మతం మత్తు నుంచే ఉగ్రవాదం!
- DV RAMANA
- Apr 24
- 2 min read

అమాయక పర్యాటకులపై కాశ్మీర్లో జరిగిన ముష్కర దాడిని యావత్తు ప్రపంచంతో పాటు ఉగ్రమూకలైన తాలిబన్లు సైతం ఖండిరచారు. కానీ మనదేశంలో కొంతమంది మాత్రం ఈ దారుణాన్ని ఖండిరచకపోగా తేడాగా మాట్లాడుతున్నారు. అటువంటి వారిలో రాబర్ట్ వాద్రా ఒకరు. ‘ముస్లీంలు బలహీనంగా ఉన్నారు. అందుకే ఉగ్రదాడి. భారతదేశంలో మైనారిటీలు అసౌకర్యంగా, ఇబ్బందిగా భావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ విధానం దీనికి కారణం’ అని ఆయన వ్యాఖ్యానించడం చూస్తే.. బహుశా ఇలాంటి వాళ్లు తేడానేమో..!? అన్న భావన కలగకమానదు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని చూస్తే అంతా చల్లగానే కనపడుతుంది. కళ్లద్దాలు తీశాక కూడా అలాగే కనపడుతుందంటే మాత్రం చూపులో సమస్య ఉన్నట్లే. ఒకర్ని చంపటానికి మతం ప్రాతిపదిక కాకుండా ఉన్నట్లయితే.. ఉగ్రవాదానికి మతం లేదని నేనొప్పుకుంటాను. నేనూ సెక్యూలర్నే అంటాను. విధ్వంసం జరగటానికి కారణం మతం కాకుండా ఉన్నట్లయితే.. ఉగ్రవాదానికి మతం లేదని నేనొప్పుకుంటాను. నేనూ సెక్యూలర్నే అంటాను. ఇళ్ల లూటీకి, మనుషుల వేడి నెత్తురు ఏరులై పారటానికి, ధనమాన ప్రాణాలు విలువ లేనివైపోవటానికి మతం కారణం కాకుండా ఉండుంటే.. ఉగ్రవాదానికి మతం లేదని నేనొప్పుకుంటాను. నేనూ సెక్యూలర్నే అంటాను. ప్రాణం ఎవరికైనా తీపే.. కానీ మనవాళ్లవి తప్ప.. కాని వారి ప్రాణాలకు విలువ లేదనుకునే మూఢత్వానికి కారణం మతం కాకుంటే.. ఉగ్రవాదానికి మతం లేదని నేనొప్పుకుంటాను. నేనూ సెక్యూలర్నే అంటాను. అలా మనిషి విలువ అతని మాతాన్ని బట్టో.. అతని కులాన్ని బట్టో.. అతని ప్రాంతాన్ని, లింగాన్ని బట్టో మారదని నమ్మే సెక్యూలర్నే నేను. కానీ దాన్నే బలహీనతగా భావించి.. నాలాంటి వారిపై దాడులు జరుగుతూ ఉంటే.. ఇంకా ఉగ్రవాదానికి మతం లేదని చెప్పమంటారా? కళ్లుండీ ధ్రుతరాష్ట్రులం కమ్మంటారా...? నేను సెక్యూలర్నే మత ప్రాతిపదికన కాకుండా.. మంచీచెడూ ప్రాతిపదికన అన్నీ జరిగినపుడు! నేను సెక్యూలర్నే.. ఈ భేదభావం చూపని వాడినే.. నన్నూ అలాగే ఎదుటివాళ్లు చూసినప్పుడు.. నాతో వ్యవహరిస్తున్నప్పుడు మాత్రమే! నేనూ సెక్యూలర్నే.. అందరూ ఒకటే అనేవాడినే.. అందరూ ఒకటే అని అందరూ అనుకున్నప్పుడు! నేనూ సెక్యూలర్నే.. మతం ఇంటి పూజగదికి పరిమితమవ్వాలని కోరుకునేవాడినే.. కానీ ఆ ఇంట్లో చొరబడి పూజ గదినే ధ్వంసం చేస్తుంటే మాత్రం ఇంకా మనసులోనే దేవుడిని పూజించుకోవాలనే పైత్యం తలకెక్కనంత వరకూ! చివరగా ఒక మాట.. ఒక మతం దైవ ప్రార్ధనా పరిజనుడిని.. తన దైవ ప్రార్ధన.. తన ప్రార్ధనాలయంలోనే చేసుకుంటున్నప్పుడు.. అదే కారణంతో చంపేస్తే.. దాన్ని కేవలం ఒక మర్డర్ కేసు అని తేల్చిపారేసి.. మనమంతా ఒక్కటే అని కళ్లు మూసుకు కూర్చుంటున్నావంటే.. మరో మతానికి చెందిన దైవ ప్రార్ధనా పరిజనుడి మరణం ఒక యాక్సిడెంట్ అని నిర్ధారణ చేశాక కూడా అది ఒక హత్య అని మత ప్రాతిపదికనే అది జరిగిందని, దానికి మతోన్మాదం కారణమని ఇంకా గోల చేస్తూంటే.. నిజమే కాబోలు అనుకుంటున్నావంటే.. అన్నీ మతాలు సమానమే అనుకుంటున్నావంటే.. ఇంకా పూజారి, పాస్టర్ ఒకటే అని నన్నూ అనుకోమంటున్నావంటే.. మిత్రమా నిజం చెప్పు.. నిన్ను నువ్వు మేధావిని అని అనిపించుకోవాలనే ఆశతో నీ తలను ఇసుక బొరియల్లో దాచుకున్నావు కదూ.. నేను నిజంగానే సెక్యూలర్ని.. అవతలివాడు అదే అయినప్పుడు.. నాకు అందరూ సమానమే నన్నూ ఎవ్వరూ తక్కువగా చూడనంతవరకు.. నేను అందరినీ గౌరవిస్తాను నాకూ అలాంటి గౌరవమే అక్కడ అందుతున్నంతవరకు.. నాకు ఏ పట్టింపులూ లేవు.. పట్టింపులతో ఇతరులు నన్నూ పక్కన పెట్టనంత వరకు!!! అంతే తప్ప.. అవతలివారు అన్ని పట్టింపులు పాటిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ మతం పేరిట మారణకాండ సృష్టిస్తున్నా కూడా ఇంకా సెక్యూలరిజమ్ పేరుతో మడికట్టుకుని కూర్చోమంటన్నట్లుంది రాబర్ట్ వాద్రా వంటి వారి తీరు. ఉగ్రవాదుల దుశ్చర్యను మనం ఇక్కడ మతాలవారీగా వర్గీకరించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నాం. కానీ మారణకాండ జరిగిన ప్రదేశంలో మాత్రం ఆ దారుణాన్ని చూసి మనం ద్వేషించే ముస్లిములు కూడా రోదిస్తున్నారు, మసీదుల్లో ప్రార్థిస్తున్నారు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తున్నారు, సంతాపసభలు పెడుతున్నారు. సమూహాలుగా రోడ్ల మీదకొచ్చి దుండగుల దుశ్చర్యను నిరసిస్తున్నారు. మనిషి తనాన్ని బతికిస్తున్నారు.
Comentarios