top of page

బెంగాల్ బ్యాలెట్‌పై రక్తచారికలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 11
  • 3 min read

ఎన్నికలంటే ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా ఓట్ల రూపంలో తమ పాలకులను ఎన్నుకునే ప్రక్రియ. వారు ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురికాకుండా నిష్పక్షపాతంగా తమ తీర్పును ప్రకటించే ప్రజాస్వామ్యయుత వాతావారణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ బాధ్యతను తలకెత్తుకునే ఎన్నికల సంఘానిదే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు కూడా ఆ విషయంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి ఎన్నికల సంఘానికి సహకరించాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలంటే హింస, రక్తపాతం, బెదిరింపుల పర్వమేనన్నట్లు పరిస్థితులు దిగజారిపోయాయి. గతంలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు ఈ తరహా ఎన్నికల రక్తచరిత్ర ఉండేది. కానీ ఆ ఘనతను పశ్చిమ బెంగాల్ క్రమంగా వాటి నుంచి లాక్కుంది. ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు హింసే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలన్న తేడా ఏమీ లేదు. ఎవరికి బలమున్న చోట వారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ క్యాడర్ ప్రత్యర్థులను అంతం చేయడమే లక్ష్యంగా పెచ్చరిల్లిపోతుంటారు. గతంలో మÖడు దశాబ్దాలకుపైగా రాష్ట్రాన్ని ఏలిన వామపక్షాలు గ్రామీణ ప్రాంతాల్లో రౌడీ రాజకీయమే చేశారన్నది వాస్తవం. ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న తృణమÖల్ కాంగ్రెస్ కూడా క్రమంగా వామపక్షాల నుంచి పాలనతోపాటు హింసా రాజకీయాల వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఎదిగి, అధికారంపై గురిపెట్టిన బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఆ పార్టీ శ్రేణులు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో తృణమÖల్ క్యాడర్‌పై దాడులకు, హింసకు తెగబడుతూనే ఉన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది మరింత పెచ్చరిల్లింది. అధికార, ప్రతిపక్షాలు రెండూ పోటీపడి మరి దాడులు, గృహదహనాలు, అల్లర్లకు పాల్పడ్డాయి. ఇక ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికý తర్వాత కూడా హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా ఫలితాల తర్వాత అధికారం కోల్పోయిన తృణమÖల్ శ్రేణులు తీవ్ర అసహనంతో దాడులు, హత్యలకు తెగబడ్డారు. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్‌నే హతమార్చారు. కారులో వెళ్తున్న రథ్‌పై గుర్తు తెలియని దుండగులు పది రౌండ్లకుపైగా కాల్పులు జరపగా ఆయన అక్కడిక్కడే చనిపోయారు. అంతకుముందు ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే ఐదో తేదీన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పీయుష్ కనోడియా రాజర్‌హట్-న్యూ టౌన్‌లో తృణమÖల్ కాంగ్రెస్ నేత కమల్ మండల్, అతని అనుచరులు కలిసి మధు మండల్ అనే బీజేపీ కార్యకర్తపై దాడి చేసి చంపేశారు. దాంతో భారీ హింస చెలరేగి నలుగురు మరణించారు. పదిమందికిపైగా గాయపడ్డారు. బెంగాల్‌కు ఇదేం కొత్తకాదు. ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్ర తిరగేస్తే.. లెక్కలేనన్ని రక్తపు పుటలు కనిపిస్తాయి. వందలాది హత్యోదంతాలు, ఆస్తుల ధ్వంసం వంటి చీకటి కృత్యాలు కళ్లకు కడతాయి. ముఖ్యంగా వామపక్ష పాలన చివరి కాలం నుంచి ఈ దారుణాలు పెరిగిపోయాయి. ఒక్కసారి వాటిని అవలోకిస్తే.. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం 294 స్థానాలకు గాను 235 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో మరణాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేనప్పటికీ కనీసం ఆరుగురు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 2008 పంచాయతీ ఎన్నికల్లో లెఫ్ట్, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నందిగ్రామ్, సింగూర్‌లలో భారీ ఘర్షణలు జరిగాయి. ఎన్నికల తర్వాత సుమారు 45 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో జంగల్‌మహల్ ప్రాంతంలో సీపీఎం, టీఎంసీ-కాంగ్రెస్ కార్యకర్తలు, మావోయిస్టుల మధ్య త్రిముఖ ఘర్షణ జరిగింది. కాగా ఎన్నికల ప్రచారంలో కనీసం 15 మంది మృతి చెందారని అంచనా. ఇక ఎన్నికల అనంతరం కూడా తీవ్ర హింస చోటుచేసుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి 2010 మధ్యకాలంలో సుమారు 269 మంది హత్యకు గురయ్యారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల వామపక్ష పాలన ముగిసినా ఎన్నికల హింసకు మాత్రం ముగింపు లభించలేదు. ఈ ఎన్నికల్లో 17-25 మంది హత్యకు గురయ్యారు. లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. 2011 మే నుంచి 2016 జూలై మధ్య 183 మంది లెఫ్ట్ కార్యకర్తలు హతమయ్యారని ఆ కూటమి ఆరోపించింది. 2013 పంచాయతీ ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ ఘర్షణలకు అడ్డుకట్ట పడకపోగా 20 నుంచి 30 మంది మరణించారు. పోలింగ్ రోజునే 17 మంది మరణించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఘర్షణల్లో సుమారు 16 మంది మరణించారు. మరో 1,298 మంది పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. 2016 అసెంబ్లీ ఎన్నికý చివరి దశలో చెలరేగిన ఘర్షణల్లో కనీసం 12 మంది మరణించినట్లు తెలిసింది. 2018 పంచాయతీ ఎన్నికలు చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా నిలిచాయి. ఆ ఎన్నికý హింసాకాండలో మొత్తం 75 మంది మరణించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్, కోల్‌కతా సమీప ప్రాంతాల్లో భారీస్థాయిలో ఘర్షణలు జరిగా 15 మంది వరకు మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 1,300 హింసాత్మక ఘటనలు జరగ్గా 17 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 2023 పంచాయతీ ఎన్నికల ఘర్షణల్లో 45 నుంచి 55 మంది వరకు మరణించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఘర్షణలో సుమారు పది మంది మరణించారు. కొత్త ప్రభుత్వ హయాంలోనైనా ఈ రక్తచరిత్ర ముగుస్తుందా.. చూడాలి.మరి!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page