top of page

మరో సీనియర్‌ హీరోయిన్‌ రీ ఎంట్రీ..

  • Guest Writer
  • Oct 13
  • 2 min read
ree

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్లు.. ఒక్కొక్కరిగా ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భామలు జెనీలియా, లయ, అనిత, అన్షు.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు మరో సీనియర్‌ బ్యూటీ కామ్నా జెఠ్మలానీ పదేళ్ల తర్వాత సందడి చేయనున్నారు. సీనియర్‌ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చిన వారి లిస్ట్‌ లో చేరనున్నారు. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.. ఇప్పుడు కే- ర్యాంప్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌ గా మేకర్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా.. అందులో కామ్నా జెఠ్మలానీ కనిపిస్తారు. ట్రైలర్‌ లో సీనియర్‌ నటుడు నరేష్‌.. ఒకరి వెనుక పడుతున్నట్లు కనిపిస్తారు. ఆమెనే కామ్నా. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్‌ టాపిక్‌ గా మారింది.

అయితే సినిమాలో కామ్నా ఏ క్యారెక్టర్‌ లో కనిపించనున్నారో.. ఎంతసేపు కనిపించనున్నారో క్లారిటీ లేదు. అక్టోబర్‌ 17వ తేదీన తెలుస్తోంది. అదే సమయంలో రెండేళ్ల క్రితం.. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన వెబ్‌ సిరీస్‌ వ్యవస్థలో కామ్నా కనిపించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు సినిమాల విషయంలో మాత్రం కే- ర్యాంప్‌ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కామ్నా జెఠ్మలానీ కెరీర్‌ విషయానికొస్తే, ప్రేమికులు మూవీతో హీరోయిన్‌ గా యాక్టింగ్‌ ను స్టార్ట్‌ చేసింది. ఆ వెంటనే ఇదయా తిరుడన్‌ మూవీతో కోలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన కామ్నాకు.. టాలీవుడ్‌ మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా వచ్చిన రణంతో సూపర్‌ హిట్‌ దక్కింది. తన యాక్టింగ్‌ తో మంచి ప్రశంసలు అందుకున్న ఆమె.. అందరినీ మెప్పించింది.

అయితే పెళ్లి, పిల్లలు తర్వాత కామ్నా జెఠ్మలానీ.. కెరీర్‌ కు బ్రేక్‌ ఇచ్చారు. చివరగా తెలుగు - కన్నడ ద్విభాషా సినిమా చంద్రికలో కనిపించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా యాక్ట్‌ చేయలేదు. క్యామియో రోల్‌ లో కనిపించలేదు. ఇప్పుడు కే- ర్యాంప్‌ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నారు. దీపావళి కానుకగా వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ కానుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న ఆ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. జైన్స్‌ నాని దర్శకత్వం వహించిన కే- ర్యాంప్‌ చిత్రాన్ని హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌లపై రాజేశ్‌ దండ, శివ బొమ్మక నిర్మిస్తున్నారు. మరి సినిమాలో కామ్నా జెఠ్మలానీ ఏ రోల్‌ లో కనిపిస్తారో.. ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

బ్రదర్‌ ఆఫ్‌ రౌడీ.. మరో మిడిల్‌ క్లాస్‌ కథ
ree

అభిమానులంతా రౌడీ అని పిలుచుకొనే హీరో విజయ్‌ దేవరకొండ. తన తమ్ముడు.. ఆనంద్‌ దేవరకొండ కూడా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నవాడే. అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. తన సినిమా రిలీజ్‌ అయ్యి చాలా కాలం అయ్యింది. తన సినిమా సంగతులు కూడా పెద్దగా బయటకు రావడం లేదు. అయితే కాస్త గ్యాప్‌ తరవాత ఓ కథ ఓకే చేసినట్టు టాక్‌. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో తనకు మంచి హిట్టు ఇచ్చిన వినోద్‌ తో మరోసారి జట్టు కట్టడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ సమయంలో ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ అమేజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్‌ అయ్యింది. మంచి ఆదరణ తెచ్చుకొంది. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబోలో సినిమా రావడానికి రంగం సిద్ధమైంది. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ లానే మరో సహజమైన కథ ని వినోద్‌ రెడీ చేశాడని, దాదాపు స్క్రిప్టు లాక్‌ అయిపోయిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లుందని సమాచారం.

అయితే ఇది థియేట్రికల్‌ సినిమా కాకపోవొచ్చు. నెట్‌ ఫ్లిక్స్‌ కోసం చేస్తున్న ప్రాజెక్ట్‌ అని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ కూడా ఓటీటీ కోసం చేసిన సినిమానే. ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్‌ కోసం ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఓటీటీ ఎక్స్‌ క్లూజీవ్స్‌ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. ఫలితాలు పెద్దగా ఎఫెక్ట్‌ చేయవు. హిట్టయితే అవకాశాలు ఆగవు కానీ, ఫ్లాప్‌ వల్ల డామేజ్‌ పెద్దగా జరగదు. బడ్జెట్లు ముందే లాక్‌ అయిపోతాయి కాబట్టి, నిధుల కొరతతో సినిమా ఆగిపోయే ప్రమాదం ఉండదు. కాబట్టే నవతరం దర్శకులు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ వైపు చూస్తున్నారు.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page