top of page

మాయ చేస్తున్న బాహుబలి బ్యూటీ..

  • Guest Writer
  • Oct 14
  • 2 min read

ree

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా కాంబినేషన్లో వచ్చిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘బాహుబలి’ . ఈ సినిమా ఇండియన్‌ సినీ రికార్డ్‌ లను తిరగరాసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘బాహుబలి 2’ సినిమా వచ్చి మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ వసూలు చేసిన ఇండియన్‌ చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలతో దర్శకుడు సంచలనం సృష్టించడమే కాదు ఇందులో నటించిన ప్రతి చిన్న జూనియర్‌ ఆర్టిస్ట్‌కి కూడా మంచి గుర్తింపు అందించారు.

ఇదిలా ఉండగా బాహుబలి సినిమాలో ‘‘మనోహరీ’’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌కి ఏ రేంజ్‌లో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ముగ్గురు భామలు తమ అద్భుతమైన డాన్స్‌ పెర్ఫార్మన్స్‌ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌,మధు స్నేహ ఉపాధ్యాయ, నోరా ఫతేహి ముగ్గురు కూడా ఎవరికివారు తమ అద్భుతమైన పర్ఫామెన్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాట తరువాత ప్రముఖ హీరోయిన్‌ నోరా ఫతేహి పేరు బాగా మారుమ్రోగింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా తర్వాత స్పెషల్‌ సాంగ్‌ లకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన నోరా ఫతేహి తన అందంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా సోషల్‌ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్‌ చేసిన ఈమె.. ఇందులో అద్దాలు పొదిగిన డ్రెస్‌ లో చాలా అందంగా కనిపిస్తోంది. తాజాగా తన అందాలను హైలెట్‌ చేస్తూ ఫోటోలను షేర్‌ చేసిన నోరా ఫతేహి మరోసారి తన అందంతో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఇండియన్‌ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. డాన్సర్‌, మోడల్‌, సింగర్‌, రియాలిటీ షో జడ్జిగా కూడా పేరు దక్కించుకుంది. 2014లో హిందీ సినిమా రోర్‌ :టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్భన్స్‌ అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో టెంపర్‌, కిక్‌ 2, లోఫర్‌, ఊపిరి వంటి చిత్రాలలో ఆడి పాడిన ఈమె.. బాహుబలి సినిమాలో మనోహరి పాటతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 1992 ఫిబ్రవరి 6న కెనడా, క్యూబెక్‌ లో జన్మించిన ఈమె ఈ మధ్య నిర్మాతగా కూడా అవతరించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌ , హిందీ భాషల్లో నటిస్తూ భారీ పాపులర్‌ అందుకున్న ఈమె ఇప్పుడు స్పెషల్‌ సాంగ్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఉఫ్ఫ్‌ యే సియాపా అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్‌ 5 2025న ఈ సినిమా విడుదల కానుంది అని ప్రకటించారు.కానీ ఆ తర్వాత పోస్ట్‌ పోన్‌ చేశారు. ఇక కే డి: ది డెవిల్‌, బీ హ్యాపీ చిత్రాలలో నటిస్తోంది.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

కిరణ్‌ అబ్బవరం.. వన్‌ మాన్‌ ఆర్మీ
ree

ఓ సినిమాని ప్రమోట్‌ చేసుకోవడం చాలా చాలా అవసరం. మంచి ప్రాజెక్ట్‌ తీయడమే కాదు. జనాల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఈ విషయంలో కొంతమంది హీరోలు చాలా అప్రమత్తతో వ్యవహరిస్తుంటారు. ఈ జనరేషన్‌లో సినిమాని ప్రమోట్‌ చేసుకోవడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు కిరణ్‌ అబ్బవరం కూడా అదే చేస్తున్నాడు. తన సినిమాలన్నీ తానే స్వయంగా ప్రమోట్‌ చేసుకొంటుంటాడు. నిర్మాతలతో సంబంధం లేదు. తనకంటూ ఓ రోడ్‌ మ్యాప్‌ ఉంటుంది. ‘క’ సినిమాని తాను చాలా గట్టిగా ప్రమోట్‌ చేశాడు. తగిన ఫలితం కూడా వచ్చింది. ఇప్పుడు ‘కె.ర్యాంప్‌’ని కూడా అలానే ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూల ఘట్టం పూర్తి చేశాడు. ట్రైలర్‌ ప్రెస్‌ మీట్‌ హైదరాబాద్‌ లో జరిగింది. ఇప్పుడు గ్రౌండ్‌ లెవల్‌ ప్రమోషన్‌ మొదలు పెట్టాడు. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీకి వెళ్లాడు. రాజమండ్రి రౌండ్‌ వేశాడు. 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వుంది. 17న మరో ప్రెస్‌ మీట్‌ హైదరాబాద్‌ లో ప్లాన్‌ చేస్తున్నాడు. ఈమధ్యలో మీమర్స్‌ ని కూడా మీట్‌ అవుతున్నాడు.

ఈ దీపావళికి గట్టి కాంపిటీషన్‌ వుంది. ముఖ్యంగా ‘కె.ర్యాంప్‌’, ‘డ్యూడ్‌’ సినిమాల మధ్య పోటీ వుంది. ఇవి రెండూ యూత్‌ కథలే. కాబట్టి యూత్‌ ని థియేటర్లలోకి ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలెట్టారు. ‘డ్యూడ్‌’ తో పోలిస్తే%ౌ% ‘కె.ర్యాంప్‌’ ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. దానికి కారణం కిరణ్‌ దూకుడే. ‘క’తో సక్సెస్‌ రూట్‌ లోకి వచ్చిన కిరణ్‌.. దాన్ని కాపాడుకోవాలంటే మరో హిట్టు కొట్టడం చాలా అవసరం. పైగా కె.ర్యాంప్‌.. తన బ్యానర్‌లో చేద్దామనుకొన్నాడు. ఈ కథతో అంత కనెక్ట్‌ అయ్యాడు. ‘క’ సక్సెస్‌ తో వరుసగా 5 కథలు ఓకే చెప్పాడు. మరో హిట్టు పడితే తన కెరీర్‌ ఎలా ఉంటుందో తనకు తెలుసు. కాబట్టి.. తానొక్కడే ప్రమోషన్లు చేసుకొంటున్నాడు. ప్రమోషన్ల వల్లే సినిమాలు ఆడవు. కాకపోతే.. సినిమా చూడాలన్న ఉత్సాహం, ఆలోచన ప్రేక్షకుల్లో కలుగుతాయి. వాటి కోసమే కిరణ్‌ ఇంత కష్టపడుతున్నాడు. తన కష్టానికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే 18న ఓపెనింగ్స్‌ ఫిగర్స్‌ చూడాలి.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page