మీరే అలా అంటే ఎలా సార్?
- Prasad Satyam
- Sep 20
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలిశారు. ఓ జర్నలిస్టు భార్య కేన్సర్ వ్యాధితో బాధపడుతుందని, ఆమె వైద్యానికి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరుచేయించుకున్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్‌ను ఉద్దేశించి నిత్యం ప్రజల్లో ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఎమ్మెల్యే టిక్కెట్ రాకముందు నుంచి జనాల్లోనే ఉన్న గొండు శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రోజులో అధిక గంటలు జనాల మధ్యనే తిరుగుతున్నారు. ఏ చిన్న పరామర్శ అయినా, ఎటువంటి కార్యక్రమమైనా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. స్థానిక ఎమ్మెల్యే నిత్యం కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల స్వయంగా ఆయన్ను కలవాలని, ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలని భావిస్తున్నవారికి ఏమాత్రం సమయం చిక్కడంలేదు. ఇక పార్టీ కోసం సమయం కేటాయించండి అని చంద్రబాబు చెబితే బాగుండేది. అలా కాకుండా ఇల్లు, ఆఫీసు కంటే బయటే ఎక్కువగా కనిపించే గొండు శంకర్ లాంటివారికి ఇప్పుడు చంద్రబాబు నిత్యం ప్రజలతో ఉండండి అంటే.. ఇక రాత్రి ఒంటిగంటకు కూడా ఆయన ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదేమో!
` 2 ఫొటోలు










Comments