మెగా సినిమా ఎన్నో ముచ్చట్లు!!
- Guest Writer
- Oct 27
- 3 min read

ఈ రెండు మూడు రోజుల నుంచీ.. మెగా హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి గురించి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకొంటున్నారు. ఆ సంగతులు నిజమా, కాదా? అనేది పక్కన పెడితే.. కావాల్సినంత ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ చేయగలుగుతున్నాయి.
ముఖ్యంగా చిరంజీవి బాబీ సినిమాకు సంబంధించిన ఓ వార్త మరింత ఆసక్తిని కలిగిస్తోంది. వాల్తేరు వీరయ్య తరవాత ఈ కాంబో మళ్లీ సెట్ అయిన సంగతి తెలిసిందే. బాబీ ఇప్పటికే కథ రెడీ చేసినట్టు సమాచారం. ఇది సింగిల్ హీరో సినిమా కాదట. మల్టీస్టారర్ అట. ‘వాల్తేరు వీరయ్య’ని కూడా బాబీ ఓ మల్టీస్టారర్ గా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. రవితేజ ఎంట్రీతో మొత్తం కథే మారిపోయింది. ఈసారి కూడా బాబీ మరో హీరో వైపు మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. ఈసారి తమిళ స్టార్ కార్తీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నార్ట. ఇదో గ్యాంగ్ స్టర్ కథ అని, కార్తీకి కూడా బలమైన పాత్ర పడినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజంగానే కార్తీ ఎంటర్ అయితే.. ఈ కాంబో రూపు రేఖలన్నీ మారిపోవొచ్చు.
రామ్ చరణ్-నెల్సన్ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ స్టఫ్.. బయటకు వచ్చింది. బుచ్చిబాబు సినిమా అయిపోగానే నెల్సన్ సినిమా ఉంటుందని, దీనికి అనిరుథ్ సంగీతం అందిస్తాడన్నది ఓ వార్త. నిజానికి బుచ్చిబాబు సినిమా అవ్వగానే సుకుమార్ ప్రాజెక్ట్ ఉండాలి. కాకపోతే సుకుమార్ తన స్క్రిప్టు విషయంలో చాలా టైమ్ తీసుకొంటారు. ఇప్పటికైతే కథే రెడీ అవ్వలేదు. బౌండెడ్ స్క్రిప్టు రెడీ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా ఓ సినిమా చక చక పూర్తి చేయాలనుకొంటే నెల్సన్ మంచి ఆప్షన్. ఆయన ప్రస్తుతం ‘జైలర్ 2’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయితే చరణ్ సినిమా ఉంటుంది. కాంబో పరంగా చాలా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ అవుతుంది.
వీటి మధ్య మెహర్ రమేష్‌కి సంబంధించిన ఓ వార్త కూడా బయటకు వచ్చింది. మెహర్ రమేష్ త్వరలోనే ఓ మెగా హీరోతో సినిమా చేయొచ్చని, ఆ హీరో పవన్ గానీ, చరణ్ గానీ కావొచ్చన్నది నెట్టింట్లో వినిపిస్తున్న మాట. ఈ అంశమే ఫ్యాన్స్ ని కాస్త కంగారు పెడుతోంది. ‘భోళా శంకర్’ తలనొప్పిని ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు చాలా ఇచ్చాడు మెహర్. తనకు హీరోలు, నిర్మాతలు దొరకడమే కష్టంగా మారింది. ఇలాంటప్పుడు పవన్, చరణ్ లాంటి స్టార్లు తనకు ఛాన్స్ ఇస్తారనుకోవడం అత్యాసే. మరి ఈ వార్తలు ఎలా బయటకు వస్తున్నాయో మరి.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
బాహుబలి : చూడని సీన్స్ చూడబోతున్నారు..!

బాహుబలి ఫీవర్ మళ్లీ మొదలైంది. 2015లో బాహుబలి విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డ్‌లను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2 నమోదు చేసిన చాలా రికార్డ్‌లు అలాగే ఉన్నాయి. రాజమౌళి సైతం తన రికార్డ్‌లను తాను బ్రేక్ చేసుకోలేక పోయాడు. అలాంటి రికార్డ్‌లను క్రియేట్ చేసిన బాహుబలి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విడుదలై ఇన్ని ఏళ్లు అయినా కూడా ఇండస్ట్రీలో బాహుబలి అనే చర్చ జరుగుతూనే ఉంది. అందుకే బాహుబలి : ది ఎపిక్ రిలీజ్‌కి కొత్త సినిమా రిలీజ్ రేంజ్లో బజ్ క్రియేట్ అయింది. రెండు పార్ట్‌లను సింగిల్ పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు.
బాహుబలి రెండు పార్ట్‌లు కలిపి.. ప్రభాస్, రాజమౌళి కాంబోలో దాదాపు అయిదుఏళ్ల పాటు రూపొందిన బాహుబలి రెండు పార్ట్‌లను ఒకే పార్ట్‌గా బాహుబలి : ది ఎపిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగిందని అంటున్నారు. రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఎడిటింగ్ వర్క్ చూసుకున్నాడని, సౌండ్ విషయంలోనూ కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేశారని అంటున్నారు. తాజాగా సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాహుబలి : ది ఎపిక్ పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాడు. రెండు పార్ట్‌లను ఎడిట్ చేసి ఒక్క పార్ట్‌గా చేయడం మాత్రమే కాదని, గతంలో యాడ్ చేయలేక పోయిన కొన్ని సీన్స్‌ను, విజువల్స్‌ను ఈ సినిమాలో యాడ్ చేసినట్లుగా ఆయన చెప్పడంతో ఆ కొత్త సీన్స్ ఏమై ఉంటాయా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
బాహుబలి ది ఎపిక్ రిలీజ్‌కి రెడీ బాహుబలి రెండు పార్ట్‌లను ఒక్క పార్ట్‌లో చూపించబోతున్నారు, ఇందులో కొత్త ఏం ఉండదు, ఇది అన్ని సినిమాల మాదిరిగా రీ రిలీజ్ అనుకుంటున్న వారికి తాజాగా సెంథిల్ చేసిన ప్రకటన ఉత్సాహాన్ని ఇస్తుంది, రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఒక్క కొత్త సీన్ అయినా పైసా వసూళ్ అనిపిస్తుంది. అందుకే ఆ సీన్స్ ను చూడ్డానికి అయినా థియేటర్లకు పరుగులు పెట్టాల్సిందే అని అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయింది. రికార్డ్ స్థాయిలో సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ లో నమోదు చేయని వసూళ్లను ఈ సినిమా రాబట్టే అవకాశాలు క్లీయర్‌గా కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు జక్కన్న ఫ్యాన్స్ సినిమా రూ.100 కోట్ల మార్కెట్‌ను చేరబోతుందనే విశ్వాసంను చాలా బలంగా వ్యక్తం చేస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments