
టాలీవుడ్‌లో నటీమణులు ఎంతమంది ఉన్నా కూడా అందులో మంచు లక్ష్మికి ఉండే క్రేజే వేరు. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటిగా పరిశ్రమలో అడుగుపెట్టింది. 2011లో ‘‘అనగనగా ఒక ధీరుడు’’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రవేశించిన మంచు లక్ష్మి, మొదటి సినిమాలోనే విలన్ పాత్రలో తన ప్రతిభను నిరూపించుకుంది.
అమెరికాలో పుట్టి పెరిగిన మంచు లక్ష్మి, అక్కడే పలు టీవీ షోలలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ, తన మాతృభాష తెలుగు చిత్రాల్లో తనను ప్రూవ్ చేసుకోవాలని ఇండియాకు వచ్చి నటిగా స్థిరపడిరది. తరువాత ఆమె ‘గుండెల్లో గోదావరి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాకుండా, ఆమె ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చి తన నటనా ప్రతిభను మరింత చాటుకుంది.
మంచు లక్ష్మి నటనతో పాటు నిర్మాతగా కూడా మంచి విజయాలు సాధించింది. సొంతంగా సినిమాలు నిర్మించి తనకు మరో కొత్త పాత్రను సృష్టించుకుంది. వీటితో పాటు, బుల్లితెరపై కూడా ఆమె హోస్ట్‌గా కీర్తిని పొందింది. ముఖ్యంగా ఆమె హోస్ట్ చేసిన రియాలిటీ షోలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇటీవల, మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పలు గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. షార్ట్ జీన్స్ లుక్‌లో ఉన్న ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, మంచు లక్ష్మి వయసు పెరుగుతున్నప్పటికీ ఆమె అందం మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో షూట్ ద్వారా మంచు లక్ష్మి రాబోయే రోజుల్లో మరిన్ని గ్లామర్ పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆదిపర్వం’ మరియు ‘అగ్నినక్షత్రం’. ఈ చిత్రాలు మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా ఉండబోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఆదిపర్వం’ టీజర్ యాక్షన్ మరియు థ్రిల్లర్ నేపథ్యంతో ఆకట్టుకుంటోంది. ఇక ‘అగ్నినక్షత్రం’ యాక్షన్ కథాంశంతో రూపొందుతుండడంతో, ఈ రెండు సినిమాలు మంచు లక్ష్మి కెరీర్‌కు మరింత ఊతమిస్తాయని భావిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో ఉన్న మంచు లక్ష్మి ప్రస్తుతం హిందీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్-సౌత్.. దూరం పెరుగుతోందా?
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకీ, దక్షిణాది చిత్రాలకూ స్పష్టమైన తేడా ఉండేది. మనవన్నీ ‘సాంబార్ సినిమాలు’ అని బాలీవుడ్ వాళ్లు కొట్టి పడేసేవారు. దక్షిణాది చిత్రాలకూ, ఇక్కడి మార్కెట్ కూ పెద్ద విలువ ఇచ్చేవారు కాదు. ఇండియన్ సినిమా అంటే, బాలీవుడ్ సినిమానే అని ప్రోపకాండ చేసేవారు. అయితే రోజులు మారాయి. బళ్లు ఓడలు, ఓడలు బళ్లూ అయ్యాయి. బాలీవుడ్ వైభవం మసకబారిపోయింది. అదే సమయంలో సౌత్ సినిమా సత్తా చాటింది. తెలుగు నుంచి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, పుష్ష లాంటి చిత్రాలు వచ్చాయి. కన్నడ సీమ కేజీఎఫ్, కాంతారలను దింపింది. మలయాళం ఎప్పటిలానే కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు తీసింది, అద్భుతాలు సృష్టించింది. ఈ గ్యాప్ లో బాలీవుడ్ మొత్తం చిత్తయిపోయింది. అక్కడ బడా స్టార్లు కూడా కుదేలైపోయారు. దక్షిణాది గొప్పదనం ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు. ఇండియన్ సినిమా అంతే. బాలీవుడ్ స్టార్లు దక్షిణాది సినిమాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కొంతమంది పనిగట్టుకొని బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వేరుచేసి మాట్లాడుతున్నారు. దక్షిణాది సినిమాల్ని, ఇక్కడి హీరోల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్షద్ వార్సీ ప్రభాస్‌పై చేసిన కామెంట్లు బాలీవుడ్‌కి సౌత్ ఇండియా అంటే ఎంత చిన్న చూపు ఉందో చెప్పకనే చెప్పాయి. ప్రభాస్‌ని ఆయన జోకర్‌తో పోల్చాడు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. తెలుగు చిత్రసీమ నుంచి కొంతమంది అర్షద్‌కు కౌంటర్లు ఇచ్చారు. ‘యానిమల్ ‘ సూపర్ డూపర్ హిట్టవ్వడం బాలీవుడ్‌లో కొంతమందికి నచ్చలేదు. దానికి కారణం.. ఆ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడం. ఓ తెలుగు దర్శకుడు తీసిన సినిమా అది. అందుకే ఏదో రూపంలో ఆ సినిమాని విమర్శిస్తూనే ఉన్నారు. సందీప్ ఏం ఆగలేదు. తన స్టైల్‌లో వాళ్లపై రివర్స్ ఎటాక్ చేసి నోళ్లు మూయించాడు. ‘జవాన్’ చూసి కూడా అక్కడి జనాలు నోరెళ్లబెట్టారు. ‘ఇంత రొటీన్ సినిమాకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్’ అంటూ విస్తుబోయారు. ఇదంతా దక్షిణాది ఎదుగుదల చూడలేకే.
