బీసీ నేతే దొరకలేదా జగనూ..?!
- DV RAMANA
- Oct 19, 2024
- 2 min read

బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర మీద రెడ్ల పెత్తనం మరి పోదేమో? సోషల్ ఇంజినీరింగ్‌లో విప్ల వాత్మకమైన మార్పులు తెచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి కూడా ఉత్తరాంధ్రలో రీజనల్ కోఆర్డి నేటర్‌గా నియమించడానికి ఆ పార్టీ తరఫున ఒక బీసీ నేత దొరక్కపోవడం విడ్డూరం. మళ్లీ విజయ సాయిరెడ్డిని తీసుకువచ్చి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆయన మీద ఆరోపణలున్నాయనే కదా ఎన్నికల ముందు ఆయన్ను ఇక్కడి నుంచి మార్చింది. మళ్లీ ఇప్పుడు ఆయన్నే తీసుకురావడం వెనుక ఆంతర్యాన్ని చూస్తుంటే వైఎస్ జగన్ మొండితనాన్ని వీడటం లేదనిపిస్తుంది. ఎవరేదైనా అనుకుంటారన్న స్పృహ లేదు. తాను అనుకున్నదే జరగాలనుకునే మనస్తత్వం. అది రాజకీయాల్లో పనికి రాదు. పట్టు విడుపులుండాలి. బయటకు కనిపించేది ఒకటి. లోపల జరిగేది ఒకటి రాజకీయంగా నిర్ణయాలు తీసుకో వాలి. కానీ జగన్ మాత్రం జనాలు ఏమనుకుంటారన్నది మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. తాను అమలుచేసిన సంక్షేమ పథకాలే తనను తిరిగి అందలం ఎక్కిస్తాయని పిచ్చి కలలు కంటున్నట్లుంది. అందుకే జగన్ జగమొండిలా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సరే.. ప్రతిపక్షంలో ఉన్ప ప్పుడు కూడా జగన్ తన తీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు పార్టీ నుంచే విమర్శస్తున్నాయి. పార్టీలో ఆధిపత్యం ఎక్కువగా రెడ్లదే నడుస్తుంది. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాలు కానీ, మిగిలిన నియోజక వర్గాల్లో వారు చెప్పినట్లు నడవాల్సిందే. జగన్ నోటి నుంచి వచ్చేది వేరు. జరిగేది వేరు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ నినాదం మాత్రమే జగన్ చేస్తారు. కానీ పెత్తనమంతా రెడ్లదే. రాయలసీమ రెడ్డి మనస్తత్వం, ఆ పోకడ జగన్‌కు పోయినట్లు లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్య మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు ఏపీ మొత్తానికి ప్రతిపక్షం అని తాను భావించడం లేదట్లుంది. తనకు నమ్మకమైన వాళ్లను పార్టీ పదవుల్లో నియమించాలని భావిస్తారు కానీ, ఆ ప్రభావం మిగిలిన సామాజిక వర్గాలపై పడుతుందని ఆయన ఊహించనూ లేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలను దగ్గరకు తీసుకుని మిగిలిన వారికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వర్గాన్ని దగ్గరకు తీసుకుని మిగిలిన సామాజికవర్గాలకు దూరమవుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా పార్టీకి జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు. అందరూ రెడ్లతో నింపేశారు. అందరూ తన బంధువులు, సన్నిహితులకే పదవులు కట్టబెట్టారు. ఉమ్మడిగుంటూరు, ప్రకాశం జిల్లాకు మిథున్‌రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు విజయసాయిరెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిలను నియమించారు. ఆ బొత్స ఒక్కరే కాపు సామాజివకర్గం. మిగిలిన వాళ్లంతా రెడ్లే. గతంలో ఇదే తప్పు ఆయన చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఘోర పరాజయం వచ్చాక రీజనల్ కో`ఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేస్తారని భావించారు. జిల్లా అధ్యక్షులే కీలకం అని చెప్పారు. ఈ రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ వలన జిల్లా అధ్యక్షులకు,నియోజక వర్గ ఇంచార్జీలకు వైసీపీ అధినేతకు గ్యాప్ ఉంది కాబట్టి గత ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ రీజనల్ కో`ఆర్డినేటర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన చుట్టూ ఉండే వారికే బాధ్యతలు ఇస్తూ కొత్త జిల్లాలకు అవకాశం ఇచ్చారు. గతంలో కొనసాగిన సంప్రదాయం పాటించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థలో సోషల్ ఇంజనీరింగ్ పాటించలేదు. రెడ్లకు, తూర్పుకాపులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. వైకాపా అధినేత జగన్ మోహన్‌రెడ్డి తన పని భారం తగ్గించుకొని గతంలో చెప్పినట్టు సాయిరెడ్డన్న చూస్తాడు.. తమ్ముడు మిథున్ రెడ్డి చూస్తాడు. అయోద్యన్న చూస్తాడు. బాబాయి సుబ్బారెడ్డి చూస్తాడు. పెద్దన్న బొత్సా సత్యనారాయణ చూస్తాడు.. ప్రాంతాల వారీగా నియమించిన ఐదుగురు జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, చెవులుగా పని చేస్తారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జీలు కలవాలి అనుకుంటే వీరి అనుమతి లేకుండా కలిసే అవకాశం లేదు.. జగన్ మోహన్ రెడ్డికి ఆయా జిల్లాల పార్టీ పరిస్థితులు,పార్టీ అభివృద్ధికి,నియోజక వర్గాల వారీగా రీజనల్ కో ఆర్డినేటర్లు పార్టీ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. రాష్ట్రం మొత్తం రెడ్లే ఉన్నట్టు జగన్మోహన్‌రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా భావిస్తున్నట్టుంది. ఎక్కడెలా ఉన్నా ఉత్తరాంధ్ర మాత్రం బీసీల కంచుకోట. ఇక్కడ నెల్లూరు రెడ్లను తెచ్చి ఆధిపత్యం చెలాయించడం వల్లే పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. విజయసాయిరెడ్డి వర్గమని, సుబ్బారెడ్డి వర్గమని ఉమ్మడి మూడు జిల్లాలు మూడు ముక్కలు కావడంతో పార్టీ ఎక్కడా మూడు సీట్లు దక్కించుకోలేకపోయింది. ఇది తెలిసి కూడా జగన్ అదే తప్పు చేస్తుండటం ఆయన పట్టిన కుందేలుకు మూడేకాళ్లనిపించక మానదు.
Comments