top of page

రాష్ట్రాల హక్కులకు పాతర

Writer: DV RAMANADV RAMANA

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాకు మోదీ కోత పెట్టాలని భావిస్తున్నారా? దీని ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? దశలవారీగా దీన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తున్నది. రాష్ట్రాల పన్ను వాటాను తగ్గించేం దుకు ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ‘రాయిటర్స్‌’ ఒక సంచలన కథనాన్ని ప్రచు రించింది. కేంద్ర వ్యూహాత్మక చర్యలపై అనేక అంశాల్ని ఇందులో ప్రస్తావించింది. ఇప్పటివరకు కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రాలకు వచ్చే వాటా నలభై ఒక్కశాతం ఉండగా ఇందులో ఒకశాతం తగ్గించి నలభైకి పరిమితం చేయాలనే ఆలోచనతో కేంద్రం ముందుకు సాగుతున్నది! ఇలా చేయడం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.35వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఆర్థికవేత్త అరవింద్‌ పనగరియా నేతృత్వం లోని ఆర్థిక సంఘానికి ఈ విషయమై మోదీ సర్కార్‌ ఇప్పటికే ప్రతిపాదించినట్టు సమాచారం. అంత కన్నా ముందు మార్చి నెలాఖరున జరిగే కేంద్ర కేబినెట్‌ భేటీలో పన్ను వాటాల్లో కోతకు మోదీ ఆమో దం తెలిపి ఆ తర్వాత పరిశీలన నిమిత్తం ఆర్థిక సంఘానికి పంపే అవకాశముంది. ఈ నిర్ణయానికి ఫైనాన్స్‌ కమిషన్‌ పచ్చజెండా ఊపితే ఇక 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. దేశంలో అధికారాన్ని చేపట్టిన వారెవరైనా పార్టీలు, రాజకీయాలకతీతంగా నడుచుకోవాలి. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల్ని త్వరితగతిన విడుదల చేయాలి. ఏదైనా విపత్తులాంటిది వస్తే అవసరాన్ని బట్టి ‘ప్రత్యేక’ంగా ఆదుకోవాలి కూడా. కానీ ఈ దశాబ్దకాలంగా జరుగుతున్న పరిణా మాల్ని చూస్తే మోదీ సర్కార్‌ అలాంటి విధానాలకు ఎప్పుడో స్వస్తి పలికినట్టు తేటతెల్లమవుతున్నది. 80వ దశకంలో కేంద్ర పన్నుల్లో ఇరవై శాతం ఉన్న వాటా రానురానూ 41 శాతానికి పెరిగింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైతే పెంచాలి, తప్పదనుకుంటే అలాగే ఉంచాలి. కానీ అందులోనూ కోత విధించడానికి సిద్ధమవ్వడం సమంజసం అనిపించుకోదు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కేంద్రం ద్రవ్యలోటు 4.8 శాతం ఉండగా అదే సమయంలో రాష్ట్రాల ద్రవ్య లోటు దేశ జీడీపీలో 3.2 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వసూళ్లను బట్టి మాత్రమే కేంద్రం ఈ అంచనా వేసింది. భవిష్యత్తులో పన్ను వసూళ్లు భారీగా పెరిగితే, రాబడి కూడా మరింత పెరుగు తుంది. నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగానో ఉక్కిరిబిక్కిరి చేసిందో తెలిసిందే. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజల కొనుగోలుశక్తి పూర్తిగా పడిపోయింది. ఉపాధి రంగం ఇంకా కోలుకోనేలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిని అర్థం చేసుకుని ఆదుకోవాల్సిన కేంద్రం కాడి వదిలేసింది చూశాము. తర్వాత కాలంలో సెస్సులు, సర్‌చార్జీలను విధించిందని, ఇందులో ఏమాత్రం వాటా దక్క కుండా చేసి రాష్ట్రాలపై అధికభారం మోపిందని ప్రభుత్వాలు మొత్తుకున్నాయి. అయినా కేంద్రం ముం దుకే వెళ్లింది తప్ప వెనుకడుగు వేయలేదు. గతంలో మొత్తం పన్ను ఆదాయంలో సెస్సులు, సర్‌చార్జీల వాటా 9శాతం నుంచి 12శాతంగా ఉండేది. అది ఇప్పుడు 15 శాతానికి పెరిగింది. దీనికితోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం రాష్ట్రాలకు గుదిబండగా మారింది. వాస్తవానికి జీడీపీలో అరవై శాతం వాటా రాష్ట్రాలు అందిస్తున్నాయని, 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాలకు సొంతంగా పన్ను లు పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని రాయిటర్స్‌ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గిస్తే ఇంకేముంది? ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందుల్లో పడతాయి. సంక్షేమ పథకాలపై కూడా దీని ప్రభావం పడకతప్పదు. కేంద్రం గత ఐదేండ్లుగా ద్రవ్యలోటు గ్రాంట్లు రూ. 1.18లక్షల కోట్ల నుంచి రూ.13,700కోట్లకు తగ్గించింది. రాష్ట్రాల హక్కులకు పాతరేస్తున్నది. వాటా లు, గ్రాంట్లు, నిధుల విషయమై అనేక కొర్రీలు పెడుతున్నది. కేంద్ర ఆర్థిక విధానాలు తమ రాష్ట్రాలకు తీవ్రనష్టం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులైతే ప్రధాని తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఢల్లీి వేదికగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆందోళన కూడా చేపట్టారు. అయినప్పటికీ కేంద్రం తీరు మారలేదు. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రభుత్వాలను ఒకరకంగా, బీజేపీయేతర ప్రభుత్వా లను ఇంకోరకంగా చూస్తూ రాష్ట్రాలపై వివక్షను ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో పన్నుల వాటాలో ‘ఒక్క శాతం’ కుదింపును అమలు చేస్తే కేంద్ర,రాష్టాల మధ్య ఎడబాటు మరింత పెరిగే అవకాశం ఉన్నది.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page