బజారుబ్రాంచి మేనేజర్ శ్రీకర్ సస్పెండ్
పాత డేట్ వేసి కొత్త ఉత్తర్వులు జారీ
ఆర్‌ఎం చెబితేనే చేశానంటున్న బీఎం
ఎస్‌బీఐ లైఫ్ కోసం భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజియన్‌కు కొన్నాళ్ల క్రితం వరకు మేనేజర్‌గా పని చేసిన టీఆర్‌ఎం రాజు ఖాతాలో మరో ఉద్యోగి బలైపోయాడు. నరసన్నపేట బజారుబ్రాంచిలో నకిలీ రుణాలు కుంభకోణాన్ని ‘సత్యం’ వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత విచారణ చేపట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు అందుకు బాధ్యుడిగా బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌ను గుర్తించి సస్పెండ్ చేశారు. విచిత్రమేమిటంటే.. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా, వెంటనే విచారణ చేపట్టి, అక్కడికి నెల రోజుల వ్యవధిలోపే నివేదికను సమర్పించిన ఇన్నాళ్లకు బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌ను సస్పెండ్ చేస్తూ పాత డేటుతో ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి విచారణ ముగిసిన తర్వాత నుంచి శ్రీకర్‌ను బ్యాంకు బయటే ఉంచారు. సస్పెన్షనో, టెర్మినేషనో చెప్పకుండా గాలిలో పెట్టారు. ఇందుకు కారణం మొత్తం అన్నీ తాను చూసుకుంటానని టీఆర్‌ఎం రాజు చెప్పడంతో శ్రీకర్ మీద చర్యలకు వెనకడుగు వేశారు. గార బ్రాంచిలో ఎటువంటి ప్రీ ప్లాన్డ్ నేరానికి పాల్పడ్డారో ఇక్కడ కూడా అలాంటి ముందస్తు ప్రణాళిక మేరకే బ్యాంకు డిపాజిట్లను పక్కదారి పట్టించారు. అయితే గార బ్రాంచిలో ఒంటరి మహిళ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోగా, నరసన్నపేట బజారుబ్రాంచిలో మాత్రం శ్రీకర్ ఈ వ్యవహారాన్ని మలుపుతిప్పే విధంగా వ్యవహరిస్తున్నట్టు భోగట్టా. బ్యాక్‌డేట్ వేసి ఇచ్చిన సస్పెన్షన్ లెటర్‌ను తీసుకోడానికి ససేమిరా అనడంతో పాటు తనకు ఈ ఆర్డర్ ఇచ్చిన తేదీని రాస్తూ ఉత్తర్వులు అందుకున్నారని తెలిసింది. నరసన్నపేట బజారుబ్రాంచిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే చేపట్టిన విచారణ మేరకు తనను సస్పెండ్ చేసి స్టేట్‌మెంట్ రికార్డు చేసివుంటే, ఈపాటికి అన్ని విషయాలు వెలుగులోకి వచ్చుండేవని, అలా కాకుండా టీఆర్‌ఎం రాజును రక్షించడం కోసం బ్యాంకు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని ఇంతవరకు లాగారని శ్రీకర్ వాపోతున్నట్టు భోగట్టా. బ్యాంకులో నకిలీ అకౌంట్లకు సొమ్ములు ట్రాన్స్‌ఫర్ అయిందని తేలిన వెంటనే అప్పటి ఆర్‌ఎం రాజుకు తెలిసే అన్ని రుణాలు మంజూరయ్యాయని, ఇందులో తన ప్రమేయమేమీ లేదని శ్రీకర్ బ్యాంకు అధికారులకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలను టెక్నికల్‌గా పరిశీలిస్తే వాస్తవం కూడా. నరసన్నపేట బజారుబ్రాంచ్ కేటగిరీ`3లో ఉంది. ఆ స్థాయి మేరకే ఇక్కడ డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేస్తారు. కానీ ఈ బ్రాంచిలో కేటగిరీ`4 కంటే పైస్థాయిలో రుణాలు మంజూరు చేశారు. అందుకు కారణం.