
మునుపెన్నడూ లేని వ్యతిరేకత అల్లు అర్జున్ మీద కమ్ముకుంటోంది.. అది పుష్ప-2 సినిమాకు సం బంధించి. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వ్యతిరేకతలో కొంత తనూ మూటగట్టు కుంటోంది. సన్నీలియోన్ ప్రోగ్రాం రద్దు చేసిన పోలీసులు పుష్ప-2 ప్రిరిలీజ్ ఫంక్షన్ కోసం సాగిలబ డ్డారు. ఇదేం న్యాయం..? అనేవారు ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు, భారీగా పోలీసులు మొహరింపులు, బందోబస్తు.. ఏ జనహిత కార్యక్రమం కోసం ఈ పాట్లు? ఎందుకీ సాగిలబాట్లు? ఇంకా నయం.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు.. ఒకరిద్దరు మంత్రులు కూడా వస్తామని చెప్పలేదు.. సంతోషం.. బన్నీ మొన్నటి ఎన్నికల్లో ఎవరో తన దోస్త్, వైకాపా అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లాడు. అది మెగా క్యాంప్ కోపం. పైగా తను మెగా క్యాంప్ అయివుండీ జనసేన పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేయలేదు, పట్టించుకోలేదు. అసలు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కూ బన్నీ ఫ్యాన్స్‌కూ నడుమ చాన్నాళ్లుగా ఏదో కనిపించని వైరం ఉండేది. ఇప్పుడది బహిరంగంగా పెద్దదయిపోయింది. చిరంజీవి బావమరిది కొడుకు ను అయినంత మాత్రాన నేను మెగా క్యాంపా..? నాది అల్లు క్యాంప్, సొంతంగానే ఎదుగుతాను, అసలే పాన్ ఇండియా స్టార్‌ను అనే ధోరణి బన్నీలో కనిపిస్తోంది. ఆ మెగా మర్రి నీడ నుంచి బయటపడే ప్రయ త్నాలు.. ఇప్పుడు పుష్ప-2 సినిమా మీద మెగా ఫ్యాన్స్ ఫుల్లు వ్యతిరేకతను స్ప్రెడ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ పుష్ప-2 క్యాంపెయిన్ గట్టిగా నడుస్తోంది. నెటిజనుల్లో చర్చ జోరుగా సాగుతోంది. అది ఎక్కడి దాకా వెళ్లిందంటే.. బన్నీ భార్య రెడ్డి (స్నేహలతారెడ్డి), బన్నీ రెడ్డింటి అల్లుడు, సో వైకాపా మనిషి.. మనకు పడదు.. మనం బన్నీ సినిమాలు చూడొద్దు.. ఇలాంటి వ్యాఖ్యల దాకా వెళ్లింది.. ఏపీ అంటే అంతే కదా. ప్రతిదీ కులానికే లింకు. ఆ సినిమా ఇన్నేళ్లుగా ఆగీ ఆగీ బోలెడు రీషూట్లు కూడా చేయించుకుని హీరోకు దర్శకుడికీ గ్యాప్, దర్శకుడికీ సంగీత దర్శకుడికీ గ్యాప్, కొత్త సంగీత దర్శకుల ఎంట్రీ, దాదాపు మూడు న్నర గంటల సినిమా నిడివి.. అన్నీ అసాధారణమే. గతంలో ఏ సినిమాకూ లేనంతగా రేట్లను, షోలను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. వారం పది రోజులు కాదు, అంతకుమించి, ఎంత రేట్లయినా పెట్టుకో, ఎంతయినా దోచుకో. అంత ఖర్చు ఎవడు పెట్టమన్నాడు..? ప్రేక్షకుల మీద ఇంతగా ఎందుకు రుద్దాలి అనే వ్యతిరేకత మరోవైపు ఎక్కువైంది. అవును, అంతే రేట్లు.. సరికాదు అనుకుంటే మీ ఇష్టం, ఎవడు చూడమన్నాడు అనే వ్యాఖ్యలూ కనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్ అవుతుందేమో, వందల కోట్లు వస్తా యేమో. ఆ క్రేజ్ ఉంది బన్నీ మీద.. కానీ జరుగుతున్న పరిణామాలు, ప్రబలుతున్న వ్యతిరేకత ఇండస్ట్రీకి మంచిది కాదు.. తెలంగాణ ప్రభుత్వానికీ మంచిది కాదు.. అది అర్థమయ్యే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు..!! పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇదేదో పుష్ప-2తోనే మొదలైంది కాదు, ఏళ్లుగా కొనసాగుతోంది. మరి పుష్ప-2పైనే ఎందుకింత వ్యతిరేకత? పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు వెనక ఉద్దేశం వేరు. బాహుబలి-2 లాంటి విజువల్ వండర్స్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు రావాలంటే భారీ బడ్జెట్స్ అవసరం కాబట్టి.. టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రానురాను ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేయడం, క్యాష్ చేసుకోవడం మొదలైంది. ఈ దుర్వినియోగాన్ని పుష్ప-2 మేకర్స్ పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లా రని ఆరోపిస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఇదే క్రమంలో ఇలాంటి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేస్తున్నారు. రిలీజైన మొదటి వారం లేదా 10 రోజుల పెంపును ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే దానికి అలవాటు పడ్డారు కూడా. కానీ పుష్ప-2 విషయంలో గేట్లు బార్లా తెరిచేశారు. ఏకంగా 19 రోజుల పాటు టికెట్ రేట్లపై వివిధ స్థాయిల్లో పెంపు అనేది ఇప్పటివరకు ఏ సినిమాకూ జరగలేదు. పెద్దగా గ్రాఫిక్స్, భారీ సెట్స్ అవసరం లేని ఓ సినిమాను మూడేళ్లు తీసి, ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అలా మొదలైందే ‘‘బాయ్ కాట్ పుష్ప-2’’ ట్రెండ్. ‘‘ఎవడబ్బ సొమ్మని టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచరు కానీ సినిమాలకు మాత్రం పెంచేస్తారు.’’ అంటూ ఓ ప్రేక్షకుడు ఫైరయ్యాడు. మరో ప్రేక్షకుడు ఇలా రాసుకొచ్చాడు. ‘‘అంత బడ్జెట్ పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? బాలీవుడ్‌కి పట్టిన గతే టాలీవుడ్‌కి కూడా పడుతుంది. ఇంత ధరలు పెట్టి చూసే బదులు సంవత్సరం మొత్తం ఓటీటీ ప్లానే వచ్చేస్తుంది కదా! ఒకరిద్దరి లాభాల కోసం లక్షల మంది ప్రజలను హింసించడం నేరం.’’
Comments