top of page

మహిళలపై అకృత్యాల్లో మనది సెకండ్‌ ప్లేస్‌!

Writer: DV RAMANADV RAMANA

అవును.. చాలామంది నమ్మకపోవచ్చుగానీ.. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసాత్మక ఘటనలు అధికంగా జరిగే దేశాల జాబితాలో భారత్‌కు రెండోస్థానం ఇచ్చింది. దానికి తగినట్లే ఇటీవలి కాలంలో మనదేశంలో మహిళలపై దాడులు, లైంగిక నేరాలు, కిడ్నాప్‌లు, హత్యలు బాగా పెరిగిపో యాయి. కోల్‌కతాలోని ఆర్‌జీకర్‌ ఆస్పత్రిలో నైట్‌డ్యూటీలో ఉన్న మహిళా జూనియర్‌ డాక్టర్‌ను కంచే చేను మేసినట్లు ఒక పోలీస్‌ వలంటీరే అర్ధరాత్రి హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశంలో ఎంత సంచలనం సృష్టిం చిందో మనం చూస్తున్నాం. ఈ నెల తొమ్మిదో తేదీన ఈ దారుణం జరిగితే ఇంతవరకు ఒకే ఒక్క నిందితుడిని పట్టుకోగలిగారు. సీబీఐ రంగంలోకి దిగినా ఈ కేసులో అసలు ఏం జరిగింది? ఎవరు బాధ్యులు అన్నది ఇంకా నిర్థారించలేకపోయారు. అంతకంటే దారుణం ఎప్పుడో 1992లో అజ్మీర్‌లో రాజకీయ ప్రాబల్యం ఉన్న ఓ ముఠా సుమారు 250 మంది స్కూల్‌, కళాశాల విద్యార్థినులను ట్రాప్‌ చేసి లైంగిక దాడులకు పాల్పడి, వాటిని ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో 30 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటివరకు బాధితులకు పూర్తి న్యాయం దక్కలేదు. ఆ కేసులో ఇప్పటికీ ఓ నిందితుడు పరారీలో ఉండగా, మరో నిందితుడిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అలాగే ఓ దిశ, ఓ నిర్భయ.. ఇలా మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నా సకాలంలో నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం, బాధితులకు న్యాయం అందకపోవడం వల్లే దేశంలో మహిళలపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అయితే ఆ విషయంలో దేశం ఏకంగా ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరడమే అత్యంత ఆందోళనకర అంశం. గూగుల్‌ అంచనా ప్రకారం మహిళలకు భద్రత లేని దేశాల్లో ప్రపంచంలో దక్షిణాఫ్రికా టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ దేశంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేవరకు గ్యారెంటీ ఉండదు. దాంతో దక్షిణాఫ్రికాలో మహిళలు ఒంటరిగా ప్రయాణాలు, వాహనాలు నడు పుతూ బయటకు వెళ్లడం, కనీసం సొంత ఊళ్లోనే రోడ్లపై ఒంటరిగా తిరగడం క్షేమకరం కాదని హెచ్చరికలు జారీ చేయాల్సిన దుస్థితి ఉందట. గూగుల్‌ మాత్రమే కాదు.. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ కూడా ప్రపంచంలోనే ఆడవారికి తగిన రక్షణ కల్పించలేని ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికాను పేర్కొంది. ఈ దేశానికి చెందిన 25 శాతం మహిళలు మాత్రమే తాము ఒంటరిగా బయటకు వెళ్లినా క్షేమంగా తిరిగి రాగలుగుతున్నామని చెప్పినట్లు మరో అధ్యయనం వెల్లడిరచింది. ఆ తర్వాత స్థానం భారతదేశానిదే. ఆసియాలో మహిళా భద్రత అతితక్కువగా ఉన్న దేశంగా భారత్‌ తరచూ మొదటి స్థానంలో నిలుస్తోంది. భారత్‌లో పర్యటనకు ఇటీవల వచ్చిన ఓ స్పానిష్‌ జంట తాము హింసకు గురైనట్లు పోలీస్‌ కేసు నమోదు చేయడం ఆ మధ్య వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో దేశంలో మహిళల అక్రమ రవాణా బాగా పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. స్త్రీలను మాయమాటలతో, బలవంతంగా ఎత్తుకపోయి విదేశాల్లో అమ్మేయడం, వేశ్యలుగా మార్చే యడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వాస్తవానికి స్త్రీని గౌరవించే సంప్రదాయం, సంస్కృతిని అనాదిగా పాటిస్తున్న దేశంగా భారత్‌ తొలినుంచి పేరుగాంచింది. ఇక్కడ మహిళలను తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా అభిమానిస్తారు, గౌరవిస్తారు. అలాగే స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తారు కూడా. అటువంటి వేదభూమిలో ఇప్పుడు ఆడవారికి రక్షణ కొరవడుతోంది. అభం శుభం తెలియని చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న మహిళలపైనే కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలు నిత్యం పెద్దసంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ వంటివి కోకొల్లలు. పోక్సో, దిశ వంటి ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా నేరగాళ్లు తప్పించుకోగలుగుతుండటమే ఈ దుస్థితికి కారణం. దానికితోడు నిందితులను పట్టుకున్నా కూడా కోర్టులు వాదనలు, విచారణల పేరుతో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో చాలా మంది బాధితులు సమాజంలో పరువు పోతుందన్న భయంతో బయటకు రావడంలేదు. ఇక భారత్‌ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ మహిళల పరిస్థితి దారుణంగా ఉందని రాయిటర్స్‌ను ఉటంకిస్తూ గూగుల్‌ వెల్లడిరచింది. ఈ దేశంలో లైంగిక హింస కంటే ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వేచ్ఛ, బాలికల చదువు విషయంలో తాలిబన్‌ పాలకులు విధించిన ఆంక్షలు ఈ దేశం మహిళలకు సురక్షితం కాదని చెబుతున్నాయి. మహిళలు లైంగిక, గృహ వేధింపులకు అధికంగా గురవుతున్న దేశంగా సిరియాను పేర్కొన్నారు. మహిళల విషయంలో మధ్య ప్రాచ్య దేశాల్లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా సిరియా పేరొందింది. తీవ్రమైన లింగ వివక్ష పాటించే దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. పని ప్రదేశాల్లో రక్షణ, ఆస్తి హక్కు వంటి విషయాల్లో ఈ దేశం మహిళ లకు సురక్షితం కాదు. ఆర్థిక స్వేచ్ఛ, మహిళల పట్ల వివక్ష విషయంలో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో మహిళలకు మతపరమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు, పరువు హత్యలు పెను సవాల్‌గా మారుతు న్నాయి. కక్షపూరితమైన దాడులు, చట్టవిరుద్ధమైన హింసాత్మక కార్యక్రమాలకు నిలయమైన కాంగోలో మహిళ లపై వేధింపులు కూడా తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. అనేక సంక్షోభాలకు గురవుతున్న యెమెన్‌లో ఆర్థిక, సంస్కృతి, సంప్రదాయ పద్ధతులు మహిళలకు సవాల్‌గా మారుతున్నాయి. నైజీరియాలో ఇస్లామిస్ట్‌ జీహాదిస్ట్‌ సంస్థ కారణంగా మహిళలకు రక్షణ కొరవడుతోందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మహిళలను హింసించడం, అత్యాచారాలకు పాల్పడటం, హత్యలు వంటి అకృత్యాలకు తీవ్రవాదులు పాల్పడుతున్నారని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ఈ దేశంలో మహిళల అక్రమ రవాణా కూడా జోరుగానే సాగుతోందని తెలుస్తోంది.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page