(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మంగువారితోట రామమందిరం వీధిలో నివసిస్తున్న యువకుడు శంకర్ (23) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కుటుంబ తగాదాలేనని కారణమని సమాచారం. ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న మహిళతో శంకర్‌కు సన్నిహిత సంబంధం ఏర్పడిరది. దీంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Comments