‘‘మైసా’’- రష్మిక వైల్డ్ అవతార్
- Guest Writer
- Jun 27
- 2 min read

రష్మిక మందన్నా.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘కుబేరా’, ‘ఛావా’ చిత్రాలతో వరుస విజయాల జోరు మీదున్న రష్మిక.. ఇప్పుడు మరో విభిన్న పాత్రతో స్క్రీన్‌పై సంచలనం కలిగించబోతోందనే టాక్. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘మైసా’ పేరుతో అధికారికంగా ప్రకటించబడిరది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హను రాఘవపూడి సహాయకుడిగా పని చేసిన రవీంద్ర, ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రష్మిక కొత్త యాంగిల్‌ను చూపించి అందరిలో ఆసక్తిని పెంచింది. అలాగే ధనుష్ (తమిళ), విక్కీ కౌశల్ (హిందీ), దుల్కర్ సల్మాన్ (మలయాళం), శివరాజ్ కుమార్ (కన్నడ), దర్శకుడు హను రాఘవపూడి (తెలుగు) లాంటి స్టార్ సెలెబ్రిటీస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం విశేషం. రష్మికను ఎంతో స్పెషల్‌గా ప్రెజెంట్ చేస్తూ.. సినిమా టైటిల్‌ను ‘‘మైసా’’గా అనౌన్స్ చేశారు. ఇది ‘గోండ్ తెగ’ మహిళ పాత్ర ఆధారంగా రూపొందినట్టు స్పష్టమవుతోంది.
తాజా ఫస్ట్ లుక్‌లో రష్మిక గోండ్ తెగ మహిళ అవతారంలో కనిపించింది. చేతిలో ఆయుధంతో, భయానకమైన భావాలతో నిలబడిన రష్మిక లుక్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆమె లుక్ చూస్తుంటే పాత్రలో పవర్ఫుల్ ఏమోషన్ ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటి వరకు చూడని రష్మిక పూర్తిగా కొత్త కోణంగా కనిపించడమే కాకుండా హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్ అనే ట్యాగ్ లైన్ సినిమాకు ఇంటెన్సిటీని చాటుతోంది. దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ‘‘ఈ కథను రెండు సంవత్సరాల పాటు మెరుగుపరచాం. ప్రతీ అంశాన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా శ్రమించాం. ఇప్పుడు ప్రపంచానికి ఈ కథను చెప్పేందుకు సిద్ధమవుతున్నాం’’ అని తెలిపారు. సినిమాలో గోండ్ తెగల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పోరాటాలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో నిర్మాతలు అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, సహనిర్మాత సాయి గోపా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూనిట్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సాంకేతిక బృంద వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. మొత్తానికి రష్మిక మైసా పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
మీ సెక్షన్లు నెగిటీవ్ రివ్యూల్ని ఆపుతాయా?

మంచు ఫ్యామిలీకీ ట్రోలర్స్ కీ అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా విష్ణుతో. విష్ణు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఓ వర్గం ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈమధ్య ఇలా తనపై పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నవాళ్లందరిపైనా వివిధ సెక్షన్ల కింద విష్ణు కేసులు వేశారు. వాళ్లంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. విష్ణు ముందస్తు జాగ్రత్తలు కాస్త ఈ తాకిడిని తగ్గించినట్టే అనుకోవాలి.
నేడు కన్నప్ప విడుదలైంది. ఈ సినిమా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడు. ప్రభాస్ లాంటి బడాస్టార్లని రంగంలోకి దించాడు. దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓపెనింగ్ డే వసూళ్లు ఎలా ఉంటాయా? అని విష్ణుతో పాటు చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు తన సినిమాపై వచ్చే ట్రోలింగ్‌ని కంట్రోల్ చేయడానికి కూడా విష్ణు సన్న ద్ధంగా ఉన్నాడు. పని గట్టుకొని కావాలని విమర్శించే వాళ్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. అయితే పరోక్షంగా రివ్యూలను కూడా అడ్డుకొంటామని చెప్పే ప్రయత్నం ఈ నోట్ లో కనిపించింది. తన సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాకుండా విష్ణు తీసుకొన్న జాగ్రత్త ఇదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈమధ్య రివ్యూల తాకిడి బాగా ఎక్కువైంది. ఫస్ట్ షో పూర్తయిన వెంటనే రివ్యూ వచ్చేస్తోంది. ట్విట్టర్ రివ్యూలు, వీడియో రివ్యూలు షరా మామూలే. మీడియా సంస్థలే కాకుం డా సినిమాపై అభిమానం, అవగాహన ఉన్నవాళ్లు కూడా తమ తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. వాళ్లని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. కన్నప్ప సినిమా బాగుంటే పర్వాలేదు. అటూ ఇటూ అయితే మాత్రం ట్రోలింగ్ పెరుగుతుంది. విమర్శలు ఘాటుగా ఉంటాయి. వాటిని ఇలాంటి ప్రెస్ నోట్‌లు, అందులో ప్రస్తావించిన సెక్షన్లు ఆపు తాయా?
సినిమా విడుదలైన తరవాత వచ్చే రివ్యూల్ని బట్టి దర్శక నిర్మాతలు, హీరోలు స్పందిస్తారు. ముందే ‘నెగిటీవ్ రివ్యూలు ఇస్తే జాగ్రత్త..’ అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా బాగున్నా.. నెగిటీవ్ రివ్యూలు ఇస్తే అది కావాలని చేస్తున్న పనే అనుకోవాలి. ఒక వేళ నిజంగా కన్నప్ప జనాలకు, విశ్లేషకులకు నచ్చకపోతే నిస్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్టు విమర్శిస్తే దాన్ని కన్నప్ప టీమ్ పాజిటీవ్ గా తీసుకొంటుందా? అనేదీ అనుమానమే. జనాభిప్రాయాల్ని, రివ్యూల్నీ ఇలాంటి హెచ్చరికలు ఆపలేవు. చట్టం తన పని తాను చేసుకొని పోయినట్టే.. రివ్యూ రైటర్లు కూడా తమ పని తాము చేసుకొంటూ పోతారు ఈ విషయంలో ఎవరి కంట్రోల్ ఉండదు. దాన్ని విష్ణు తెలుసుకొంటే మంచిది.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments