top of page

ఫుట్‌పాత్ గట్ల తొలగింపు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Jul 8
  • 1 min read
జీటీ రోడ్డు నుంచి ప్రారంభం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం కార్పొరేషన్‌కు పాచారులు నడవడం కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడమే దండగనుకుంటే, ఇప్ప్పుడు ఆ ఫుట్‌పాత్‌ను, రోడ్డును కలిపేసి ర్యాంపులు నిర్మించడంతో ఇటీవల మరణాలు కూడా సంభవించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ యంత్రాంగం మంగళవారం జీటీ రోడ్డులో ఫుట్‌పాత్ గట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. స్థానిక చంద్రమహల్ ఎదురుగా ఇటువంటి ఫుట్‌పాత్ గట్టునే ఢీకొని హయాతినగరానికి చెందిన ఒక యువకుడు ఇటీవలే మరణించిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా జీటీ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉండటంతో ఫుట్‌పాత్‌ను, రోడ్డును కలిపేస్తూ అందరూ ర్యాంపులు నిర్మించేశారు. దీనివల్ల పార్కింగ్ కోసం రోడ్డులో సగభాగం పోతుంది. సూర్యమహల్ వరకు సెంటర్ పార్కింగ్ ఉన్నా, ఆ తర్వాత మాత్రం రోడ్డుకు ఇరువైపులా గట్లను వదిలేసి వాహనాలు నిలుపుతుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గట్లను లేపేశారు.

1 Comment


prasada rao
prasada rao
Jul 08

Good 👍

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page