top of page

వాయువే ఆయువు తీస్తోంది!

Writer: DV RAMANADV RAMANA

ప్రపంచంలోనే అధికంగా ఢల్లీి ఆవరణం విషం చిమ్ముతోంది. ప్రజల ప్రాణాలపై ముప్పును కమ్ముతోంది. అడుగు బయట పెడదామన్నా హడలిపోవాల్సి వస్తోంది. చలిపులి దీన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేసింది. వారం రోజుల్లోనే పరిస్థితి పీక్‌స్టేజ్‌కు వెళ్లింది. వాయువే ప్రజల ఆయువు తగ్గిస్తోంది. తీవ్రమైన కేటగిరి నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి నెట్టిబడిరది. ఊపిరి పీల్చేందుకే జనాలు అల్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత సూచి ఏకంగా 500 చేరుకుంది. దీంతో ప్రజలు ఎయిర్‌ ప్యూరిఫైయర్లు, మాస్క్‌ లను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతలా ఢల్లీి నగరం కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ‘గాలిలో దుమ్ము, ధూళి పెరుగుతుంటే, కాలుష్యం ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంటే ఏం చేస్తున్నారు. గాలి నాణ్యత సూచి 300 ఉన్నప్పుడే చర్యలెందుకు తీసుకోలేదు, తక్షణమే కాలు ష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌(గ్రాప్‌)-4 కింద ఆంక్షలు విధించండి’ అని జాతీయ రాజధాని సరిహద్దులోని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఢల్లీి ప్రభుత్వం కళ్లు తెరిచింది. ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు భౌతిక తరగతులు నిలిపేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సీఎన్‌జీ, ఎలక్ట్రికల్‌ వాహ నాలు మినహా మిగిలిన వాటిపై ఆంక్షలు విధించింది. ఢల్లీి అంటే దేశ పాలనా కేంద్రం. కోట్లాది ప్రజల ఉపాధికి గమ్యస్థానం. అలాంటి ప్రదేశం ఇప్పుడు అత్యంత కాలుష్య నగరంగా మారిపోయింది. సందట్లో సడేమియా అన్నట్టు ‘ఇలాంటి నగరాన్ని దేశ రాజధానిగా కొనసాగించాలా’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు అనాలోచితం. ఢల్లీిలోని గాలిని పీల్చడమంటే ప్రతిరోజు 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానం అని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ ప్రకారం కాలుష్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఢల్లీి ప్రజల జీవిత కాలం పదేళ్లు తగ్గుతోంది. కాలుష్య ధాటికి ప్రజలు కండ్ల మంటలతో అల్లాడిపోతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చర్మవ్యాధులు చిరాకు తెప్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రతి ఏడాది చలి కాలంలో ఢల్లీిలో ఇలాంటి స్థితి ఎదురవుతూనే ఉంది. ఏడాదికేడాది నగరంలో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. కానీ ఈ ఏడాది పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. సమీప వాహ నాలు కూడా కనబడని దుస్థితి.. దీని ప్రభావం రైళ్లు, విమానాల రాకపోకలపైనా పడిరది. దీపావళి తర్వాత బాణాసంచా ప్రభావం కూడా ఢల్లీి పొల్యూషన్‌ను మరింత పెరిగేలా చేసింది. బాణాసంచాపై ఆంక్షలున్నా వాటిని అధికారులు పటిష్టంగా అమలు చేయలేకపోయారు. దీన్ని కూడా సుప్రీం తీవ్రంగా పరిగణించింది. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది దీపావళి నాటికి నగరంలో వేడి, కాలుష్యం అధికంగా ఉన్నాయన్న సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్వైనార్‌మెంట్‌ నివేదికను అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వెంటనే చెప్పాలని ఢల్లీి ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రపంచ పర్యావరణ సంస్థ గ్రీన్‌ పీస్‌ ప్రపంచ నగరాల్లో కాలుష్యంపై 2018లో ఓ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం ప్రపంచంలోని 30 నగరాలను అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించగా అందులో 22 నగరాలు ఒక్క భారతదేశంలోనే ఉన్నట్టు తేలింది. ఆ నగరాలన్నీ ఢల్లీికి 80 కిలోమీటర్ల సమీపంలో ఉన్నాయి. ఇక స్విస్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వాతావరణ కాలుష్యంలో ఢల్లీి ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందని తేల్చి చెప్పింది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. అయితే కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే పంట వ్యర్థాల కంటే ఢల్లీి చుట్టు పక్కల ప్రాంతాల్లోని పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాలు ప్రధాన కారణంగా ఉన్నాయనేది వాస్తవం. అలాగే అక్కడ కాలుష్యానికి మరో కారణం వాహనాల పొగ. నగరంలో రోజుకు సుమారు 30 లక్షల వాహ నాలు రోడ్డెక్కుతున్నాయని ఢల్లీి ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం, దేశ రాజధాని అయిన ఢల్లీి రక్షణ బాధ్యత కేంద్రంపైనే ఉంటుందని మోడీ ప్రభుత్వం గుర్తించాలి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంపై పెట్టే ఆసక్తిలో కొంతైనా వారి ఆరోగ్యంపై పెట్టాలి. కాలుష్య కోరల నుంచి ఢల్లీి నగరాన్ని కాపాడాలి. వాహనాల రద్దీని నియంత్రించాలి. చలికాలం రాకముందే ఢల్లీిలో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ పక్కా ప్రణాళిక రూపొందించాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పెంచేవిధంగా చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలను నియంత్రించే దిశగా ఆలోచించాలి. కేంద్రం వెంటనే వీటిపై దృష్టిపెట్టకపోతే అతి త్వరలోనే లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

 
 
 

댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page