ఇవి చాలదన్నట్టు ‘కాంతార’తో జాతీయ అవార్డు అందుకొన్న రిషబ్ శెట్టి ఇటీవల బాలీవుడ్ పై ఘాటైన విమర్శలు చేశాడు. కొన్ని బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇది బాలీవుడ్ వాళ్లకు నచ్చలేదు. ‘జాతీయ అవార్డు వచ్చిందని ఏది పడితే అది మాట్లాడకు’ అంటూ అక్కడి వాళ్లు ఫైర్ అవుతున్నారు. రిషబ్ పాత సినిమాల్ని, అందులోని క్లిప్పింగ్స్‌నీ ఏరి రిషబ్ ని ట్రోల్ చేస్తున్నారు. ‘కాంతార’ జాతీయ అవార్డు వచ్చేంత గొప్ప సినిమా కాదని, అందులో రిషబ్ నటన కూడా ఆ స్థాయిలో ఉండదంటూ హేళనగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ బాలీవుడ్- దక్షిణాది మధ్య చిచ్చు పెట్టే అంశాలే. అమితాబ్చన్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ లాంటి దగ్గజాలే భాషల మధ్య విభజన రేఖలు వద్దని, ఎక్కడ తీసినా సినిమా సినిమానే అని చెబుతుంటారు. ప్రతీ చిత్రసీమనీ గౌరవిస్తుంటారు. ఏ మాత్రం స్థాయి లేని కొంతమంది, తమ ప్రచారం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటారు. అన్ని ప్రాంతాల్ని ఏకం చేసే శక్తి సినిమాకు ఉంది. మంచి సినిమా వచ్చినప్పుడు భాషలకు అతీతంగా ఆదరించడం ప్రేక్షకుల గుణం. అదే ఉత్తరాదినీ, దక్షిణాదిని ఏకం చేసే సూత్రం.
గోపీచంద్ భలే తప్పించుకున్నాడే..!
సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడం అనేది చాలా కామన్. స్టోరీ నచ్చక ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. ఆ కథ మరొక హీరోకు నచ్చడం, సినిమా చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే అలా రిజెక్ట్ చేసిన కథలు హిట్టైతే హీరోలు ఎంత బాధపడతారో.. ఫ్లాప్ అయితే హమ్మయ్య బతికిపోయామని అంతకన్నా ఎక్కువ సంతోషపడతారు. ఇటువంటి పరిణామం టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లోనూ చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఒక డిజాస్టర్ మూవీ నుంచి గోపీచంద్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు రూలర్. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఇది. సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా వేదిక, సోనాల్ చౌహాన్ నటించారు. భూమిక, షతాఫ్ ఫిగర్, జయసుధ, సాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ 2019లో విడుదలైన రూలర్ డిజాస్టర్ గా నిలిచింది.
రొటీన్ కమర్షియల్ మూవీ అని సినిమా విశ్లేషకులు తేల్చేశారు. అలాగే బాలయ్య లుక్స్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా కథ అసలు బాలయ్య కోసం రాసుకున్నది కాదు. ఆయన చేయాల్సింది కాదు. పరుచూరి మురళి దగ్గర నుంచి కథ తీసుకున్న డైరెక్టర్ కెఎస్ రవికుమార్.. మొదట గోపీచంద్ తో సినిమా తీయాలని భావించారు. ఆయన్ను కలిసి కథ కూడా వినిపించారు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయింది.
అయితే అప్పుడే డైరెక్టర్ సంపత్ నంది గోపీచంద్ కు సీటిమార్ స్టోరీని నెరేట్ చేశాడు. రూలర్ కన్నా సీటిమార్ కథే గోపీచంద్ ను ఎక్కువగా ఆకట్టుకోవడంతో.. ఆయన కెఎస్ రవికుమార్ కు నో చెప్పేశాడు. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలయ్య.. తన తదుపరి ప్రాజెక్ట్ ను కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించారు. దాంతో గోపీచంద్ రిజెక్ట్ చేసిన కథతోనే బాలయ్యను మెప్పించి రూలర్ తీశారు. సీన్ కట్ చేస్తే.. సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
Opmerkingen