top of page

రొమాంటిక్‌ కథలే ఇష్టం.. కానీ రావడం లేదు!

  • Guest Writer
  • Oct 11
  • 2 min read
ree

తనకు రొమాంటిక్‌ కథలు ఇష్టమైతే ఆఫర్లు మాత్రం అలాంటివి రావట్లేదని అంటుంది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. కె.జి.ఎఫ్‌ 1 అండ్‌ 2 సినిమాలతో సూపర్‌ సక్సెస్‌ అందుకుని పాన్‌ ఇండియా హిట్‌ కొట్టినా కూడా అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు. అదేంటి అంటే తనకు నచ్చిన సినిమాలు వస్తే తప్ప తాను ఓకే చేయనని అంటుంది. కె.జి.ఎఫ్‌ తర్వాత చియాన్‌ విక్రం తో కోబ్రా చేసింది. అది ఎలా వచ్చిందో అలా వెళ్లింది. ఐతే ఆ తర్వాత హిట్‌ 3 సినిమా చేసింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి స్ట్రైట్‌ సినిమా. ఆ సినిమా థ్రిల్లర్‌ కన్నా వైలెన్స్‌ తో విధ్వంసం సృష్టించింది.

సినిమా ప్రమోషన్స్‌ లో శ్రీనిధి బిజీ.. ఇక లేటెస్ట్‌ గా అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమా చేసింది. అక్టోబర్‌ 17న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ లో శ్రీనిధి బిజీ బిజీగా ఉంది. ముఖ్యంగా తనకు తెలుసు కదా లాంటి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌ ఇష్టం. కానీ తనకు మాత్రం కె.జి.ఎఫ్‌, హిట్‌ 3 లాంటి కథలు వస్తున్నాయి. పర్సనల్‌ గా రొమాంటిక్‌ ఎంటర్టైనర్స్‌ ఇష్టమని ఐతే తెలుసు కదా చూస్తే ఇదేదో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అనుకుంటారు కానీ సినిమాలో కొత్త పాయింట్‌ ఉంటుందని అది ఆడియన్స్‌ ని సర్‌ ప్రైజ్‌ చేస్తుందని అంటుంది శ్రీనిధి శెట్టి.

తన క్యూట్‌ లుక్స్‌ తో ఆడియన్స్‌ ని ఫిదా అయ్యేలా చేస్తున్న శ్రీనిధి సినిమాల విషయంలో కచ్చితమైన నిర్ణయాలతో ఉంటుందట. కథ నచ్చితేనే తప్ప రెమ్యునరేషన్‌ కోసమో లేదా మొహమాట పడో అసలు సినిమా చేయనని ఇదివరకే చెప్పింది శ్రీనిధి శెట్టి. తెలుగులో నానితో హిట్‌ 3 తో సక్సెస్‌ అందుకున్న అమ్మడికి తెలుసు కదా సినిమా కూడా ఒక మంచి బ్రేక్‌ ఇస్తుందని భావిస్తుంది. శ్రీనిధి లుక్స్‌ మాత్రం.. తెలుసు కదా సినిమాలో సిద్ధు, శ్రీనిధి శెట్టి తో పాటు రాశి ఖన్నా కూడా నటించింది. సినిమాలో ఎవరి పాత్ర ఎలా టర్న్‌ తీసుకుంటుంది. ఈ ముగ్గురి ప్రేమ కథ ఎలా ముగుస్తుంది అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఐతే శ్రీనిధి లుక్స్‌ మాత్రం తెలుసు కదా సినిమాలో ఇంప్రెస్‌ చేస్తున్నాయి. సినిమాతో అమ్మడు మరో సక్సెస్‌ అందుకుంటే మాత్రం తెలుగులో మిగతా హీరోయిన్స్‌ కి ఫైట్‌ తప్పదని చెప్పొచ్చు. అసలే కన్నడ భామలకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఆ లిస్ట్‌ లో తన పేరు కూడా యాడ్‌ అయ్యేలా శ్రీనిధి ప్రయత్నాలు చేస్తుంది. శ్రీనిధి సినిమాలే కాదు ఆమె ఫోటో షూట్స్‌ కూడా ఆడియన్స్‌ ని ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతో పాటు అమ్మడు తమిళ పరిశ్రమ మీద కూడా ఫోకస్‌ చేసినట్టు తెలుస్తుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

అప్పుడు మౌళి.. ఇప్పుడు నిహారిక
ree

సోషల్‌ మీడియా సంచలనాలు మెల్లమెల్లగా వెండి తెరపైపు అడుగులు వేస్తూ, ఇక్కడ కూడా తమ ఉనికిని చాటుకొంటున్నాయి. మొన్నటికి మొన్న లిటిల్‌ హార్ట్స్‌ సినిమాతో మౌళి చెలరేగిపోయాడు. ఇప్పుడు తన చేతి నిండా సినిమాలే. యూత్‌ కథలతో, చిన్న నిర్మాతలు ఇప్పుడు మౌళి వెంట పడుతున్నారు. ఇప్పుడు నిహారిక వంతు వచ్చింది. మౌళిలా..నిహారిక కూడా ఓ స్టారే. కాలేజీ చదివే రోజుల్లోనే యూ ట్యూబ్‌ ఛానల్‌ పెట్టి పాపులారిటీ సంపాదించుకొంది. పెద్ద పెద్ద హీరోలు సైతం నిహారికతో తమ సినిమాల్ని ప్రమోట్‌ చేసుకొనే వారు. ‘మేజర్‌’ సినిమా కోసం మహేష్‌ బాబుతో కలిసి చేసిన ఓ ప్రోమో స్కిట్‌ భలే పాపులర్‌ అయ్యింది. అప్పటి నుంచీ నిహారిక మరింత ఫేమస్‌ అయిపోయింది. ఇప్పుడు తొలిసారి ఓ సినిమాలో నటించింది. అదే.. ‘మిత్రమండలి’. ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నటిగా తనకు ఇదే తొలి సినిమా కాదు. ఇది వరకు ఓ తమిళ సినిమా చేసింది. అందులో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు నాట మాత్రం నటిగా ఇదే తొలి ప్రయత్నం.

నిహారిక లాంటి అమ్మాయిలు సక్సెస్‌ కావాల్సిన అవసరం చాలా వుంది. ఓ హిట్టు పడితే తన మైలేజీ పెరగడం మాత్రమే కాదు, తనని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా చిత్రసీమవైపు అడుగులు వేస్తారు. తెలుగమ్మాయిలు సినిమాల్లో కనిపించడం లేదన్న బెంగ కూడా తీరిపోతుంది. ’’కెమెరా నాకేం కొత్తగా అనిపించలేదు. కాకపోతే యూట్యూబ్‌లో యాక్షన్‌, కట్‌.. నేనే చెప్పుకొనేదాన్ని. నా స్క్రిప్టు నేనే రాసుకొనేదాన్ని. సినిమాల్లో అలా కాదు. ఆ పనులు చేయడానికి వేరే వాళ్లు ఉంటారు. దాంతో నా శ్రమ తగ్గింది’’ అని చెప్పుకొచ్చింది నిహారిక. టిపికల్‌ కథానాయిక పాత్రలకు నిహారిక సెట్‌ కాకపోవొచ్చు కానీ, వెరైటీ కథలకు తాను మంచి ఆప్షన్‌ అనిపిస్తుంది. తెలుగులో తనకు ఎలాంటి అవకాశాలు వస్తాయన్న విషయం ‘మిత్రమండలి’తో తెలిసిపోతుంది.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page