top of page

బెట్టింగ్‌కు ఏడుగురు సూత్రదారులు అరెస్టు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 30
  • 1 min read
ఎచ్చెర్లలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు అరెస్టు.. ఒకరు పరారీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన సూత్రదారులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడిరచారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామం పరిధిలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద బెంగళూరు, పంజాబ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దుంగ మన్మధరావు, ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన పాకాల కిశోర్‌, కర్రి రవితేజ, బైరి ఉపేంద్ర ఉన్నారని తెలిపారు. వీరి నుంచి ఆరు వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బెట్టింగ్‌కు డబ్బులు కట్టే వ్యక్తుల వివరాలతో కూడిన రెండు నోట్‌బుక్స్‌ స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. వీరి నలుగురు సెల్‌ఫోన్ల ద్వారా స్నేహితులు, తెలిసినవారి నుంచి డబ్బులు సేకరించి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు.

శ్రీకాకుళం రూరల్‌ పరిధిలో

ఒప్పంగి గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న సమాచారంతో రూరల్‌ ఎస్‌ఐ రాము సిబ్బందితో కలిసి రైడ్‌ చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకోగా ఒక్కరు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒప్పంగికి చెందిన మంత్రి ధనుంజయరావు, విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెం సంజీవిని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దయాల శ్రీనివాసరావు, దయాల సంగీతను అరెస్టు చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన రొక్కం వెంకట స్వాతినాయుడు పరారిలో ఉన్నాట్టు తెలిపారు. ధనుంజయరావు, దయాల శ్రీనివాసరావు, ఆయన భార్య సంగీత లక్ష్మి, రొక్కం స్వాతినాయుడు క్రికెట్‌ బెట్టింగ్‌ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరి నుంచి 5 మొబైల్‌ ఫోన్లను, బెట్టింగ్‌ వివరాలు నమోదు చేసిన పుస్తకంతో పాటు రూ. 8,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో శ్రీకాకుళం టౌన్‌ డిఎస్పి సిహెచ్‌ వివేకానంద, ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్‌, ఏఎస్‌ఐ కె.రమేష్‌ దేవ్‌, శ్రీకాకుళం రూరల్‌ ఎస్సై రాము, శ్రీనివాసరావు, రామారావు, నారాయణరావు, పోలీస్‌ కానిస్టేబుల్‌ కె.దివాకర్‌, కె.శ్రీనివాసరావు, సిహెచ్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపించినవారిని ఎస్పీ అభినందించారు.

Коментарі


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page