
తమ పౌరులను అవమానకరంగా వెనక్కి తరలిస్తే ఒప్పుకునేది లేదని కొలంబియా, మెక్సికోలు అమెరికా సైనిక విమానాలను దిగనివ్వలేదు. ఆ మాత్రం ఆత్మాభిమానం కూడా మన దేశభక్తులకు లేకపోయింది. పక్క దేశాల మీద, బక్క ప్రాణుల మీద వీరంగం వేసే వీర జాతీయులు, అమెరికా ముందు మాత్రం మచ్చికైపోయి మోకరిల్లుతారు! అమెరికన్ మిలటరీ విమానంలో అమృతసర్‌లో ఇవాళ డంప్ అయిన భారతీయులకు పూర్తి సంఫీుభావం! అక్రమ వలసదారులని ప్రపంచంలో ఎవరినైనా అనగలిగే కనీస అర్హత లేని ట్రంపిస్టు అమెరికాకు పూర్తి తిరస్కారం! దేశభక్తి, మాతృప్రేమ విస్మరించి మనోళ్లు అక్కడి ఆర్థిక వ్యవస్థను ఎంతగా అభివృద్ధి చేశారు? మొదట అక్కడి క్రైస్తవానికి తలొగ్గినట్టే ఒగ్గి క్రమంగా ఎన్ని గుళ్లూ గోపురాలు కట్టి ఇక్కడి కులమతాల్ని అక్కడ ఎంతగా వృద్ధి చేశారు? అక్కడి జిడిపిని పెంచి ఇక్కడి రియల్ ఎస్టేట్‌ని ఎంతగా ఆకాశ మార్గం పట్టించారు? ట్రంప్‌ను మన ప్రధాని కౌగిలించుకొని ఇచ్చిన ఫోజులన్నీ వట్టివేనా? అక్కడికి ప్రధాని వెళ్లినప్పుడు దిగ్విజయ స్వాగతం పలికిన భారతీయత మీద అతనికుండే వివక్ష మీద ఎందుకని ఎవ్వరూ మాట్లాడరు? గెంటేయించుకోవడంలో వుండే యాతనని భరించలేక ఇప్పుడు మనోళ్లు ఉత్తరం దిక్కువైపు సమూహంగా నించుని ఉచ్చపోసి యుద్ధం లాంటివేవైనా చేస్తే సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? (రాబోయే తండేల్ సినిమా లో డైలాగ్) అమెరికాకి దశాబ్దాలుగా తలొగ్గిన మన విదేశాంగ విధానం మీదైనా వాడు కనీస జాలి చూపడం లేదే? అమెరికా ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్న భారతీయ సంతతి అని వాణిజ్య ప్రకటనల కోసం ఆత్రుతగా ఉబ్బరిచ్చే అక్షరాల సిందేసే మీడియా ఇప్పుడు గ్లిజరిన్ కన్నీళ్లయినా అరువు తెచ్చు కుంటుందా? తానా, ఆటాల విందారగించిన సాహిత్యకారులైనా ఇప్పుడు ట్రంప్‌తో ఏదైనా సయోధ్య కుదుర్చుతారా? ఇకనుంచి మనం అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి అనకుండా, భారతీయుల పట్ల అమెరికా వివక్ష నశించాలని కొత్త నినాదం చేయాలి. ఏదేమైనా ఇక్కడి శతాబ్దాల వంచనాత్మక బహిష్కరణ విష సంస్కృతితో పాటు, బలిసిన నాగరికతకు, బలహీన సంస్కృతికీ మధ్య తేడాను తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చిపడిరది. మోడీ వచ్చాక ఈ దేశపు వీసాల కోసం ప్రపంచమంతా క్యూ కడుతుందనుకుంటే, దీనికి విరుద్దంగా ఈ దేశం నుంచి ఎన్నడూ లేనంత వలసలు అమెరికాకి పెరిగాయి, అందుకే, మోడీ, తన స్నేహితుడు అధికారంలోకి రాగానే వాళ్లందరినీ తన్ని మరీ తరిమే యించాడు. విదేశీయులు వీసాల కోసం క్యూ కట్టడం తర్వాత, ముందు మనవాళ్లను పారిపోకుండా కాపాడుకుందాం! డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్ నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ-17 బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయ టకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. వెనక్కి పంపేముందు ప్రతిఒక్కరి రికార్డు లను పరిశీలించినట్లు ఢల్లీిలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడిరచారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్‌వో) నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు. అక్రమవలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమం లోనే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5వేల మంది అక్రమ వలసదారు లను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమా నాల్లో గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు తరలించింది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది.
Commentaires