top of page

భారత్‌ సెక్యులర్‌ దేశమే..

Writer: DV RAMANADV RAMANA

భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో లౌకికవాదం అంతర్భాగమని అత్యున్నత న్యాయ స్థానం నొక్కిచెప్పింది. పీఠిక అసలు సిద్ధాంతాలు లౌకిక ధర్మాన్ని ప్రతిబింబిస్తాయని స్పష్టం చేసింది. రాజ్యాంగ ప్రవేశికలోని ‘సోషలిస్ట్‌’, ‘లౌకిక’ పదాలు రాజ్యాంగంలో అంతర్భాగమని, వాటిని పాశ్చాత్య దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం తోసి పుచ్చింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను జోడిర చారు. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌, బలరాం సింగ్‌, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతవారం వాదనలు విని తీర్పు ను రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పివి సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం ‘పిటిషన్‌ను వివరంగా విచారించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. 1976లో రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం తదితర పదాలను చేర్చారని, ఇక 1949లో ఆమో దించిన రాజ్యాంగానికి ఎలాంటి తేడా లేదని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. సోషలిస్ట్‌, సెక్యులర్‌ అనే పదాలకు వివరణలు ఉన్నాయని, వాటిని వేర్వేరుగా అన్వయించకూడదని ధర్మాసనం అభిప్రాయపడిరది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వం అనే అంశాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. దాన్ని మరో రకంగా చూడొద్దని స్పష్టం చేసింది. దేశం సోషలిస్టు సంక్షేమ రాజ్యంగా ఉండటానికి ఉద్దేశించిందని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ‘సెక్యులరిజం’ అనేది అంతర్భాగమని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 14, 15, 16లో కూడా చూడొచ్చని పేర్కొన్నారు. ఇది మతపరమైన ప్రాతిపదికన పౌరుల పట్ల వివక్షను నిషేధిస్తుందని, అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపింది. ఇదే రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 25, 26, 29, 30, 44 సారాంశంలో కూడా కనిపిస్తుందని తెలిపారు. సోషలిజం, లౌకికవాదం మన రాజ్యాంగ ప్రాథమిక లక్షణమని స్పష్టం చేసింది. 1976 కంటే ముందు పీఠికలో సెక్యులర్‌ పదం లేనప్పటికీ, లౌకికవాదం తప్పనిసరిగా దేశం నిబద్ధతను సూచిస్తుందని పేర్కొంది. 1994 నాటి ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులోనూ, కేశవానంద భారతి కేసులోనూ ఇదే చెప్పినట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంట్‌ ఇస్తుందని, అయితే అది సవాల్‌ చేయలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో మీరు నివసించే దేశానికి మద్దతివ్వండి, లేదా మీరు మద్దతిచ్చే దేశానికి వెళ్లి జీవించండి అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదం తొలగించాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్న వెంటనే ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. మీరు నివసించే దేశానికి మద్దతివ్వండి అనడంలో మీరు అలా మద్దతివ్వడంలేదు సుమా అని చెబుతున్నట్లుంది. అలా మీరు మద్దతివ్వడంలేదు కాబట్టే మిమ్మల్ని హెచ్చరిస్తున్నామన్న అంతర్లీన పెద్దరికమూ ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కుల్ని వారు ఎంత అనుభవిస్తారో, ఈ దేశ పౌరులందరూ అలానే అనుభవిస్తారు. ఇందులో ఎవరి పెద్దరికాలూ అవసరంలేదు. దేశ స్వతంత్ర పోరాటం జరుగుతూ కొంతమంది ఉరితాళ్లను మెడకు తగిలించుకొని ఉరితాళ్లను ముద్దాడుతున్నప్పుడు, మరికొంతమంది దశాబ్దాలపాటు జైళ్లలో మగ్గినప్పుడు గుర్తుకురాని మతం ఇప్పుడు సెక్యులరిజం పదంతో పాటు ఆ భావన కొనసాగాలంటే మాత్రం విలవిలలాడిపోతున్నారు. దేశం స్వయంసమృద్ధి అయిన తర్వాత ఇప్పుడు బయటకువచ్చి మెజార్టీ మతాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారు. ఫత్వాలు జారీ చేస్తున్నారు. ‘కులమతాల గోడల మధ్య బంధీకాకుండా ఉండే విశ్వనరుడను నేను’ అనే జాషువా మాటలు నేటి తరానికి తెలీకపోవచ్చు. దేశ పౌరుల మీద ఏ ఒక్కరికో అయాచితంగా హక్కు ఉన్నట్లు ఫీలవడం సరికాదు. ఈ దేశంలో ఉన్నవారంతా భారతీయులే. కుల, మత, ప్రాంత భావనలకు అతీతంగా పాలిం చాల్సింది ప్రభుత్వాలు మాత్రమే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page