top of page

మోడీని తక్కువ అంచనా వేయొద్దు

Writer: DV RAMANADV RAMANA

బంగ్లాదేశ్‌ విషయంలో మోడీ చాలామందికి ఉదాసీనతగానే కనిపిస్తున్నా వైరిపక్షం వలలో పడకూడదనే దూరదృష్టి ఉంది. భారత్‌ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పొలిటికల్‌ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాన్ని అమలుపరుస్తోంది. అదెలాగో తెలుకునే ముందు జో బైడెన్‌ యంత్రాంగం బంగ్లాదేశ్‌ ద్వారా భారత్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం. అయితే విధ్వంసం వ్యూహరచన ఎలా ఉందో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినా క్లియర్‌ పిక్చర్‌ ఏమిటో తెలియదు, కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో భారత్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయన్నది నిజం. సీఐఏ నేరుగా పాకిస్థాన్‌తో చేతులు కలపకుండా జార్జ్‌ సోరోస్‌ ద్వారా ఫండిరగ్‌ చేయిస్తోంది. నిజంగా అవి జార్జ్‌ సోరోస్‌ డబ్బులా, లేక సీఐఏ తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్‌లో నుంచి ఫండిరగ్‌ చేస్తున్నదా అనేది తెలియదు. పాకిస్థాన్‌ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కానీ.. ఐఎస్‌ఐ ద్వారా పాకిస్థాన్‌ సైన్యానికి కావలిసినంత డబ్బు అందుతోంది. ఐఎస్‌ఐ బంగ్లాదేశ్‌లోని రాడికల్‌ గ్రూపులకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తోంది. ఐఎస్‌ఐ ద్వారా జార్జ్‌ సోరోస్‌ తన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పటికే ఇరాక్‌, లిబియా, ఉక్రెయిన్‌, సిరియా దేశాలలో ఏదైతే పధక రచన చేసి విజయం సాధించారో, అదే విధంగా మన దేశం మీద అమలు చేస్తున్నారు. ముందు బంగ్లాదేశ్‌ నుంచి షేక్‌ హసీనాని బహిష్కరించడమో, లేక నకిలీ అభియోగాలు మోపి ఉరి తీయడమో చేయాలి. షేక్‌ హసీనా నియంత అని రాడికల్స్‌ ద్వారా ప్రచారం చేయించారు. రెండు రోజుల క్రితం ఢల్లీిలో ఉన్న షేక్‌ హసీనా స్వయంగా వెల్లడిరచిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది 2023 లోనే మొదలయింది అని, సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్‌గా పధక రచన చేశారు. దృష్టి మరల్చడానికి హమాస్‌, హెజ్బొల్లాలని వాడుకున్నారు. ఇరాక్‌, లిబియాల మాదిరిగానే బంగ్లాదేశ్‌లో కూడా బంగబంధు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాలని, గుర్తులని చేరిపివేశారు రాడికల్స్‌. గత మూడు నెలలుగా ముజీబుర్‌ రెహ్మాన్‌ తమకు స్వాతంత్య్రం తేలేదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు బహిరంగంగానే షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ని, షేక్‌ హసీనాని దేశద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్‌ని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా మారుస్తారని అక్కడే ఆగిపోతే పొరపాటు. బాంగ్లాదేశ్‌కి భారత్‌ మొదటి శత్రువు అని నూరిపోస్తున్నారు. ఐఎస్‌ఐ ఇప్పటికే అవసరం అయితే సైనిక సాయం చేస్తామని మాట ఇచ్చింది. దానిని రాడికల్స్‌ బలంగా నమ్ముతున్నారు. టర్కీ నుంచి పాకిస్తాన్‌ బైరాక్టర్‌ కామీకాజ్‌ డ్రోన్లు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్‌కి నమ్మకం కుదరడానికి కొన్ని బైరాక్టర్‌ డ్రోన్లు ఉచితంగా ఇచ్చింది. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌ రిటైర్డ్‌ ఆర్మీ కల్నల్‌ ఒకడు మోడీని, భారత్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ నాలుగు గంటల్లో అసోం, కోల్‌కతాలను స్వాధీనం చేసుకుం టాషని అనడం వెనుక ఐఎస్‌ఐ ప్రచారం ఉంది. మోడీ పేరుని చెప్పడం వెనుక వ్యూహం ఉంది. 1971లో బంగ్లాదేశ్‌ విమోచనకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది పాకిస్థాన్‌. బంగ్లాదేశ్‌ నుంచి నేరుగా మోడీ, భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రావడం వెనుక ఒక వ్యూహం ఉంది. పాకిస్తాన్‌ నుంచి మిసైల్స్‌, ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లాదేశ్‌కి చేరుకొని ఉండ వచ్చు. ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న బంగ్లాదేశ్‌లో ఉన్న ఉగ్రవాదులు గెరిల్లా దాడులకి పాల్పడవచ్చు. మోడీ ముందు దౌత్యపరంగా ఎంత చేయవచ్చో అంతా చేస్తున్నారు. అఫ్కోర్స్‌.. అవేవి పనిచేయకపోవచ్చు. ఎయిర్‌టెల్‌ బంగ్లాదేశ్‌లోని సమ్మిత్‌ కమ్యూనికేషన్స్‌, ఫైబర్‌ ఎట్‌ ద హోమ్‌ అనే సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈశాన్య రాష్ట్రాలలో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. బంగ్లాదేశ్‌లోని అఖోరా బోర్డర్‌ ద్వారా కేబుల్స్‌ ఈశాన్య రాష్ట్రాలలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్‌. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలలో హై స్పీడ్‌ కేబుల్‌ ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలలో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ లేకపోతే గెరిల్లా దాడులు చేయడానికి వీలుగా ఉంటుంది. భారత్‌ మీద శత్రు త్వంతోనే ఇన్నాళ్లూ బతికిన పాకిస్తాన్‌ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు మోడీ బంగ్లాదేశ్‌లో కూడా అదే వ్యూహాన్ని అమలుచేస్తారు. రోజులు గడిచే కొద్దీ ఆర్ధిక ఇబ్బందులు, విద్యుత్‌ కోతలు, ఆహార సంక్షోభం, బాంకుల దివాలాలు చాలు తోకముడిచి అడుక్కోవడానికి!

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page