‘సత్యం’ కథనానికి స్పందించిన సేవామూర్తులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక ఇండియన్ ఆర్మీ కాలింగ్ హాస్టల్‌లో విద్యార్థినులు ఆకలితో ఉన్నారని ‘సత్యం’ బుధవారం ప్రచురించిన కథనంపై జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ స్పందించింది. స్థానిక దీపామహల్ వెనుక ఉన్న బ్యాంకర్స్ కాలనీలో బాలికల హాస్టల్‌లో గురువారం రాత్రి దాదాపు 120 మంది బాలికలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బీవీ రమణ జైలుపాలవడంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు భోజనం లేకుండాపోయింది. వసూలు చేసిన సొమ్ములు, ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేయడం ద్వారా సంపాదించిన సొమ్ములన్నీ రమణ సంస్థ ఖాతాలో ఉంచకపోవడంతో హాస్టల్‌లో రేషన్ నిండుకుందని ‘సత్యం’ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన రెడ్‌క్రాస్ చైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు ప్రస్తుతం హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ముందుగా వద్దని చెప్పడంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నారు. మళ్లీ ఫోన్ చేసి గురువారం రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయగలరా? అంటూ కోరడంతో అప్పటికప్పుడు పీఎన్ కాలనీలో ఉన్న పంచాయతన వినాయక దేవాలయంలో వండిరచి రెడ్‌క్రాస్ సభ్యులతో భోజనాలు ఏర్పాటు చేయించారు.

Comments