
అమెరికా 47వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయగానే డోనాల్డ్ ట్రంప్ అన్నట్లుగానే ఎగ్జిక్యూ టివ్ ఆర్డర్ ద్వారా మొదటి దెబ్బ వేసాడు. అమెరికాలో పుట్టగానే పౌరసత్వం రాదు ఇకముందు. అమెరికన్ పౌరులకి పుట్టిన వాళ్లకి మాత్రమే ఆటోమేటిక్‌గా పౌరసత్వం వస్తుంది. పర్మినెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్‌కార్డ్ ఉన్నవారి పిల్లలకి పౌరసత్వం ఆటోమేటిక్‌గా వస్తుంది. హెచ్1బి వీసా, స్టూడెంట్ వీసా, ఏదన్నా వర్క్ వీసా మీద అమెరికా వెళ్లిన వాళ్లకి అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమాటిక్‌గా పౌరసత్వం రాదు. ఇకనుంచి గ్రీన్‌కార్డ్ పొందడం చాలా కష్టం. ఇప్పటికే పెండిరగ్‌లో ఉన్న అప్లికేషన్స్ కూడా ఆమోదం పొందడం కష్టం. ఇకముందు హెచ్1బి వీసా దొరకడం కూడా కష్టం. ఇప్పటికే హెచ్1బి వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్లకి రెన్యువల్ అవడం కూడా కష్టం. హెచ్1బి వీసా కాల పరిమితి 6 సంవత్సరాలు పూర్తయిన వారిని బలవంతంగా వారి వారి దేశాలకి పంపించేస్తారు. ఒక్క భారతీయులకే కాదు.. కానీ అన్నీ దేశాల వాళ్లకి ఇది కష్టకాలం. ఇప్పటి వరకూ హెచ్1బి వీసా మీద అమెరికా వెళ్లి పనిచేస్తూ పెళ్లి చేసుకొని భార్యని కూడా అమెరికా తీసుకెళ్లి అక్కడే పిల్లలని కనడం, తర్వాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయడం ఈలోపున అంటే పదేళ్లకి గ్రీన్‌కార్డ్ రావడం జరుగుతూ వచ్చింది. కానీ ఇక నుంచి అలా కుదరదు. ట్రంప్ ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. కానీ సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి ట్రంప్ ఆర్డర్ కనుక పూర్తిస్థాయిలో అమలు కావాలి.. అంటే ఇది సుదీర్ఘమైన పోరాటం అవబోతున్నది అన్నమాట. సిలికాన్ వాలీ పెద్దలు ముందుగా సుప్రీంకోర్టు తలుపు తడతారన్నది నిజం. ఎందుకంటే మొదట నష్టపోయేది వాళ్లే. ఇక స్టూడెంట్ వీసా కోసం భారత్‌లోని బ్యాంకుల్లో అప్పు చేసి, అమెరికాలో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ నెట్టుకొద్దామనే వాళ్లకి ఆశాభంగం తప్పదు. త్వరలో అమెరికన్ యూనివర్సిటీలో చదవాలి అంటే భారం కావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలలోని యూనివర్సిటీలు ముస్లిం దేశాల నుంచి భారీగా విరాళాలు స్వీకరిస్తూ నెట్టుకొస్తున్నాయి. ఈ విరాళాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాడు ట్రంప్. భారతీయ విద్యార్థులు అక్కడి ఖర్చులకు సరిపడా డబ్బు సమకూర్చుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి చదువు అయిపోయిన తర్వాత ఎవరికివారు వాళ్ల దేశాలకి వెళ్లిపోవాలి. ఉద్యోగ అవకాశం వస్తే మళ్లీ వీసా తీసుకొని అమెరికా వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా అల్లుడు, కోట్ల రూపా యల కట్నాలకి తాత్కాలికంగా తెర పడుతుంది అనుకోవచ్చు. అదే సమయంలో గ్రీన్‌కార్డ్ ఉన్నవాళ్లకి భారీగా కట్నాలు ఇవాళ్సి ఉంటుంది ఆడపిల్లల తల్లిదుండ్రులకి. హెచ్1బి వీసా ఉన్న వాళ్లకి డిమాండ్ పడిపోతుంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని టాయిలెట్ పేపర్‌తో పోలుస్తున్నారు నిపుణులు. ముందు ఫెడరల్ కోర్టులు అంగీకారం తెలపాలి. అయితే రాజ్యాంగం సవరించకుండా ట్రంప్ ఆర్డర్ చెల్లదనే తీర్పు వస్తుంది మరో మూడేళ్లకి. కోర్టు తీర్పుని అనుసరించి రాజ్యాంగ సవరణ చేయాలని ట్రంప్ అనుకున్నా అది అంత సులభంగా జరిగేపని కాదు. ఎలాగంటే.. యునైటెడ్ స్టేట్స్ కాన్‌స్టిట్యూషన్ ఫోర్టీన్త్ అమెండ్‌మెంట్ ఆర్ పర్సన్స్ బోర్న్ ఆర్ నేచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అండ్ ద స్టేట్ వేర్ దే రిసైడ్. ఇది అమెరికా 14వ రాజ్యాంగ సవరణలో ఉన్నది. పోనీ రాజ్యాంగ సవరణ చేద్దామని అనుకున్నా అదీ జరిగే పని కాదు. 291 మంది కాంగ్రెస్ సభ్యులు G 67 మంది సెనేటర్ల మద్దతు కావాలి. అంటే 68 మంది డెమోక్రాట్ హౌస్ సభ్యులు, 23 మంది డెమోక్రాట్ సెనేటర్ల మద్దతు కావాలి. ఇక 223 మంది రిపబ్లికన్ సభ్యులు హౌస్‌లో, 53 మంది రిపబ్లికన్ సెనేటర్స్ మద్దతు కూడా కావాలి. ఆఫ్కోర్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఓటింగ్‌లో పాల్గొనాలి. పైన చెప్పినవి మొదటి మెట్టు. రెండవ మెట్టులో 2/3 మెజారిటీ ఉండాలి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 34 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. వీటిలో 5 రాష్ట్రాలు డెమోక్రాట్స్ చేతిలో ఉన్నాయి. సాధ్యమా? ఎన్నికల హామీ నెరవేర్చాడు ట్రంప్ అంతే. బహుశా కేసీఆర్ స్ఫూర్తి ఇచ్చి ఉంటారు.. తెలంగాణ రాగానే రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతాను అని.. కానీ లక్ష నాగళ్లు లభ్యం కాలేదు. ట్రంప్ కూడా మాట ఇచ్చాను నెరవేర్చాను కానీ నాకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి అది పూర్తిగా నెరవేర్చలేకపోయాను అంటాడు. ఎటూ కోర్టు తీర్పు వచ్చేసరికి నాలుగేళ్లు పడుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రస్తుత వీసా ఆర్డర్ వల్ల ఎక్కువగా నష్టపోయేది భారత్ మాత్రమే. అయితే నాలుగేళ్లు ఇబ్బంది ఉండవచ్చు లేదా ట్రంప్ ఆర్డర్ అమలు కాకుండా కోర్టు స్టేఆర్డర్ ఇస్తే మూడు నెలల ఇబ్బంది ఉంటుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినా మనమేమి సంబర పడనవసరం లేదు.
Comments