వైఫ్ స్వాపింగ్..!
- Guest Writer
- Sep 12
- 3 min read
చాపకింద నీరులా విదేశీ పశు సంస్కృతి
భర్తలను, భార్యలను మార్చుకునే పబ్బులు
మగవాడు షర్టు, ష్యుస్ ధరించాలి
స్త్రీలు బ్రా లేకుండా బనియన్లు, మిడ్డీ, చెడ్డీలు వేయాలిట
ఇదెక్కడి ఆటవిక పశునాగరికత?
వారి పిల్లలు సమాజం దృష్టిలో హీనమైపోరా?
వైవాహిక సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పెళ్లాలను, భర్తలను మార్చుకునే/ ఏమార్చుకునే పాశ్చాత్య విషసంస్కృతి భారత్‌లోని హైదరాబాదుకు దశాబ్ద కాలంగానే గుట్టుచప్పుడుగా దాపురించింది. ఇపుడు తన విషసంస్కృతి వేళ్లని విస్తరిస్తోందనిపిస్తోంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త.. వాడి పెళ్లాన్ని ఇంకొకడికి అప్పజెప్పి వాడి పెళ్లాన్ని వీడు అనుభవిస్తూ.. తమ విశృంఖల సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఆనందించే విదేశీ పశుసంస్కృతీ చాపకింద నీరులా ప్రపంచీకరణ ముసుగులో నేడు మన హైందవ సమాజంలోకి వేళ్లూనుకుని వచ్చింది. ఇది ముమ్మాటికి ఆటవికం.. అనాగరికం.
కొన్ని గిరిజన ఆటవిక తెగల్లో ఇటువంటి దుష్ట సంప్రదాయం ఉందో లేదో గానీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో బడాబాబులు ఉండే కొన్నిచోట్ల ముంబై, కలకత్తా లాంటి ప్రాంతాల్లో భర్తలను, భార్యలను మార్చుకునే వీకెండ్ గెట్ టు గెదర్ నైట్ వైఫ్ స్వాపింగ్ పబ్బులు వెలిశాయి. వీటిల్లో ప్రవేశం.. మగవాడు విధిగా షర్టు, ష్యుస్ ధరించాలి’ట. స్త్రీలు బ్రా లేకుండా బనియన్లు ధరించి శృంగారం ఉట్టిపడేలాగా మిడ్డీలు, చెడ్డీలు ధరిస్తేనే అటువంటి పబ్బుల్లోకి రావడానికి అనుమతిస్తారు’ట. ఎంట్రీ ఫీజు 5వేల రూపాయలకు తక్కువ ఉండదు’ట. వీరు ప్రయాణించి వచ్చిన వెహికిల్ కార్ తాళంచెవిలు పబ్బులో ఉండే ఒక బుట్టలో వేయాలి’ట. అలా వచ్చిన వాళ్లంతా తమ కారు తాళాలను బుట్టలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత లాటరీ తీస్తారు లేదా లైట్స్ ఆఫ్ చేసి, ఎవరి చేతికి అవతలి వాడి.. ఏ తాళంచెవి దొరికితే, వాడి పెళ్లాన్ని వీడు.. వీడి పెళ్లాన్ని వాడు.. అప్పుడు లాటరీలో ఒకడి పెళ్లాన్ని మరొకడు స్వాధీనం చేసుకుంటాడు.
పీకల దాకా తాగినంత మందు రాత్రంతా చిందులు డాన్సులు చేస్తూ.. ఆ ఇద్దరూ ఆడ నెమలి.. మగ నెమలి మాదిరిగా ఆడి పాడి.. అలసి సొలసి బహిరంగంగా తమ కామకోర్కెలు పబ్బులోనే సామూహికంగా తీర్చుకుంటారు. ఇలా చేయడానికి వాళ్లకు సిగ్గు, మానం ఏమీ ఉండవు. అంతా నగ్నంగానే ఉంటాయి. పవిత్రమైన ఈ భారతదేశంలో ఇదేమి దుర్మార్గమైన సంస్కృతి.. ఇదెక్కడి ఆటవిక పశునాగరికత???
గ్రామీణ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఒకడి పెళ్లాంతో మరొకడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటూ.. వరిగడ్డి వాములోనో, పొలం దగ్గర షెడ్లలో, చెట్ల పొదల్లోనో, పొలాల గట్ల మీద తమ లైంగిక దేహ కోరికలు తీర్చుకునేవాళ్లట.
