బెంగాల్ తీర్పు.. కోరుతోందా మార్పు?
- DV RAMANA

- 6 days ago
- 2 min read

మినీ జనరల్ ఎలక్షన్స్‌గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశప్రజల దృష్టి ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో అసోం, పుదుచ్చేరి, కేరళం ఫలితాలపై పెద్ద ఉత్సుకత కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ సాధించనుండగా పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కేరళంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా ఓటర్లు అధికార ఎల్డీఎఫ్‌కు విశ్రాంతినిచ్చి యÖడీఎఫ్‌కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలే తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొత్త విశ్లేషణలకు తావిస్తున్నాయి. సంప్రదాయకంగా తమిళనాడులో డీఎంకే లేదా ఏడీఎంకే కూటమినే అక్కడి ప్రజలు ఆదరిస్తుంటారు. ఆ మేరకు అక్కడ ఎప్పుడూ ద్విముఖ పోటీయే జరుగుతుంటుంది. కానీ ఈసారి దీనికి భిన్నంగా త్రిముఖ పోటీ అదికూడా ీVAరాీVAరాగా జరగడం తమిళ రాజకీయం మారుతుందనడానికి సంకేతంగా నిలుస్తోంది. సినీనటుడు విజjáYT నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీల్చనుందన్న అంచనాలు వెలువడ్డాయి. అధికారంలోకి రాలేకపోయినా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఓటింగ్ సరళిని అంచనా వేయగలిగినా పశ్చిమ బెంగాల్ ఫలితాలు మాత్రం ఎవరి అంచనాలకు అందకుండా తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఇక్కడి ఓటర్లు ఎవరికి ఓటు వేశారన్నది చెప్పకుండా గుంభనంగా వ్యవహరించడంతో సర్వేల్లోనూ ఫలితాల సరళిపై భిన్న అంచనాలు వెలువడ్డాయి. ఒక సర్వే సంస్థ అయితే సర్వే నిర్వహించినా ఇదే సందిగ్ధతతో అంచనాలు ప్రకటించడానికి వెనుకాడటం విశేషం. కాగా పోలింగ్ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఓటర్లు మమతను పక్కనపెట్టి.. తొలిసారి కమలానికి పట్టం కడుతున్నారా.. అన్న అభిప్రాయం కలగకమానదు. అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన పశ్చిమ బెంగాల్లో తొలిసారి కాషాయ జెండా ఎగురుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో అత్యంత భారీ ఓటింగ్ జరిగిందంటే అది అధికార మార్పునకు సంకేతంగా భావిస్తారు. ఓటింగ్ సరళిపై ప్రజలు పెదవి విప్పకపోవడం కూడా దాన్నే సూచిస్తుంది. ఇక ఎన్నికల్లో పోటీ పడిన పార్టీల నాయకుల బాడీ లాంగ్వేజ్, వారి వ్యాఖ్యల తీరు కూడా గెలుపు ఓటములపై వారి అంచనాలకు అద్దంపడతాయి. ఆ ప్రకారం ప్రస్తుతం మమత సహా తృణమÖల్ కాంగ్రెస్ నేతల ప్రవర్తన చూస్తుంటే ఓటమి భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా మమతా బెనర్జీ తాను పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ రోజు నుంచీ నానా రచ్చ చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోయాయని, కౌంటింగ్‌లో కూడా మాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ సీఎం అభ్యర్థి సువేందు అధికారి ఇప్పుడు భవానీపూర్‌లోనూ ఆమెపై పోటీ చేయడం దీనికి ఒక కారణం కావచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి నేత ఎన్నికల రోజు పార్టీ కార్యాలయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని మానిటర్ చేస్తుంటారు. కానీ మమతా బెనర్జీ మాత్రం తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల చుట్టూ ఉరుకులు పరుగులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర బలగాలు, ఎన్నికల కమిషన్‌పై విరుచుకుపడ్డారు. పోలింగ్ తర్వాత కూడా అదే ధోరణితో వ్యవహరించారు. ఒకవైపు 220కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగే అవకాశం ఉందని, కౌంటింగ్ వరకు నిఘా వేయాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. బీజేపీ, కేంద్ర బలగాలు ఫలితాన్ని మార్చాలని చూస్తున్నాయని మండిపడుతూ కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. అయితే మాటల్లో ఎంత ధీమా ప్రకటిస్తున్నా.. ప్రతి సందర్భంలోనూ ఆమె బాడీ లాంగ్వేజ్‌తోపాటు ఆమె చర్యల్లోనూ ఒకరకమైన నిరాశ కనిపిస్తున్నది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగనుందని ఆరోపిస్తూ స్ట్రాంగ్ రూము వద్ద అర్ధరాత్రి నాలుగు గంటలపాటు తిష్ట వేయడమే కాకుండా తమ పార్టీవారిని కూడా అదే పని చేయమని పురమాయించారు. గతంలో మÖడు ఎన్నికల్లో ఇవే ఈఎంల ఫలితాలతో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన మమతా ఇప్పుడు అవే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం ఆమెలోని నైరాశ్యానికి సూచనగా భావిస్తున్నారు. చివరికి కౌంటింగ్ విధుల్లో కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడాన్ని కూడా తప్పుపడుతూ కోర్టుకెక్కడం కూడా నిరాశాభావానికి నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెంగాల్‌లో ప్రభుత్వం మారబోతున్నదన్న అంచనాలకు మరో బలమైన సంకేతం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నేతలే. సరిహద్దు ప్రజల్లో కనిపిస్తున్న ఆందోళన. మమత పార్టీ ఓడిపోయే బెంగాల్లో బీజేపీ పాలనపగ్గాలు చేపడితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అక్కడి ఎంపీ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తే ఆ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తిప్పిపంపేస్తారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం తమ దేశంలో శరణార్థుల సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుందని ఆ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లా సరిహద్దుల గుండా పశ్చిమ బెంగాల్లోకి నిత్యం పెద్దసంఖ్యలో చొరబాట్లు జరుగుతుంటాయి. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న మమత సర్కారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందని బీజేపీ ఆరోపిస్తూ వస్తున్నది. ఇప్పుడు ఆ పార్టీయే అధికారంలోకి వస్తే భారత్ నుంచి ముస్లిం వలసదారులను వెళ్లగొట్టకమానరని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ బెంగాల్లో మార్పు తథ్యమన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.






Comments