top of page

బాలయ్య ది లెజెండ్‌... ఇదే సాక్ష్యం

Writer: ADMINADMIN

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్‌ లోని అన్ని విభాగాల ఆధ్వర్యంలో భారీ వేడుక కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 1న నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ఇంకా టాలీవుడ్‌ స్టార్స్‌, ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ సంస్థ నిర్వహిస్తున్న ఈ వేడుక కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

తాజాగా బాలయ్య సినీ కెరీర్‌ ను తెలిజేసే విధంగా ఒక పోస్టర్‌ ను వేడుక నిర్వాహకులు రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్‌ ను బాలయ్య ఫ్యాన్స్‌ తో పాటు నెటిజన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్టర్‌ లోని విషయాలు బాలయ్య ది లెజెండ్‌ అంటూ చెప్పకనే చెబుతున్నాయి అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్‌ లో బ్రేక్‌ లేకుండా బాలయ్య నటిస్తూనే ఉన్నాడు. ఈ 50 ఏళ్లలో ఆయన ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌ గా కొనసాగుతూనే ఉన్నాడు. మొత్తం 109 సినిమాల్లో కూడా హీరోగా లేదా లీడ్‌ రోల్స్‌ లో మాత్రమే బాలయ్య నటించాడు.

బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్‌ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌ తో బాలకృష్ణ నటించి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్నాడు. బాలకృష్ణ నటించిన సినిమాల వసూళ్ల విషయానికి వస్తే గతంలో రూ.10 లక్షల దక్కించుకోగా, ఈ మధ్య వచ్చిన సినిమాలతో రూ.250 కోట్ల వసూళ్లు కూడా దక్కించుకున్నాడు. బాలయ్య కు ఫ్యాన్స్‌ 10 ఫీట్ల కటౌట్‌ నుంచి 108 ఫీట్ల కటౌట్స్‌ వరకు ఏర్పాటు చేశారు. ఇక బాలయ్య నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా బాలయ్య కెరీర్‌ లో ఉన్నాయి.

___

పీపుల్‌ మీడియాని ముంచినా తేల్చినా ప్రభాసే!

తక్కువ సమయంలో వంద సినిమాలు తీయాలన్న లక్ష్యంతో ముందుకొచ్చింది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. ‘ఈ తక్కువ రోజుల్లో’ అనే టైమ్‌ లైన్‌తో స్పీడు పెరిగింది కానీ, క్వాలిటీ తగ్గిపోయింది. ఎడా పెడా సినిమాలు తీసుకొంటూ నెలకొకటి చొప్పున టాలీవుడ్‌ లోకి వదులుతోంది ఈ సంస్థ. కానీ సరైన హిట్లే రావడం లేదు. రీసెంట్‌ గా ‘మిస్టర్‌ బచ్చన్‌’ కూడా తేడా కొట్టేసింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయింది పీపుల్‌ మీడియా. ఇది వరకు సినిమాలేమైనా సూపర్‌ హిట్లు అందించాయా అంటే అదీ లేదు. పీపుల్‌ మీడియా సక్సెస్‌ రేటు 40 శాతం కూడా లేదు. నవంబరులో ఈ సంస్థ నుంచి ‘స్వాగ్‌’, ‘విశ్వం’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ‘స్వాగ్‌’ చిన్న సినిమా. హిట్టయినా భారీ లాభాలు రాకపోవొచ్చు. గోపీచంద్‌ - శ్రీనువైట్ల ‘విశ్వం’పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. భారీ హిట్టు కొట్టి, కనీవినీ రీతిలో వసూళ్లు సాధించినా పీపుల్‌ మీడియా గత ఫ్లాపుల్ని, నష్టాల్నీ పూడ్చేంత స్టామినా ‘విశ్వం’కు ఉండదు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ జాతకం మొత్తం ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’ చేతుల్లో ఉంది. ప్రభాస్‌-మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాజా సాబ్‌’. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పీపుల్‌ మీడియా చేతుల్లో ఉన్న భారీ ప్రాజెక్ట్‌ ఇది. ఈ సంస్థని ముంచినా, తేల్చినా ఈ సినిమాకే సాధ్యం. ఎందుకంటే ఇది ప్రభాస్‌ సినిమా. తను హిట్‌ కొడితే బండి వెయ్యి కోట్ల దగ్గరే ఆగేది. కాస్త యావరేజ్‌ టాక్‌ వచ్చినా రూ.500 కోట్లు తగ్గదు. మరీ ‘కల్కి’లా కాకపోయినా హిట్‌ అయినా మినిమం రూ.300 కోట్లు గ్యారెంటీ. అదే పీపుల్‌ మీడియా భరోసా. లాభనష్టాల మాట అటుంచితే, ఓ పెద్ద హిట్‌ కొట్టామన్న తృప్తి ఇప్పుడు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అత్యవసరం. అదృష్టం బాగుంటే, 2024లో వచ్చిన ఫ్లాపులన్నింటికీ ‘రాజాసాబ్‌’ సినిమా ఒక్కటే సమాధానం చెప్పగలదు కూడా. అందుకే పీపుల్‌ మీడియా ఈ సినిమాపై ప్రత్యేకమైన దృష్టి నిలిపింది. క్వాలిటీలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ప్రభాస్‌ డేట్లు కేటాయించడంలో ఇబ్బంది పెట్టినా, నిర్మాతలు ఓర్చుకొన్నారు. రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ తొందర పడడం లేదు. పాన్‌ ఇండియా సినిమా ఇది. లాంగ్‌ వీకెండ్‌ అయితే బాగుంటుందన్న ఆలోచనతో.. ఓ మంచి డేట్‌ కోసం అన్వేషిస్తోంది పీపుల్‌ మీడియా.

____

కళ్యాణ్‌రామ్‌ నెక్ట్స్‌ సినిమాకు ఊహించని డైరెక్టర్‌ !

%నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం తన కెరీర్‌ లో 21వ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. అలాగే తన సోదరుడు ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా సినిమా దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కళ్యాణ్‌ రామ్‌ 21వ సినిమాకు ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా%ౌ% ఈ సినిమా కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో లేడీస్‌ సూపర్‌ స్టార్‌ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌ రామ్‌ తర్వాత సినిమాను కూడా ఓకే చేసినట్టు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ లో కుమారి 21ఎఫ్‌ %-% 18 పేజెస్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ కళ్యాణ్‌ రామ్‌కు కథ చెప్పి లాక్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథ నచ్చిన తర్వాత సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌ రామ్‌ సొంత బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్‌ శిష్యుడైన సూర్య ప్రతాప్‌ తెరకెక్కించే ఈ సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ కో ప్రొడ్యూస్‌ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page