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టించడమే. ఒక ఉద్యోగికి ఏమేరకు రుణం ఇవ్వాలన్నదానిపై ఆయన జీతం ఆధారంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. రూ.50 లక్షలు లోను ఇవ్వాల్సిన చోట రూ.80 లక్షలు ఇప్పించి, అందులో రూ.లక్ష ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కట్టించడానికి ఇష్టారాజ్యంగా రుణాలిచ్చేశారు. నకిలీ సిబిల్ స్కోర్‌ను థర్డ్‌పార్టీ ద్వారా చేయించి, పెద్దమొత్తంలో రుణానికి అర్హుడేనని చూపించి ఎస్‌బీఐ లైఫ్‌ను చేయించేశారు. నెలకు రూ.40వేలు జీతమొచ్చే ఒక ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష రూపాయలు ఎస్‌బీఐ లైఫ్ కట్టడానికి ఇన్సూరెన్స్ నిబంధనలు అంగీకరించవు. కానీ కమీషన్ల కోసం కక్కుర్తిపడి పెద్దమొత్తంలో వైట్ అమౌంట్ వస్తుందని ఇష్టారాజ్యంగా లోన్లు మంజూరుచేసి దొరికిపోయారు. వాస్తవానికి శ్రీకర్ బ్రాంచి నుంచి మంజూరైన ప్రతీ లోనుకు అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు అప్రూవల్ ఉంటుంది. తన టేబుల్‌పై ఉన్న ధ్రువపత్రాలను పరిశీలించిన ఆర్‌ఎం లోను రాకుండా ఆపడం, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో కడతామన్న తర్వాత అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వల్లే ఎలిజిబిలిటీ కంటే పెద్ద మొత్తంలో రుణాలు మంజూరైపోయాయి. ఇవన్నీ టీఆర్‌ఎం రాజు కనుసన్నల్లోనే జరిగాయనడానికి ఆధారాలు కోకొల్లలు. కానీ ఎస్‌బీఐ లోనే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఒకరు రాజును ప్రతీసారి కాపాడుకుంటూ వస్తూ కిందిస్థాయి ఉద్యోగులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీకర్ విషయంలోనూ అదే జరిగింది.
విచారణ అధికారి ఆకస్మిక బదిలీ
గార ఎస్‌బీఐలో తాకట్టు బంగారం మాయమైన కేసులో పోలీసు విచారణ ప్రారంభమైందని తెలియగానే, అప్పటి ఆర్‌ఎం హోదాలో టీఆర్‌ఎం రాజు మొత్తం గార సిబ్బందిని ఎకాఎకిన బదిలీ చేశారు. టెంపరరీ ఉద్యోగాలు చేస్తున్న మెసెంజర్లను సైతం గార నుంచి పంపించేశారు. పోలీసులు విచారణకు వస్తే ఆ సమయంలో తాము లేమని చెప్పడం ద్వారా కేసును కొన్నాళ్లు నాన్చి పోలీసులే క్లోజ్ చేసేస్తారన్నది ఒక పథకం. ఇప్పుడు నరసన్నపేట బజారు బ్రాంచి విషయంలో కూడా