top of page

మా డబ్బున్నోళ్ల కష్టాలు మీకేం తెలుసు?!

Writer: DUPPALA RAVIKUMARDUPPALA RAVIKUMAR
  • అందరి జీవితాలూ బంగారు బీరువాలో పదిలం

  • పేదవాడ్ని చూస్తే ధనవంతుడికి ఈర్ష్య

‘‘ధనవంతులు తమ ఆశయాలను, ఆకాంక్షలను మడిచి ఎక్కడో దాచుకుని, సమాజం ఆశించినట్టే బతుకుతారు. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి గురవుతారు. సామాజిక బాధ్యతలు, రహస్య వ్యక్తిగత కోరికల మధ్య నలిగిపోతున్న జీవితాలను కృష్ణుడితో, సీతతో పోలుస్తూ తెలివైనవాళ్లు అనుకున్నవారు సైతం ఈ సామాజిక జాఢ్యంలో పడి తమను తాము కోల్పోతున్నారని’’ ..దేవదత్‌ పట్నాయక్‌ అంటున్నారు.

ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా శక్తిమంతుడైనప్పటికీ మీకు నచ్చిన వారిని మీరు వివాహం చేసుకోలేకపోతే ఎలా ఉంటుంది? మీలాగా మీరు ఉండలేక ప్రపంచం ఆశించిన విధంగా బతకాల్సి వస్తే బాలీవుడ్‌ హిందీ సినిమాలాగా జీవితం అయిపోతుంది కదా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే బతుకుతున్నారనుకోండి, అప్పుడు అందరూ మీరు చాలా సంతోషంగా, తెలివిగా, హాయిగా ఉన్నారనే అనుకుంటారు. మీ ఒంటరితనాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇలా ఊహిస్తేనే మన నోరంతా చేదుగా అయిపోతుంది కదా. అంత డబ్బు, పవర్‌ ఉండి కూడా మీరు ద్రోహవృక్షం కింద నిలబడ్డట్టే ఉంటుంది కదా. ఒకసారి ఇది మీకు అర్థమైపోతే మీరు ఊరుకోరులెండి. మీ చుట్టూ ఉన్న మీ పాలిట విలన్ల భరతం పడతారనుకోండి. మీలో పేరుకుపోయిన నిర్వేదాన్ని పోగొట్టుకోవడానికి, మిమ్మల్ని మరుగుజ్జులను చేయాలనుకున్నవారిని తిట్టించడానికి మనుషులను జీతానికి పెట్టుకోరూ..!

మనకు భాగవతంలో కృష్ణుడు తెలుసు కదా, గోపాలకులతో తుళ్లుతూ, ఆడుతూ, పాడుతూ, గోపికలతో కొంటె, చిలిపి పనులు చేస్తూ, చేతిలో ఉన్న ఫ్లూట్‌ను హాయిగా ఊదుకుంటూ కేర్‌`ఫ్రీ జీవితం గడుపుతుంటాడు. అదే మహాభారతంలో కృష్ణుడు వీటన్నింటినీ విడిచిపెట్టేసి పెద్దరికం నెత్తిన వేసుకుని బరువుగా కదులుతుంటాడు. అదే టైపన్నమాట. హాయిగా తుళ్లుతూ పరవశించే కృష్ణుడు రాజమహళ్ల లోగిళ్ల, యుద్ధక్షేత్రాల నియమాలకు బందీ అయిపోతాడు. కృష్ణుని కళ్లలో రాధ కోసం పడే ఆరాటాన్ని రుక్మిణి గ్రహిస్తుందే కాని, కృష్ణుడు మాత్రం దాని గురించి మాట్లాడడు. అతని భావోద్వేగాలన్నీ బంగారు బీరువాలో బంధించేసి, దానినే మంది కోసం చేసే త్యాగంగా మార్కెటింగ్‌ చేస్తాడు.

అందరమూ రహస్యాలు మోస్తున్నాం

ఈ రాజరికపు మర్యాదల ముసుగులో సీత కూడా రాజమందిరం నుంచి తరిమివేయబడిరది. చివరికి రామరాజ్యంలో పుకార్లు షికార్లు చేయించేవారు సంతోషంగా ఉంటే.. రాముడు మాత్రం ఏకాకి జీవితం గడుపుతాడు. రామాయణం, భారతాలు రెండూ బహిరంగ ప్రదేశాలలో వ్యక్తిగత కోరికలపై మనకు ఏదో చెప్తున్నట్టే ఉంటాయి. మరాఠీ భారతంలో ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ద్రౌపది కర్ణుడిని రహస్యంగా కామించడం మనకు తెలిసిందే. అప్పటి సమాజం ఆమెను అవమానిస్తుంది. ఆమెకు రక్షణగా కృష్ణుడు నిలుస్తాడు. ఆయన అందరినీ జాంబఫలం తినమంటాడు. అది తిన్నప్పుడు నాలుక రంగు మారితే వారు ఏవో రహస్యాలు దాచి మోస్తున్నట్టే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అందరి నాలుకలూ గోరింటాకు పెట్టినట్టు పండిపోతాయి. అంటే అందరూ ఏవో రహస్యాలు తమ హృదయాలలో మోస్తున్నట్టే. దీనర్ధం ఏమంటే అందరూ బంగారు బీరువాలలో దాక్కున్నవారే.

