(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక ఆనందమయి కల్యాణ మండపం మేనే జర్ ధనుంజయ మీద మంగళవారం సాయం త్రం దాడి చేసిన రాయితి శ్రీనుపై చర్యలు తీసు కోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు ఈ సంఘ రాష్ట్ర కార్యదర్శి మెట్ట నాగ రాజు నేతృత్వంలో హోటల్స్ అసోసియేషన్ ప్రతిని ధులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం ఆనందమయి కల్యాణ మండపంలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ రూమ్‌లో తాగి అసభ్యంగా ప్రవర్తించిన రాయితి శ్రీనును ఇటువంటి పనులు ఇక్కడ చేయ కూడదని నిలువరించినందుకు మేనేజర్ ధనుం జయ మీద చెయ్యి చేసుకున్నాడని, ఈమేరకు స్థానిక వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని, దీనిమీద పోలీసులు దర్యాప్తు వేగవంతంగా జరిపేటట్లు సూచించాలని వారు శంకర్‌ను కోరారు. ఆతిధ్య రంగానికి చెందిన హోటళ్లు, రెస్టారెంట్లు, కల్యాణ మండ పాలు, స్వీట్స్ Ê బేకరీల్లో ఇటువంటి రౌడీయిజం జరిగితే టూరిజం వ్యవస్థే కుంటుపడిపోతుందని, ధనుంజయపై దాడే మొదటిది కాదని, నగరంలో అనేక హోటళ్లపై రౌడీషీటర్లు, తాగుబోతులు దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాగరాజు వివరించారు. మూడు రోజుల క్రితం ఎస్‌వీడీ హోటల్‌లో మద్యం సేవించిన ఒక వ్యక్తి అక్కడి సిబ్బందిని దుర్భాషలాడి ఫర్నిచర్‌ను విర గ్గొట్టారని, దీనిపై కూడా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉందన్నారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో ఆనందమయి కల్యాణ మండపం యజమాని నక్క రామరాజు, వి`1 హోటల్ గోపి, గజపతి హోటల్ సుదర్శన్, గ్రాండ్‌హోటల్ సతీష్, జేఎంఆర్ హోటల్ రాజా, టైమ్ స్క్వేర్ హోటల్ మాధవి, అంధవరపు తిరుమల, టంకాల కృష్ణతో పాటు నగరంలో అన్ని హోటళ్ల యాజమాన్యాలు ఉన్నాయి.
Comentarios