
భూల్ భూలైయా`3లో నటించిన విద్యాబాలన్ అత్యుత్తమ నట ప్రదర్శనతో హృద యాలను గెలుచుకున్నారు. కెరీర్ లో ఎన్నో వైవి ధ్యమైన పాత్రల్లో నటించిన బాలన్, ఈసారి కూడా పెద్ద తెరపై వైవిధ్యమైన పాత్రతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇది బాలన్ కి కెరీర్ పరంగా చాలా కీలకమైన సమయం. వరుసగా సినిమాలకు సంతకాల్‌ు చేస్తోంది. అదే సమయంలో బాలన్ వరుస ఫోటోషూట్లు వెబ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ బ్యూటీ తదుపరి ఏ సినిమాలో నటిస్తోంది అనేది అటుం చితే, ఇప్పటికి ఘాటైన ఫోటోషూట్లను షేర్ చేస్తూ యూత్‌లో తన బోల్డ్ ఇమేజ్ ని కాపాడుకుంటోంది. తాజాగా విద్యా బాలన్ తన టోన్డ్ బాడీ అందాలను ఆవిష్కరిస్తూ గుబులు రేపుతోంది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారుతోంది. కాంజీవరం చీరలో లేదా బ్రీజీ లినెన్ చీరలో కనిపించినా బాలన్ కి అవి వందశాతం యాప్ట్. కానీ అందుకు భిన్నంగా పూర్తి మోడ్రన్ దుస్తుల్లోను బాలన్ అంతే అందంగా కనిపిస్తుంది. ఈ బ్యూటీ మోడ్రన్ అటైర్ కి అంతే బాగా సూటబుల్. విద్యా బాలన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఎథ్నిక్ ఫ్యాష న్ బ్రాండ్ ‘‘షోబితం’’ బెంగళూరు స్టోర్ ఇటీవల ప్రారంభమైంది. అక్కడ అభిమానులు చీరలు ధరించి కనిపించారు. బనారసి సిల్క్ చీర ధరిం చి, తన అమ్మమ్మ తన మొదటి చీరను బహుమతిగా ఇచ్చిన జ్ఞాపకా లను, ముంబైలోని చెంబూర్‌లో పెరిగిన జ్ఞాపకాలను బాలన్ ఈ సంద ర్భంగా గుర్తుచేసుకుంది. మీ సినిమాల విషయానికి వస్తే, లుక్ పరంగా తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? అని తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా బాలన్ సమాధానం ఆలోచింపజేసింది. నేను ఒక పాత్రపై పని చేస్తున్నప్పుడు, ఆ పాత్ర ఏమి ధరిస్తుందో నిర్దేశిస్తుంది. నాకు కచ్చితంగా ఒక ధృక్కోణం ఉంటుంది. ప్రతి సినిమాలో నేను వేరే పాత్రను పోషిస్తు న్నప్పటికీ, నా వ్యక్తిత్వానికి సరిపోని వస్తువులను నేను ధరించ లేను. సాధారణంగా చెప్పాలంటే, నా పాత్రల వార్డ్‌రోబ్‌ను సృష్టిం చినందుకు నేను ఎటువంటి క్రెడిట్ తీసుకోలేను. ఎందుకంటే పాత్రను అర్థం చేసుకున్న కొంతమంది మంచి కాస్ట్యూమ్ డిజైనర్లతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభిం చింది! అని బాలన్ తెలిపింది.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
సాయిపల్లవి ‘అవార్డు’ కల

దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తాను ఏ పాత్ర పోషించినా దానికో విశిష్టత తీసుకొస్తుంది. కథా నాయిక అంటే మూడు పాటలు, నాలుగు సన్నివేశాలు అనే పడికట్టు సూత్రాన్ని పక్కన పెట్టి, కథలో తనకూ ప్రాధాన్యం ఉండేలా చూసుకొంటుంది. అలాంటి కథల్నే ఎంచుకొంటుది. తన పాత్రకు ప్రాధాన్యం లేదని అనిపిస్తే, స్టార్ సినిమాల్ని సైతం పక్కన పెట్టిన సందర్భాలెన్నో? సాయి పల్లవి ఓ సినిమా ఒప్పుకొందంటే, ఆ సినిమాలో విషయం ఉం దనే నిర్దారణకు వస్తారు అభిమానులు. సాయి పల్లవిపై ఉన్న నమ్మ కం అలాంటిది. నటిగా అత్యుత్తమ ప్రమాణాలు పాటించే సాయిపల్ల వికి ఓ కల ఉంది. అది జాతీయ అవార్డు అందుకోవడం. ఈ విష యాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. చాలా ఏళ్ల క్రితం సాయిపల్లవి అమ్మ తనకో చీర ఇచ్చిందట. పెళ్లి రోజున కట్టుకోవాలని చెప్పా రట. అయితే సాయిపల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. మరోవైపు నటిగా ప్రయాణం మొదలు పెట్టింది. జాతీయ అవా ర్డు అందుకొనేటప్పుడు అమ్మ ఇచ్చిన చీర కట్టు కొని ఆ వేడుకకు హాజర వుతానని ఆరోజే మాట ఇచ్చిందట సాయి పల్లవి. అప్పటి నుంచీ తాను ఆ రోజు కోసమే ఎదురుచూస్తోంది. ‘గార్గి’ చిత్రానికి సాయి పల్లవికి జాతీయ అవార్డు వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. ‘విరాటపర్వం’లో సాయి పల్లవి చక్కటి ప్రతిభ కనబరిచింది. ఇటీవల ‘అమరన్’లో అత్యుత్తమ నటన ప్రదర్శించింది. ఇప్పుడు ‘తండేల్’ సినిమా మొత్తాన్ని తానై నడిపిం చింది. ఈసారైనా సాయి పల్లవికి అవార్డు వస్తుం దేమో చూడాలి. ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లో ఉత్తమ నటిగా సాయి పల్లవి పురస్కారం అందు కోవడం ఖాయం. ఆమెకు అంతటి ప్రతిభ, అర్హత ఉన్నాయి. `
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Comentários