ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్.. తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శతక్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులకే ఔట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మూడంకెల మార్కు అందుకున్నాడు. యశస్వి జైశ్వాల్ జోరుతో భారీ ఆధిక్యం దిశగా భారత్ దూసుకెళ్తోంది.
ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్‌ను 319 పరుగులకు కట్టడి చేసింది. దీంతో భారత్‌కు 126 పరుగుల లీడ్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ దశలో యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌లు జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
తొలుత నిదానంగా బ్యాటింగ్ చేసిన యశస్వి.. తర్వాత టాప్ గేర్‌లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి 50 బంతుల్లో కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత గేరు మార్చు.. తనలోని టీ20 బ్యాటర్‌ను బయటకు తీశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ లీడ్ వేగంగా పెరిగింది. ఈ క్రమంలోనే సిక్స్ కొట్టి యశస్వి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Comments