యూనివర్సిటీ వీసీలకు సీఎంవో మౌఖిక ఆదేశాలు
ఈ పని చేయలేక వైకాపా ప్రభుత్వానికి గబ్బు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దేశానికి మెరికల్ లాంటి స్కాలర్లను అందించాల్సిన యూనివర్సిటీల్లో వీసీలు, కొందరు అధ్యాపకులు చేస్తున్న రాజకీయాల వల్ల అధికార పార్టీకి అడ్డాలుగా మారిపోయిన యూనివర్సిటీల్లో ప్రస్తుతం వైస్‌ఛాన్సలర్లుగా పని చేస్తున్నవారందరూ విధుల నుంచి నిష్క్రమించాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఒక వైస్‌ఛాన్సలర్ పదవీకాలం మూడేళ్ల పాటు ఉంటుంది. ఆ పదవి నుంచి తొలగించాలంటే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి మూడొంతుల మంది ఎమ్మెల్యే ఓటింగ్‌తో తొలగించాలనే సాకుతో కళ్ల ముందే ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కనిపిస్తున్నా చేతకాక చేతులెత్తేసిన వైకాపా చేయలేని పనిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే చేసి చూపిస్తోంది. శ్రీకాకుళం వర్సిటీలో నిమ్మ వెంకట్రావు ఎంత అరాచకానికి పాల్పడ్డారో రాష్ట్రంలో ఉన్న 18 వర్సిటీల్లో ఎక్కువ శాతం మంది వీసీలు అదే సిద్ధాంతాన్ని అనుసరించారు. దీనికి కారణం.. యూనివర్సిటీలను పర్యవేక్షించాల్సిన ఉన్నత విద్యామండలికి చైర్మన్‌గా వ్యవహరించిన హేమచంద్రారెడ్డి తన కార్యాలయాన్ని కలెక్షన్ల అడ్డాగా మార్చేసి తనకు నచ్చినవారందర్నీ డెప్యూటేషన్ల మీద ఆప్షేకు తీసుకువచ్చి ప్రతీదానికి ఓ రేటు పెట్టి వీసీలకు దండుకునే లైసెన్స్ ఇచ్చేశారు. ఆప్షేలో నిజాయితీగా పని చేసి తీసుకునే జీతానికి న్యాయం చేయాలని భావించే ఒకరిద్దరి కోసం ఏకంగా కేసులు పెట్టి సాధించడం కోసం దళితులు, మహిళలను ఆప్షేలోకి డెప్యూటేషన్‌గా తీసుకువచ్చి వారితో కేసులు పెట్టించి సాధించారు. హేమచంద్రారెడ్డి ఆప్షే చైర్మన్‌గా పని చేసిన ఐదేళ్ల కాలంలో కేవలం లెక్కలకు దొరికిందే ఇప్పటి వరకు రూ.250 కోట్లు పైచిలుకు ఉంది. ఇది కాకుండా ఆయన కోటరీ మొత్తం ఆప్షేకు వచ్చేసి ఎవరికి తోచింది వారు దండుకున్నారు. దీనిపై సమగ్ర ఆధారాలతో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్‌కు తాజాగా వినతిపత్రం సమర్పించింది. ఇందులో వివిధ యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి, అక్రమాల భాగోతాలు, ఆర్థిక అరాచకత్వాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గనులు, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. హేమచంద్రారెడ్డి మీద భారీఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఆయన మీద చర్యలు ప్రారంభం కాలేదు. ఇందుకు కారణం ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్సిటీల్లోనూ వీసీలుగా ఆయన మనుషులే ఉన్నారని, విచారణ మొదలుపెడితే రికార్డులు తారుమారు చేస్తారని ప్రభుత్వం భావించింది. అందుకే ముందుగా రాష్ట్రంలో ఉన్న 18 వర్సిటీల్లోనూ హేమచంద్రారెడ్డి హయాంలో నియమించిన వీసీలను మర్యాదగా తప్పుకోమని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీన్ని కాదని న్యాయస్థానాన్ని ఆశ్రయించినా బహుశా ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఇవేవీ లిఖితపూర్వక ఆదేశాలు కావు. గవర్నర్ తర్వాత రెండో గవర్నర్లు మేమని భావించే వీసీలు తమ పదవీ కాలం మూడేళ్లని భావించి కుర్చీని వీడటానికి ఇష్టపడకపోతే కచ్చితంగా పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిందే. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీకి భూమన కరుణాకరరెడ్డి వదిన కుసుమ కుమారి వీసీగా పని చేశారు. అప్పట్లో ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పదవికి రాజీనామా చేయాలని కోరినా, కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. రోశయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరోపణల మీద విచారణ చేయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈమెను వీసీ పదవి నుంచి తొలగించారు. ముందుగా యూనివర్సిటీల ప్రక్షాళన మొదలుపెట్టి, ఆ తర్వాత ఆప్షే వరకు వెళ్లడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే హేమచంద్రారెడ్డి ఆప్షే చైర్మన్ పదవికి రాజీనామా చేసి జేఎన్‌టీయూ అనంతపురంలో తన పాత స్థానంలో ప్రొఫెసర్‌గా వెళ్లిపోడానికి ప్రయత్నిస్తున్నా ఆయన్ను గాలిలో ఉంచింది.
Comentarios