top of page

రక్తపు వీధుల్లో ఓజీ!!

  • Guest Writer
  • Sep 2
  • 3 min read

ree

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘‘ఓజీ’’పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ స్టార్డమ్‌తోపాటు, సుజీత్‌ స్టైలిష్‌ మేకింగ్‌పై ఉన్న నమ్మకం ఈ సినిమాపై హైప్‌ని పెంచేశాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, సాంగ్స్‌ పవన్‌ అభిమానుల్లో ఊహించని ఎక్సైట్మెంట్‌ తెచ్చాయి. తాజాగా మరోసారి బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఫ్యాన్స్‌ హృదయాలను తాకింది. ఈ కొత్త అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత ఎత్తుకు వెళ్లాయి. ఈ తాజా పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ బ్లాక్‌ డాడ్జ్‌ కార్‌పై కూల్‌గా కూర్చున్న స్టైల్‌ అటిట్యూడ్‌తో దర్శనమిచ్చారు. రఫ్‌ బియర్డ్‌, డార్క్‌ షర్ట్‌, స్టైలిష్‌ లుక్స్‌లో ఆయన మాస్‌ ప్రెజెన్స్‌ హైలైట్‌గా నిలిచింది. వెనుక ముంబై బిల్డింగ్స్‌ బ్యాక్‌డ్రాప్‌ పోస్టర్‌కు మరో లెవెల్‌ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. వీధుల్లో రక్తం చిందుతున్న సీన్‌ వెనక డైలాగ్‌ లైన్‌ ‘‘వీధుల్లో రక్తం అగ్ని పండుగగా మారుతుంది’’ అనేది ఫుల్‌ ఫైర్‌నే సూచిస్తోంది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన విలన్‌గా కనిపించనున్నారు.

అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. పవన్‌ పవర్‌ను కొత్త యాంగిల్‌లో చూపించేలా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. థమన్‌ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్‌ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫైర్‌స్టార్మ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో అభిమానుల్లో గూస్‌ బంప్స్‌ తెచ్చింది. ఇక రెండో సాంగ్‌ ‘‘సువ్వి సువ్వి’’ మెలోడీగా హృదయాలను కదిలించింది. థమన్‌ సౌండ్‌ట్రాక్‌తో సినిమా థియేటర్స్‌లో ఫుల్‌ ఫెస్టివల్‌ వాతావరణం సెట్‌ అవుతుందని ట్రేడ్‌ అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ‘‘ఓజీ’’కు పోటీగా నిలిచే పెద్ద సినిమాలు లేవు. దీంతో ఈ మూవీకి ఫుల్‌ ఫేవరబుల్‌ అట్మాస్ఫియర్‌ దొరికింది. ఇప్పటికే ఓవర్సీస్‌ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ స్టార్ట్‌ కావడంతో, ఓపెనింగ్స్‌ దగ్గరే ఆల్‌ టైం రికార్డ్స్‌ బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

తెలుగు సినిమా.. ప్రమోషనల్‌ మిస్టేక్స్‌
ree

ఒకసారి క్లిక్‌ అయిందంటే అది ప్రతిసారీ క్లిక్‌ అవుతుందని కాదు. కొందరికి కొన్నిసార్లు అలా కలిసొస్తుంది. లేదా వాళ్లు కరెక్ట్‌ గా జడ్జ్‌ చేయగలిగారు అని అర్థం. కొన్నాళ్ల క్రితం కోర్ట్‌ మూవీకి సంబంధించి ఆ చిత్ర నిర్మాత అయిన నాని.. ఈ కోర్ట్‌ మీకు నచ్చకపోతే తన హిట్‌ 3 మూవీకి రావాల్సిన అవసరం లేదు అని వేదికపైనే చెప్పాడు. చాలామంది ఆశ్చర్యపోయారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అన్నారు. ఒకవేళ పోతే అనే ప్రశ్నలు వేశారు. బట్‌ నాని నమ్మకం నిజం అయింది. కోర్ట్‌ హిట్‌ అయింది. హిట్‌ 3 కూడా సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత నాని రూట్‌ లో చాలామంది వేదికలపై స్టేట్మెంట్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సినిమాలు మాగ్జిమం పోతున్నాయి.

