
(సత్యంన్యూస్, శ్రీకాకుళం అర్బన్)
స్థానిక దమ్మలవీధి ప్రాంతానికి చెందిన పుక్కళ్ల రాము (27) అనే యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన తోట ప్రసాద్ (26) బటన్ చాక్‌తో మెడ మీద పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు రాము రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాము, ప్రసాద్‌ల మధ్య కొద్ది రోజుల క్రితం కుందువానిపేట సముద్రం ఒడ్డున గొడవ జరిగింది. దాన్ని మనసులో ఉంచుకొని ఈ నెల 13న రాము ప్రసాద్‌ను రాయితో కొట్టడంతో గాయమైంది. ఇలా ఇరువురూ వీధిలో గొడవలు పడటం వల్ల చెడ్డపేరు వస్తుందని వీధి పెద్దలు బుధవారం ఒక సమావేశం పెట్టి ఇద్దర్నీ మందలించే పనికి పూనుకున్నారు. ఈలోగా తోట ప్రసాద్ తనతో తెచ్చుకున్న బటన్‌చాక్‌తో రాము మెడపై పొడవటంతో గాయాలయ్యాయి.
Comments