ఇలా వారిద్దరి గురించి తెలిసిన ఊరంతా అమ్మలక్కలు గుసగుసలాడేవాళ్లు. ఇలా.. ఆ ఊరంతా వారిద్దరి రంకు తెలిసిపోయేది. ఇది కాస్తా రచ్చబండ దాకా పంచాయితీ చేరేది. భర్త ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడిని మస్కా కొట్టించి రకరకాల రుచుల కోసం నేడు ఆంటీలు అంతా పబ్బులకు అలవాటుపడ్డారు.
డైలీ మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు తిని బాగా బలిసి కొవ్వు పట్టి.. కండబట్టి.. కామ కోరికలు తీర్చుకోవడం కోసం కామాన్ని అణిచివేసే తనకంటే చిన్నవాళ్లైన యువకుల కోసం పబ్బుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం తనను ఆశ్రయించిన తన స్నేహితురాలిని భర్తకు పరిచయం చేస్తూ.. అది పడకగది దాకా దారి తీసేలాగా భార్యలే భర్తలను తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ.. మాటలను రికార్డు చేస్తూ.. తన వ్యభిచారానికి అడ్డు రాకుండా.. భర్త ఇతర స్త్రీలతో లైంగిక సంబంధాలు ఉన్నాడని పదే పదే భర్తను అనరాని మాటలతో వేధించుకు తినడంతో భర్త అనేవాడు కుక్కిన పేను లాగా ఉండాల్సిన పరిస్థితి భార్యలే కల్పిస్తున్నారు.
పూర్వకాలంలో కుక్కలు నాకిన తిండి మరొకరు తినేవారు కారు. అర్థమై ఉంటుంది.. ఒకడు అనుభవించిన పెళ్లాన్ని మరొకడు అనుభవించడం కుక్క నాకిన ఎంగిలి తిండితో సమానం. ఏది ఏమైనప్పటికీ అటువంటి పెళ్లాలను మొగుళ్లను ఎక్సేంజి చేసుకునే పబ్బులపై దాడులు చేసి, అవి మూసివేసేంత వరకు పోరాటాలు చేయాలని సంఘసంస్కర్తలకు మనవి.
తల్లి ఒకడితో, తండ్రి మరొకదానితో చిత్తకార్తె కుక్కలాగా తిరుగుతూ లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి పిల్లలు సమాజం దృష్టిలో హీనంగా, అవమానంగా తలెత్తుకోలేక చావులేక చస్తూ జీవిస్తున్నారు. ఒరేయ్ మీ మమ్మీ పలాన వాడితో పడుకుంది అంటే.. ఎంత అవమానం. ఒరేయ్ మీ డాడీ ఫలానా ఆంటీతో రొమాన్స్‌లో మునిగితేలుతున్నాడు అంటే పట్టరాని కోపం వస్తుంది. పిల్లలు తమ తల్లి, తండ్రి పెళ్లాలను, భర్తలను మార్చుకునే పబ్బులకు పోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎటు ఎటు పోతుంది సమాజం.
ఒక భర్తకు ఒక భార్య అనే సమాజం పోయి.. ఒక భర్తకు అనేక మంది రసిక స్త్రీలైనా భార్యలు.. ఒక స్త్రీకి చెప్పలేనంత మంది ప్రియులు. అమెజాన్ ఆన్‌లైన్‌లో వస్తువులు దొరికినట్లు బజారులో కాల్ బాయ్స్ యాప్స్ వచ్చేశాయి. కోరుకున్న యువకుడిని బుక్ చేసుకుని ఆనందిస్తున్నారు. శీలం మానం ప్రాతిపత్రం పబ్బులకు అలవాటైన ఆంటీలకు పాత చింతకాయ పచ్చడిలాగా కనిపిస్తుంది. అందుకే మహా కవులు అంటారు కల్చర్ ఎక్కువైతే.. ఒకడి పెళ్లాన్ని మరొకడు లేపుకెళ్లే సంస్కృతి సమాజానికి దాపురిస్తుందని చాటిచెప్పారు.. అది నిజం చేస్తున్నారు.
నేటి ఆధునిక పోకడలు గలిగిన భార్యభర్తలు.. రాసలీలలకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్యలను భర్తలను మార్చుకునే పబ్బులు మూసి వేసేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని అనాదిగా భారత్‌లో వస్తున్న వైవాహిక సంస్కృతీ సంప్రదాయాలను వీలైనంత కాపాడాలని, సంసారపక్షం కలిగిన మహిళ లోకాన్ని సమాజ హితవు కోరే సాంఘిక సంస్కర్తలను సోషల్ యాక్టివిస్టులనూ మనఃస్ఫూర్తిగా చేతులెత్తి కోరడమైనది. ఈ విషయం గురించి ఎక్కువగా చర్చలు జరిపి ఆలోచించి నిరోధించవలసినదిగా ప్రార్ధిస్తూ..










Comments