విక్కీ కౌశల్.. విలక్షణ నటుడు
- ADMIN
- Feb 19
- 3 min read

చారిత్రక ఘట్టాలు, సంఘటనలను పాఠాల్లో చెప్పినంత సులభం కాదు వెండితెరపై ఆవిష్కరించడం. అవి రక్తికట్టాలంటే, నటుడు ఆ కథా ప్రపంచంలో ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ పాత్రల ఆహార్యాన్ని ఔపోసన పట్టాలి. వాటి తాలూకా జీవాన్ని ఆవాహన చేసుకోవాలి. అప్పుడే ఆ చిత్రాలు అజరామరం అవుతాయి. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో ఆ పనిచేస్తున్నాడు విక్కీ కౌశల్. నిజ జీవిత పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి, ఒక్కో మెట్టు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, వైవిధ్యమైన పాత్రలతో తనలోని నటుడికి సాన పెడుతున్నాడు. ‘సర్దార్ ఉద్దమ్’, ‘సామ్ బహదూర్’ సహా తాజాగా థియేటర్‌లో అదరగొడుతున్న ‘ఛావా’ పాత్రలన్నీ అలా వచ్చినవే.
ఒక రకంగా ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ విక్కీ కౌశల్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. అందులో సైనిక కమాండోగా అదరగొట్టారు. ఇక ‘సర్దార్ ఉద్దామ్’ అంటూ ఆ పాత్ర కోసం విక్కీ పడిన కష్టం తెరపై కనిపించింది. 40ఏళ్ల వయసులో 20ఏళ్ల కుర్రాడిలా కనిపించడం కోసం ఎంతో తపించాడు. 14కేజీల బరువు తగ్గి, ఆ తర్వాత అంతే బరువు పెరిగాడు. ఉద్దామ్ సింగ్ ప్రయాణంలో ఆ మార్పును మనం చూడొచ్చు. ‘ఆ పాత్ర చేస్తున్నప్పుడు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చింది’ అని చెబుతుంటాడు.
ఇక భారతదేశ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్‌షా జీవిత కథ ‘సామ్ బహదూర్’లో ఒదిగిపోయాడు. కేవలం ఆ పాత్రను ఆకళింపు చేసుకోవడానికే రెండు మూడేళ్లు సమయం కేటాయించాడు. గంటల తరబడి మానెక్ షా వీడియోలను, ఆయన గురించిన ఆర్టికల్స్‌ను చదువుతూ పాత్రకు సిద్ధమయ్యాడు. ‘మానెక్ షా నడక, మాటతీరు విభిన్నంగా ఉంటుంది. దాని కోసం చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఆయన ఇంటర్వ్యూలు పదే పదే చూసేవాడిని. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడిని. వారి కుటుంబ సభ్యులను కలిసి ఎన్నో విషయాలు నోట్స్ రాసుకునేవాడిని. రెండు, మూడేళ్లు సాధన చేసిన తర్వాత ఆయనలా నడవడం సాధ్యమైంది. అలాగే సంభాషణలు కూడా ఆయనలా అనుకరించడానికి సాధన చేశా’’ అంటూ తాను పడిన శ్రమను పంచుకుంటాడు విక్కీ కౌశల్. దాదాపు రెండున్నర గంటల ‘ఛావా’లో విక్కీ రాజుగా రాజసం ప్రదర్శించాడు. మాట తూలిన సహచరులను కోపంతో గద్దించాడు. శత్రుసేనలపై రుద్ర తాండవం చేశాడు. వీటన్నింటినీ మించి ‘శ్రీసఖి’ అంటూ భార్యను ప్రేమగా పిలిచే సగటు భర్తగా కనిపించాడు. శంభాజీ పాత్ర కోసం తనని తాను చెక్కుకున్నాడు. శారీరకంగా మానసింగానూ సిద్ధమయ్యాడు. వీరుడిలా కనిపించేందుకు 100కేజీలకు పైగా బరువు పెరిగాడు. అక్కడితో ఆగిపోలేదు. గుర్రపు స్వారీ, కత్తిసామే కాదు, పోరాట యోధుడి పాత్రకు ఏది అవసరమైతే దాన్ని తనలో ఆవాహన చేసుకున్నాడు. ‘ఛావా’ కథాగమనం అక్కడక్కడా ఇబ్బందులు పడినా, విక్కీ తన ఆరాతో అవేవీ కనపడనీయకుండా చేశాడు.
చారిత్రక పాత్రలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ విక్కీ కౌశల్‌లో ఉన్న ఓ విశిష్టతను గుర్తించాలి. మొదట ఆ పాత్రను మనం చేయగలమా? లేదా? అన్నది అంచనా వేయాలి. దాని కోసం పరిశోధన చేయాలి. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. ఆఖరికి ఆ పాత్రగా మారిపోవాలి. అప్పుడే సినిమా మెరుస్తుంది.. కాసులు కురిపిస్తుంది. విక్కీ ‘ఛావా’తో ఆగిపోయే రకం కాదు.. తనలో చేవ ఉన్నంత వరకూ చేసే రకం. భవిష్యత్‌లో మరిన్ని పాత్రలు ఆయన నుంచి రావడం ఖాయం..!!
మందు కొడతా- సంయుక్తా మీనన్

తెలుగు ,తమిళ, మలయాళ సినిమాల తో సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త ‘‘భీమ్లా నాయక్’’ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది . సాగర్ చంద్ర దర్శకత్వంలో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన ఈమే భామ ప్రేక్షకుల కంట్లో పడిరది. విరూపాక్ష సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటూ మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది సంయుక్త. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫోటోలను, షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. సంయుక్త సోషల్ మీడియాలో ఆక్టివ్ తనకు మందు కొట్టే అలవాటుందని, కానీ రెగ్యులర్ గా కొట్టను అని , స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంచెం తీసుకుంటానని నిజం చెప్పింది. భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసారలో నటించింది. సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమా చేసి హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. తమిళంలో ధనుష్ సరసన చేసిన ‘‘సార్ ‘‘సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో సౌత్ లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు బింబిసార2, స్వయంభు, అఖండ2 సినిమాలతో బిజీగా ఉంది సంయుక్త మీనన్.
పూజాహెగ్డేకు సూపర్ చాన్స్

ఈమధ్య పూజాహెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. కొత్తమ్మాయిల హవా వల్ల పూజా కాస్త సైడ్ అయ్యింది. ఇప్పుడు తనకు ఓ సూపర్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాలో తాను ఓ ప్రత్యేక గీతం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబోలో ‘కూలీ’ అనే ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగా ర్జున ఓ కీలక పాత్ర పోషిస్తు న్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉంది. ఆ పాటలో పూజా హెగ్డే కని పించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పూజాతో.. చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, పూజా కూడా ఈ పాటలో నర్తించడానికి ఒప్పుకొందని సమా చారం అందుతోంది. పూజాహెగ్డేకి ఐటెమ్ గీతాలు చేయడం కొత్తేం కాదు. ‘రంగస్థలం’, ‘ఎఫ్ 3’లాంటి చిత్రాల్లో ఐటెమ్ భామగా మెరిసింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి నటించడం ఇదే తొలిసారి. కాబట్టి తనకు ఇది మంచి అవకాశమే. పైగా ఇది లోకేష్ కనగరాజ్ సినిమా. ఎన్ని విధాలుగా చూసినా పూజాకు ఇది మంచి అవకాశం.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
Comentários