top of page

మూల్యం ఎవరు చెల్లించాలి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 2, 2024
  • 2 min read

నేడు విమానయానం కేవలం సంపన్నులు మాత్రమే కాదు. సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. నిజానికి విమాన ప్రయాణికులలో వీరే అధికం. ఉపాధి, ఉద్యోగం, విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడు విమానయానాన్నే ఎంచుకుంటారు. అంతటి ప్రాధాన్యతను సంతరించు కున్న దేశ విమాన సర్వీసులకు సంబంధించి ఈ మధ్యకాలంలో వస్తున్న బాంబుబెదిరింపులు సామాన్య ప్రజలను సైతం ఎక్కువగా ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బాంబు బెదిరింపు లు, విమాన సర్వీస్‌ల రద్దు వల్ల విమానయాన సంస్థలకు కలిగే ఆర్థిక నష్టాన్ని సాధారణ ప్రయాణికులు భరించాల్సి ఉంటుంది. గత రెండు వారాలుగా, సోషల్‌ మీడియా ఖాతాల నుంచి వచ్చిన బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికే 16 రోజుల్లో 400 పైగా ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చాయి. పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. దీని ఖరీదు అక్షరాలా రూ.700 కోట్లు. చాలామందిని దారి మళ్లించి గమ్యాలకు చేర్చాల్సి వచ్చింది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో, విస్తారా, ఆకాషా, స్పైస్‌ జెట్‌, అలయన్స్‌ ఎయిర్‌ మొదలైన వివిధ సర్వీసులకు వచ్చిన బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. నిరంతర బెదిరింపు సందేశాల నేపథ్యంలో, విమానం లోపల, వెలుపల ప్రయాణీకులను తప్పనిసరిగా తనిఖీలు చేయాల్సి వుంటుంది. ఈ సంక్షోభం కోట్లాది రూపాయల భారాన్ని సృష్టిస్తుంది. సర్వీసు ఆలస్యమైతే దేశీయ విమానాలకు రూ.1.5 కోట్లు, అంతర్జాతీయ విమానాలకు రూ.5 నుంచి 5.5 కోట్ల వరకు అదనంగా ఖర్చు అవు తుంది. ఉదాహరణకు, ముంబై నుంచి న్యూయార్క్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఢల్లీి విమానా శ్రయం ద్వారానే మళ్లించినప్పటికీ విమానయాన సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. దేశీయ, విదేశీ విమానాశ్రయాలలో అత్యవసర ల్యాండిరగ్‌, టేకాఫ్‌ ఛార్జీలు భరించాల్సి వచ్చింది. అమెరికాలోని జె.ఎఫ్‌.కె. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌కు కనీసం నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. టేకాఫ్‌ అయిన రెండున్నర గంటల లోపు అత్యవసర ల్యాండిరగ్‌ అవసరమైతే, బోయింగ్‌ 777 వంటి పెద్ద విమానాలు కనీసం 100 టన్నుల ఇంధనాన్ని వినియోగించాల్సి ఉం టుంది. కంపెనీలకు 700 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు తాజా అంచనా. ఈ నేపథ్యం లో కేరళతో పాటు దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఏవియేషన్‌ అధికారులు భద్రతాపరమైన నిబంధనలను కఠినతరం చేశారు. ఎయిర్‌లైన్‌ కంపెనీలు ఇచ్చిన హామీ ప్రకారం తమ గమ్యాన్ని చేరుకోలేని ప్రయాణికులు పరిహారం కోసం దావా వేస్తారు. ఇది ఆర్థికంగా కూడా నష్టదాయకమైనది. ఆశించిన ఉద్యోగం సాధించలేక, ఇంటర్వ్యూకు హాజరు కాలేక, పోటీ పరీక్ష రాయలేక, ఆలస్యం కారణంగా వ్యాపారంలో భారీగా నష్టపోయినవారు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించడం సహజం. కంపెనీల విశ్వసనీయతకూ పెద్ద దెబ్బ. ఇప్పటి వరకు సాధించుకున్న ప్రతిష్ట మొత్తం తుడిచిపెట్టుకు పోతుంది. కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో కూడా ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ కంపెనీలు భవిష్యత్తులో ఈ నష్టాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేయడానికి ప్రయత్నిస్తాయి. ప్రయాణ ఛార్జీలు, ఇతర సర్వీస్‌ ఛార్జీలను విపరీతంగా పెంచడంతో పాటు, క్రమంగా నష్టాన్ని ప్రయాణికులపై మోపు తాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖపై ఉంది. ఈ బాంబు బెదిరింపుల కారణంగా ప్రయాణికులపై భారం మోపే ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేయాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉంది. అయితే, రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఎడతెగని ఈ బెదిరింపు సందేశాల కారణాన్ని కనుగొనడంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెదిరింపు సందేశాలు పంపే వారి ప్రయాణంపై నిషేధం విధిస్తామని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పడం మినహా ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇం దుకు సోషల్‌ మీడియా దిగ్గజాలు ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ మెటాలను తప్పుబడు తున్నారు. బెదిరింపు సందేశాన్ని పోస్ట్‌ చేసిన వారి వివరాలను ఈ ‘ఎక్స్‌’, ‘మెటా’ అందజేయనందున నేరస్థులను పట్టుకోలేకపోయారనే వాదన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. కొంతమంది నేరగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా మన దర్యాప్తు సంస్థలను బెదిరిస్తుండగా, మోడీ ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తుండిపోవడం క్షంతవ్యం కాదు. బాంబు బెదిరింపులకు మూల్యం ఎవరు చెల్లించాలి? ఒకటి కాదు, రెండు కాదు.. కచ్చితంగా దీని వెనుక ఆకతాయి చేష్టలు కాక కుట్ర కోణం ఉండివుంటుంది. విమాన యాన రంగాన్ని కుదేలు చేయడం దీని లక్ష్యం కాకపోయివుండొచ్చు. కచ్చితంగా దీని పరిణామాల వల్ల త్వరలోనే ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page