
(సత్యంన్యూస్, టెక్కలి)
కోటబొమ్మాళి మండలం పాకిలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయరాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు కొత్తపేట నుంచి ద్విచక్ర వాహనంలో టెక్కలి మండలం సన్యాసిపేటలోని ప్రభుత్వ ఎలిమెంట్రీ పాఠశాలకు వెలుతున్న క్రమంలో పాకివలస వద్ద ఈ ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెలుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీకొట్టింది. ఆ క్రమంలో టెక్కలి వైపు ద్విచక్ర వాహనంపై వెలుతున్న త్రివేణిపై కారు పడడంతో కింద పడి రోడ్డుకు తల బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. త్రివేణి స్వగ్రామం ఆమదాలవలస మండలం తిమ్మాపురం. భర్త ఇండస్ బ్యాంకులో పని చేస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం చిత్తూరు నుంచి జిల్లాకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని వచ్చారు. ప్రతి రోజు తిమ్మాపురం నుంచి క్యాబ్‌లో కొత్తపేట వరకు వచ్చి అక్కడ ఉంచిన ద్విచక్ర వాహనంలో సన్యాసిపేటకు రాకపోకలు చేస్తున్నారు. ఆమె మృతి సమాచారం తెలుసుకున్న పలువురు టెక్కలికి చెందిన ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణి మృతిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
Comments