుందా. పద్దెనిమిది ఏళ్ళు లోపు వారు మద్యం తాగకూడదు అని నిబంధన పెట్టీ ఒక పెగ్గు పర్వాలేదు అని చెప్పలేం కదా. కాసేపు పిల్లలు మొబైల్ చూసినా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అభివృద్ధి చెందివుండదు . దాని వల్ల ఒక దానికి అలవాటు అయితే వదలలేరు .స్వీయ నియంత్రణ ఉండదు . పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు అని చెప్పాలి . కానీ డాక్టర్లు చెప్పరు, ప్రభుత్వాలు పట్టించుకోవు . ఎందుకంటే నిజంగా పిల్లలందరూ సెల్ ఫోన్ వాడడం మానేస్తే సెల్ ఫోన్ అమ్మకాలు... డేటా బిజినెస్ .. ఆన్లైన్ బెట్టింగ్ లాంటివి ఇప్పుడున్నదానిలో... ఇరవై శాతానికి పడిపోతాయి .కాబట్టి వీరు నిజాలు చెప్పరు . సన్నాయి నొక్కులు... నొక్కుతూనే వుంటారు .ఇంకో విషయం . స్కూల్ లో తోటి పిల్లలు, ఏమి చేస్తే మన పిల్లలలు కూడా అదే చేస్తారు . స్కూల్ లో తోటి పిలల్లు" ఆ గేమ్ .. ఈ పోర్న్ వీడియో" అని డిస్కస్ చేస్తుంటే... మనింటి బంగారం ఊరకుండదు . స్కూల్ స్థాయిలో సెల్ ఫోన్ నిషేధించాలి .ఆవులు .. ఎడ్లు... చేలో మేస్తుంటే దూడలు గట్టునే ఎలా మేస్తాయి ?అమ్మ నాన్న మొబైల్ బానిసలు. ఒక పక్క స్టార్ ఆసుపత్రులను... మరో పక్క ఇంటర్నేషనల్ బడులను కొనుగోలు చేస్తున్న విదేశీ కంపెనీ లు .వారికి కావలసింది వ్యాపారం . ప్రతి ఒక్కడి రక్తం పీల్చేస్తున్నారు . ఉచిత ఆరోగ్య పరీక్షలు- స్టార్ ఆసుపత్రులు ,ఉచిత టాలెంట్ టెస్ట్ లు - విద్యా సంస్థలు .బకరాలను పట్టడానికి వేసే గాలాలు. చూస్తూ వుండండి . జనవరి లోగా లక్షల మంది పడుతారు. మా వాడి మెరిట్ కు మెచ్చి ఫిట్టింగ్ జీ వాడు డెబ్భై శాతం ఫీజు తగ్గించారు అని మురిసిపోతారు . నాలుగు రెట్లు పెంచి కొంత తగ్గించడం అనే మర్మం తెలియక పాపం తల్లిదండ్రులు ఆ మయాలో పడతారు. అదండీ నేటి లోకం . దోచుకున్నోడికి దోచుకొన్నంత . సైబర్ ఫ్రాడ్ .. రీల్స్ చెయ్యడం .. స్టార్ ఆసుపత్రులకు రోగులను ....ఇంటర్నేషనల్ స్కూల్స్ కు అడ్మిషన్స్ తెచ్చిపెట్టడం.. గంజాయి డ్రగ్స్ స్మగ్గ్లింగ్ .... నేటి పెద్ద పెద్ద స్వయం ఉపాధి పధకాలు....

  • DurgaPrasad Ch

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page