వికృత చేష్టల్లో వారు మాస్టర్లు!
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 2 min read
తరగతి గదులే వారికి వ్యక్తిగత ఆవాసాలు
విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు, దూషణలు
బోధన కంటే సొంత వ్యాపకాలకే ప్రాధాన్యం
ఆమదాలవలస డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకుల ఆగడాలు
విచారణలు జరుగుతున్నా వెలుగుచూడని నివేదికలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులే వక్రమార్గం పట్టి వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన విద్యాసంస్థను అప్రతిష్ట పాల్జేస్తున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వీరి వెకిలి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకుల తీరుపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యాపకులు బోధన చేయకపోగా విద్యార్ధుల పట్ల అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరిస్తూ పవిత్రమైన తరగతి గదులను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు జిల్లా గ్రీవెన్స్‌సెల్‌లో విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. సదరు అధ్యాపకులు విధులకు ఆలస్యంగా రావడం, చాలా సందర్భాల్లో రాకుండానే వచ్చినట్టు హాజరు వేయించుకుని కళాశాల సమయాల్లో వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలున్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్ మందలిస్తే ఎదురుతిరగడమే కాకుండా తిరిగి ఆయనపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో వైకాపా, ఇప్పుడు టీడీపీ నాయకుల ప్రాపకంతో వీరిద్దరూ చాలా ఏళ్లుగా ఈ కళాశాలలోనే తిష్ట వేశారు. విద్యార్థులు అనేకమార్లు ఫిర్యాదు చేసినా రాజకీయ నాయకుల అండ ఉన్న వీరిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సహచర అధ్యాపకులను ప్రేరేపిస్తూ వారి వృత్తికి ఆటంకం కలిగిస్తున్నారని, తమకు అడ్డుచెప్పేవారిపై ఎదురు ఫిర్యాదులు చేయడం వీరికి పరిపాటి అని తెలిసింది.
ఫిర్యాదుల పరంపర

(విద్యార్ధులను విచారిస్తున్న ఆర్జేడీ కృష్టాజీ ఫైల్ ఫోటో)
వీరి ఆగడాలపై విద్యార్ధులు ఉన్నతవిద్య కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యల్లేవు. గత డిసెంబర్‌లో ఉన్నతవిద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు జనవరి రెండో తేదీన ఆర్జేడీ వచ్చి విచారణ జరిపి కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. కానీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దాంతో విద్యార్థులు జనవరి 28న మరోసారి గ్రీవెన్స్‌లో క£లెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ అధికారులు ఈ ఫిర్యాదును కమిషనరేట్‌కు పంపినట్లు చెబుతున్నా ఇంతవరకు దానిపై చర్యలు లేవు. కాగా ఫిuవ్రరి 3న కలెక్టర్‌కు, అదే నెల 10న కమిషనర్‌కు మళ్లీ విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా మార్చి 28న కలెక్టర్ పీజీఆరఎస్(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ స్వయంగా ఉన్నతవిద్య కమిషనర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి స్పందించిన కమిషనర్ ఉన్నత విద్యాశాఖ రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ పీవీ కృష్టాజీని విచారణ అధికారిగా మరోమారు నియమించారు. ఆ మేరకు ఏప్రిల్ 22న కళాశాలకు వెళ్లిన ఆర్జేడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ అధ్యాపకుడు సాయికుమార్, పొలిటికల్ సైన్స్ గెస్ట్ ఫ్యాకల్టీ కింతలి జగన్నాధంలతోపాటు విద్యార్ధులు, కాలేజీ సిబ్బందిని వేర్వేరుగా విచారించి వివరాలు సేకరించారు. అందరికీ క్వశ్చనీర్ ఇచ్చి వాటికి అవును, కాదు.. అని సమాధానాలు తీసుకున్నారు. తరగతి గదిలో నిద్రిస్తున్నారా..? పాఠాలు చెబుతున్నారా..? సమయానికి తరగతికి వస్తున్నారా..? విద్యార్ధులను దూషిస్తున్నారా..? విద్యార్థినుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. కాలేజీలో మÖడేళ్ల ఫేస్ రికగ్నిషన్ హాజరుతో పాటు, మాన్యువల్ హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉంచాలని విచారణ అధికారి కాలేజీ ప్రిన్స్‌పాల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. 2025`26 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్ధుల హాజరు రికార్డు, అడ్మిషన్లు, సబ్జెక్ట్, లెక్చరర్ వారీగా వేర్వేరుగా పŸరీక్ష ఫలితాలను, సిబ్బంది రిజస్టర్లు, ఫైల్స్‌ను పరిశీలించారు. రెండు గంటల్లోనే విచారణ, రికార్డుల పరిశీలన పూర్తి చేసేశారు. అయితే విచారణ జరిగి పది రోజులు గడిచినా ఇప్పటి వరకు కమిషనరేట్‌కు నివేదిక ఇవ్వలేదని తెలిసింది.
సంతకాల ఒత్తిడి
ఆర్‌జేడీ విచారణ అనంతరం ఇంగ్లీష్ అధ్యాపకుడు సాయికుమార్ తన సహచరుడైన సంపతిరావు శశిభూషణరావు బంధువైన కనుగులవలసకు చెందిన టీడీపీ మండల నేత ద్వారా స్థానిక పార్టీ నేతతోను, ఇక గెస్ట్ ఫ్యాకల్టీ జగన్నాధరావు సరుబుజ్జిలి మండలం అమృత లింగాపురానికి చెందిన మాజీ సర్పంచ్ పేడాడ చిరంజీవి ద్వారా వైకాపా మాజీ ప్రజాప్రతినిధితో ఆర్జేడీ, కమిషనర్లకు ఫోన్ చేయించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సిఫార్సు చేయించినట్లు తెలిసింది. దాంతోపాటే తమపై ఫిర్యాదు చేసిన విద్యార్థుల కుటుంబాలకు సన్నిహితంగా ఉన్న ఉద్యోగులు, పెద్దల ఇళ్లకు వెళ్లి కలిసినట్టు తెలిసింది. తమపై చేసిన ఫిర్యాదు ప్రేరేపితమైనదని పేర్కొంటూ తయారు చేసిన ఒక లెటర్‌పై సంతకం చేయమని ఆమదాలవలస మండలం తిమ్మాపురానికి చెందిన ఒక విద్యార్ధినిని పిలిపించి ఆమె సన్నిహితుల ద్వారా సాయికుమార్, జగన్నాధరావు ఒత్తిడి చేయించినట్టు తెలిసింది. ఇందుకు ఆమె తిరస్కరించినట్టు సమాచారం. ఇలా పలువురు విద్యార్థులపై కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా ఒత్తిడి సంతకాల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.






Comments