టీఆర్‌ఎం రాజు కాస్త అటూ ఇటుగా అదే చేశారు. బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత ఆమదాలవలస చీఫ్ మేనేజర్ బీఏఎన్ మూర్తిని విచారణ అధికారిగా నియమించారు. ఆయన బజారు బ్రాంచిలో ప్రవేశించి తవ్వేకొద్దీ కుంభకోణాలు వెలుగులోకి వస్తుండటంతో తమ గుట్టు రట్టయిపోతుందని భావించి ఆయనకు సహాయనిరాకరణ చేసి ఏదో ఎంక్వైరీ పూర్తయిందనిపించారు. వాస్తవానికి మూర్తి లేవనెత్తిన అనేక ప్రశ్నలకు బ్రాంచిలో సమాధానాలు లేవని భోగట్టా. అయితే బజారుబ్రాంచిలో ఏం జరుగుతుందో ముందే పత్రికలకు తెలిసిపోతుందని, అందుకు మూర్తే కారణమని ఒక నింద వేసి ఆయన్ను ఆగమేఘాల మీద విశాఖపట్నం బదిలీ చేశారు. బజారుబ్రాంచిలో జరిగిన అవకతవకల మీద మూర్తి ఇచ్చిన నివేదిక మేరకే శ్రీకర్‌ను ఇన్నాళ్లూ గాలిలో పెట్టారు. అదే సమయంలో గార బ్రాంచిలో జరిగిన కుంభకోణాన్ని కూడా కొత్త ప్రభుత్వం మళ్లీ పునర్విచారణకు ఆదేశించడంతో సీన్‌లోకి టీఆర్‌ఎం రాజు, ఆడిటర్లు, కొందరు బ్యాంకు ఉద్యోగులు వచ్చారు. బ్యాంకు టెక్నికాలిటీస్, బిజినెస్ ప్రోటోకాల్, ఆడిట్ వంటి వ్యవహారాల మీద పోలీసులకు అవగాహన ఉండదని, వారు ఏమడిగినా డొంకతిరుగుడు సమాధానం చెప్పి తికమకపెట్టి బయట పడదామన్న ఆలోచనలో టీఆర్‌ఎం రాజు అండ్ కో ఉంది. గార బ్రాంచి వ్యవహరం ముగిసిపోతే నరసన్నపేటది కూడా ఓ పద్ధతిగా మూసేసి తన హయాంలో అంతా సవ్యంగానే ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం ‘లైఫ్ తీసేశావ్ కదా బాసూ..!’ అన్ని శీర్షికన ‘సత్యం’ ఒక కథనం ప్రచురించడంతో ఇంకా ఈ సబ్జెక్ట్ లైవ్‌లోనే ఉందని టీఆర్‌ఎం రాజును రక్షించడానికి పోతే తమ ఉద్యోగాలు పోతాయని భావించిన ఉన్నతాధికారులు పాత డేట్‌తో కొత్త సస్పెన్షన్‌ను అందించారు.
ఎవడ్ని వదలకండి
TRM Raju కి తప్పుడు సలహాలు ఇచ్చిన వారికి కూడా శిక్ష పడాలి.
TRM RAJU MOST CUNNING .
వీడు LHO లో పనిచేసినప్పుడు వీడే చైర్మన్ లా ఓవర్ చేసేవాడు.
భగవంతుడు ఉన్నాడు. ఒరేయి
నీవు చేసిన పాపాలు అన్నీ వస్తాయి.
ప్రెస్ వాళ్ళు అయ్యా,
వీడికి సహకరించిన వారికి కూడా వదలకండి.
TRM RAJU MOST CUNNING .
వీడు LHO లో పనిచేసినప్పుడు వీడే చైర్మన్ లా ఓవర్ చేసేవాడు.
భగవంతుడు ఉన్నాడు. ఒరేయి
నీవు చేసిన పాపాలు అన్నీ వస్తాయి.
ప్రెస్ వాళ్ళు అయ్యా,
వీడికి సహకరించిన వారికి కూడా వదలకండి.
[11/5, 8:19 PM] D Sandeep New: TRM RAJU MOST CUNNING .
వీడు LHO లో పనిచేసినప్పుడు వీడే చైర్మన్ లా ఓవర్ చేసేవాడు.
భగవంతుడు ఉన్నాడు. ఒరేయి
నీవు చేసిన పాపాలు అన్నీ వస్తాయి.
ప్రెస్ వాళ్ళు అయ్యా,
వీడికి సహకరించిన వారికి కూడా వదలకండి.
[