ధనవంతులు బీదవారి పట్ల గొప్ప ఈర్ష్యతో ఉంటారు. ఎందుకంటే పేదవారికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని, స్నేహాలు ఎక్కువగా ఉంటాయని, జీవితంలో తక్కువ నియమాలు ఉంటాయని, పోగొట్టుకునే పరువు పెద్దగా ఉండదని అనుకుంటారు. బీదవారు సంప్రదాయ బాదరబందీ మోయనవసరం లేదని, వారసత్వ భారాన్ని ఈడ్చనవసరం లేదని, కుటుంబ పేరు బరువును మోయనవసరం లేదని ధనవంతులు అనుకుంటారు. వాళ్లకు దొరకని స్వేచ్ఛను ధనవంతులు వారి బిడ్డలకు కూడా ఇవ్వలేదు. నిండా నగలు ధరించిన అత్తల మాదిరి క్రూరత్వాన్ని కోడళ్లు కూడా ప్రదర్శిస్తుంటారు. అది వాళ్లకు తప్పుగా కూడా అనిపించదు. అడవికి, జంతు ప్రదర్శన శాలకు మధ్య భేదాలు, మన ధనవంతులు తెలుసుకోలేని సమాజంలో మనం బతుకుతున్నాం. పక్షులు, మృగాలను వారి పెరటి తోటలో బంధించి, ప్రకృతికి గొప్ప సాయం చేస్తున్నామనే భ్రమల్లో ఉంటారు. అలా జూ లాంటి జీవితాన్ని అడవిగా భావించి, అందులో ఎలాంటి నియమాలు ఉండవని నమ్ముతూ ఆల్ఫా మేల్‌గా తమను తాము నమ్ముతారు. ఆ రాజభవనాలు అలంకారప్రాయమైన ఖైదులు, అందులో మహారాజులు నిశ్శబ్దంగా రోదిస్తుంటారు.

పైన పటారం.. లోన లొటారం.. వట్టి పటాటోపం..

కార్పొరేషన్లు కూడా ఇలాంటి పంజరాలే. ప్రతి సీఈవో, ఎండీ, చైర్మన్‌ జాగ్రత్తగా షేర్‌ హోల్డర్లతో మచ్చిక చేయబడతారు. దయ కూడా జాగ్రత్తగా దాతృత్వంగా, సోషల్‌ రెస్పాన్సిబిలిటీగా రూపాంతరం చెందుతాయి. అందుకే ధనవంతులు, శక్తిమంతులైన వారిని జాగ్రత్తగా పరిశీలిస్తే పబ్లిక్‌లో హుందాతనం, ఏకాంతంలో నీచత్వం స్పష్టంగా అగుపిస్తుంటాయి. కెమెరాలు ఆగిపోయినప్పుడు, తలుపులు మూసివేయబడినపుడు వారు పెట్టుకున్న మాస్క్‌ తొలగిపోయి వారి పెడబొబ్బలు, రోదనలు, కన్నీళ్లు, కసి అన్నీ బయటపడతాయి. ప్రజాస్వామ్యం, సహకారం, గాడిదగుడ్డూ ఏమీ ఉండవు. అన్నీ తొలగిపోతాయి. నియంత సంపూర్ణ బానిసత్వం కోరుకుంటాడు. ఇది గానీ, నువ్వు పబ్లిక్‌లో చెప్పావంటే నిన్ను ఈర్ష్యాపరుడని ఈసడిరచుకుంటారు. అందరూ నమ్మాలనుకునే ఒక అబద్దం ఏమంటే, పేదవారు ధనికులు కావాలనుకుంటారు. ధనవంతులు కోరికలు తీర్చే కల్పవృక్షం ఉండే స్వర్గంలో ఉంటారనుకుంటారు. కానీ అక్కడి గాలిలో రాపాడే రహస్య కోరికలు, డోరియన్‌ గ్రే నిజస్వరూపం అంతా రాజభవనంలో పనిచేసే సిబ్బందికి తెలుసు. వారు మాట్లాడకూడదు. మాట్లాడితే కుత్తుకలు కత్తిరిస్తారు. గుడ్లు పీకేస్తారు.

ధనవంతుల దుఃఖాన్ని నమ్మేవారు కరువు. డబ్బున్నవాళ్లు గొప్పోళ్లని ఉద్యమకారులు కూడా ఊదరగొడ్తుంటారు. బ్రాహ్మణ కుటుంబాలలో స్వలింగ సంపర్కులు ఎదుర్కొనే చిత్రహింసలను దళిత కుటుంబాలలో స్వలింగ సంపర్కులు కూడా ఎదుర్కొంటారని ఎవరూ నమ్మరు. అందరూ రాజుగారి వస్త్రాలు చూస్తున్నట్టే నటిస్తుంటారు. చనిపోయినప్పుడు కూడా ఘన విజయాలే గుర్తుంచుకుంటారు. కంటికి కనిపించని కారాగారాల గురించి పట్టింపే లేదు.

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page