ఆ మధ్య సోహైల్‌ అనే చిన్న ఆర్టిస్ట్‌ తనకు బిగ్‌ బాస్‌ తో వచ్చిన పాపులారిటీని నిజమే అని భ్రమించి హీరోగా నటిస్తూ సినిమా నిర్మించాడు. కట్‌ చేస్తే ఆ సినిమా డిజాస్టర్‌. దీంతో ప్రెస్‌ మీట్స్‌ లో అతను చూపిన అత్యుత్సాహంతో పాటు సినిమా పోయింది కాబట్టి ఆడియన్స్‌ ను నిందిస్తూ చేసిన కామెంట్స్‌ అన్నీ ఆ తర్వాత ట్రోల్‌ మెటీరియల్‌ గా మారిపోయాయి.

రీసెంట్‌ గా పరదా అనే మూవీ విషయంలో ఇదే జరిగింది. దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ పోటీ పడి మరీ ఒక స్టేట్మెంట్‌ ఇచ్చారు. తమ సినిమా రిలీజ్‌ కు ముందే ప్రీమియర్స్‌ వేస్తున్నామని.. ఆ రివ్యూస్‌ చూసే మీరు సినిమాకు రండి అని సవాల్‌ విసిరారు. కట్‌ చేస్తే రివ్యూస్‌ అన్నీ బిలో యావరేజ్‌ మూవీ అని తేల్చాయి. దీంతో సినిమా భారీగా లాస్‌ అయింది. వాళ్లు అలా ఛాలెంజ్‌ చేయకపోతే కనీసం ఆడియన్స్‌ ఫ్రీ మైండ్‌ సెట్‌ తో అయినా థియేటర్స్‌ కు వచ్చేవాళ్లు. అప్పుడు వాళ్ల సొంత ఒపీనియన్‌ నే చెప్పేవాళ్లు. చాలాసార్లు రివ్యూస్‌ మైండ్‌ సెట్‌ ను ప్రభావితం చేస్తాయి అనేందుకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

తాజాగా త్రిబాణధారి బార్బరిక్‌ అనే సినిమా దర్శకుడు సైతం అదే మిస్టేక్‌ చేశాడు. తన సినిమా బాలేదు అంటే చెప్పుతో కొట్టుకుంటా అని వీరావేశంగా ప్రకటించాడు. ఇతని పేరు మోహన్‌ శ్రీవత్స. సత్యరాజ్‌, సత్యం రాజేష్‌, వశిష్ట ఎన్‌ సింహా, ఉదయభాను, సాంచి రాయ్‌, విటీవి గణేష్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. కథ పరంగా బానే అనిపించినా.. కథనంతో విపరీతంగా కన్ఫ్యూజ్‌ చేశాడు దర్శకుడు. అదే పనిగా నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ ప్లే అంటూ అనేక లేయర్స్‌ తో స్క్రీన్‌ ప్లే కనిపించడంతో చిరాకు పెట్టించాడు. పైగా ఊహించగలిగే కథనం కూడా. అందుకే ఆడియన్స్‌ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. దీనికి తోడు ఇవి నవరాత్రి రోజులు కదా. జనం థియేటర్స్‌ వైపే చూడటం లేదు. ఫలితంగా తను ఓ థియేటర్‌ కు వెళితే అక్కడ కనీసం పది మంది కూడా లేరని.. ఉన్నవాళ్లను సినిమా ఎలా ఉందీ అని అడిగితే బావుందున్నారనీ.. అయినా ఆడియన్స్‌ థియేటర్స్‌ కు ఎందుకు రావడం లేదు అని ఆవేశపడిపోతూ ఆవేదన చెందుతూ.. లైవ్‌ లో తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు.

సో.. మనం తీసినవన్నీ మనకు కళాఖండాలుగానే కనిపిస్తాయి. ప్రేక్షకుల వరకూ వస్తే కానీ అసలు నిజం తెలియదు. ఒక్కోసారి సీజన్‌ ప్రాబ్లమ్‌ వల్లో ఇంకేవైనా కారణాలతోనే మంచి కటెంట్స్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అవుతుంటాయి. అలాంటివి వదిలేస్తే.. సినిమాపై అతి ప్రేమతో చేసే కొన్ని కామెంట్స్‌ వల్ల తర్వాత ట్రోల్‌ మెటీరియల్‌ అవడం తప్ప మరే లాభం ఉండదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page