
యాషికా ఆనంద్.. ఈ పేరు వింటేనే హాట్‌గాళ్ విత్ టాలెంటెడ్ హీరోయిన్ అన్నది గుర్తుస్తోంది. ఈమె ప్రధానంగా తమిళ సినిమాలు, టెలివిజన్ షోలలో పనిచేస్తుంది. అంతే కాకుండా కోలీవుడ్ పరిశ్రమలో ప్రజాదరణ పొందింది. ఆనంద్ తన చిత్రాలలో తన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు పొందే విధంగా పాత్రలను ఎంచుకుంటుంది. దీంతోపాటు చాలా చిత్రాల్లో ఆమె ఒక ఫ్యాషన్ ఫిగర్‌గా తనను తాను మలుచుకుంది. ఆమె నటించిన చిత్రాల్లో ఒకటి యానిమేటెడ్ చిత్రం జోంబీ. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. 2018లో, చెన్నై టైమ్స్ ఆమెను ‘‘టెలివిజన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన మహిళ’’గా గుర్తించింది. 2021లో ఆనంద్ తన నటనా ప్రతిభకు అవార్డును గెలుచుకుంది. బెస్టీ చిత్రంలో ఆమె పాత్రకు గానూ లాస్‌వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
Comentários